సెప్టెంబర్ 1998 వ సంవత్సరంలో ఒక ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషను గా స్థాపించబడింది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 19,604 మంది పనిచేస్తారు. ఇదివరకు నోవెల్ కంపెనీ సీఈవో (CEO)గా పనిచేసిన ఎరిక్ ష్మిడ్త్ ప్రస్తుత గూగుల్ సీఈవో.
గూగుల్ అనే
పదం గూగోల్ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్ అనేది ఒకటి పక్కన వంద
సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.
గూగుల్ యొక్క
సేవలు ఎన్నో సర్వర్ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్ క్షేత్రం
ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్సు
వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక
లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం
ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%), ఎమ్.ఎస్.ఎన్ (13%)ను దాటి 54%
మార్కెట్ వాటా కలిగి ఉంది గూగుల్. గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల
అభ్యర్ధనలను స్వీకరిస్తుంది!
గూగుల్ యొక్క ప్రధాన వ్యాపారం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మీదే ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్య పదాల ఆదారంగా సంభందిత అంశం గుర్చిన సమాచారం(వెబ్సైటులు) తో పాటు చిత్రాలను, వార్తా విశేషాలతో పాటూ పరిశీలన చేయబడిన శాస్త్రీయ వ్యాసాలకు సందించిన సమాచారం కొరకు కూడా వెతకవచ్చు.
--
"ఇరవై శాతం" సమయం:
ప్రతీ గూగుల్ ఇంజనీరు తమ పని గంటలలో 20 శాతం సమయాన్ని తనకు నచ్చిన ప్రాజెక్ట్ పైన పని చేసే వీలు కల్పించబడింది.ఈ సమయాన్ని వారంలో ఒక రోజు కానీ మొత్తం కేటాయించిన సమయాన్ని సమీకరించి ఒక నెలగా కానీ వాడుకోవచ్చు. ఇలాంటి స్వయంసిద్ధ కృషి వలన జనించినవే ఆధునిక గూగుల్ పరికరాలు అయిన జీమెయిల్, గూగుల్ న్యూస్,ఆర్కుట్ లాంటి సేవలు.
ఐ.పి.ఓ మరియు గూగుల్ వ్యవహారిక సంస్కృతి:
చాలా మంది గూగుల్ ఐ.పి.ఓ తో కంపెనీ కల్చర్ లో మార్పు వస్తుందని ఊహించారు,
ఉద్యోగుల ప్రయోజనాలు షేర్ హోల్డర్ల ఒత్తిడి వలనో, లేక కాగితం మీద
కోటీశ్వరులవడం మూలానో మారవచ్చని ఊహించారు.. కానీ అలాంటివీ ఐ.పీ.ఓ వల్ల
జరగవని గూగుల్ సృష్టికర్తలయిన సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ లు ఒక నివేదికలో పేర్కొన్నారు. తరవాత పేజ్ "మేము మా సంస్కృతి, సరదా తత్వం కాపాడటానికి చాలా ఆలోచిస్తామని" అన్నారు.
గూగుల్ పెరుగుతున్నకొద్దీ ఆ సంస్థ "కార్పొరేట్" లాగా అవుతుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. 2005 వ సంవత్సరములో ప్రముఖ అమెరికా ఇంగ్లీష్ దినపత్రిక ది న్యూయార్క్ టైమ్స్, ఇంకా ఇతరులు గూగుల్ వ్యతిరేక వ్యాపారీకరణ(యాంటీ కార్పొరేట్), చెడు చెయ్యకూడదనే తత్వం కోల్పోయిందని చెబుతున్నారు.

