Thursday, 19 May 2011

టెలిఫోన్ - మొబైల్ ఫోన్లు


గంటలలో అయ్యేపనిని టెలిఫోన్ సాయంతో నిమిషాల్లో చేయవచ్చు. కానీ, తెలివిగా వాడకుంటే టెలిఫోన్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మొబైల్ ఫోన్లు లేని కాలంలో కొన్ని కాల్స్ తప్పించుకునే వీలు ఉండేది. ఇప్పుడు ప్రతివాళ్ళ చేతిలోనూ ఒక ఫోన్ ఉంటుంది. ఎదురుగా ఉన్నవారు ఎంత ముఖ్యమైన మనుషులైనా, జరుగుతున్నది ఎంత ముఖ్యమైన చర్చ అయినా, ఫోన్ వచ్చిందంటే ధ్యాసంతా అటువేపు మళ్ళక తప్పదు. ఇంతాచేస్తే ఆ సంభాషణ ఎందుకూ పనికిరానిదై ఉంటుంది. అందుకే టెలిఫోన్ వాడకంలో కొన్ని నియమాలు ఉండాలి.
1. కాల్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి.
ఎవరికి కాల్ చేస్తున్నాం? ఎందుకు కాల్ చేస్తున్నాం? మాట్లాడవలసిన ముఖ్యమైన విషయమేంటి? ఈ ప్రశ్నలకు సరైన జవాబులు మనసులో ఉంటే, కాల్ నిడివి నిర్ణయమైపోతుంది. మనం తీరికగా ఉండి మిత్రులను ఊరికే పలకరించడానికి ఫోన్ పట్టుకున్నామనుకుందాం. అవతలివారు ఎంత తీరికగా ఉన్నారు? ఎవరిమధ్యన ఉన్నారు? ఎటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు? మనకు ముందే తెలియదు. అనుకూలంగాని సమయంలో ఫోన్ చేస్తే ఎంతటి నేస్తాలైనా చిరాకు పడతారు. అందుకే ముందుగా ప్లాన్ చేసుకున్న కాల్స్ తొందరగా ముగుస్తాయి.
2. ఎక్కడ ఉన్నారు?
ఇదొక చ్యూయింగ్ గమ్ ప్రశ్నగా మారింది. మొబైల్ ఫోన్ గనుక మనం ఎక్కడఉన్నా జవాబు చెప్పగలుగుతున్నాం. కానీ, ఎక్కడ ఉన్నామన్నది ప్రశ్న కాదు. మాట్లాడడానికి వీలుందా? లేదా? అనేది ప్రశ్న! సాధారణంగా బిజీగా ఉండి, ‘నేను నీకు తిరిగి ఫోన్ చేస్తానులే!’ అంటాడు ఒక ఫ్రెండు. ఒకనాడు ఫోన్ చేస్తే ఢిల్లీలో ఉన్నాను తీరికగా మాట్లాడవచ్చు! అన్నాడు. కానీ, నాకు తీరిక ఉందా? లేదా అని అడగలేదు!
3. నేరుగా విషయానికి రావాలి!
బంధువులతో గానీ, మిత్రులతో గానీ, లేక వ్యాపారం, ఉద్యోగ సంబంధంగా గానీ, ఎవరితో మాట్లాడుతున్నా, అసలు విషయం గురించి ముందు ప్రకటించాలి.
ఫలానా సంగతి గురించి మాట్లాడాలి. ఇప్పుడు కుదురుతుందా? అని అడగడానికి మొహమాటం అడ్డురాకూడదు. 99 శాతం వరకు ఎవరూ ఎవరికీ ఊరికే కాల్ చేయరు. కానీ నేరుగా విషయం చెపితే మొరటుగా ఉంటుందని అందరమూ అనుకుంటాము. కనుక, ముందేవో ‘లైట్’ మాటలు మాట్లాడి, తర్వాత నెమ్మదిగా విషయానికి రావడం అలవాటుగా మారింది. లైట్ మాటలు కూడా అవసరమే. కానీ సమయం, సందర్భం కుదిరి ఉండాలి.
4. స్థలం, సందర్భం సరిగ్గా ఉండాలి.
మొబైల్ ఫోన్‌లు వచ్చిన తర్వాత కొత్త సమస్య ఒకటి పుట్టుకు వచ్చింది. ఎక్కడున్నామనేది గమనించకుండా నిజంగా ప్రైవేట్ విషయాలు గురించి పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. సందర్భం తెలుసుకుని సమయం కాదని చెప్పి, తర్వాత ఎప్పుడో మాట్లాడవచ్చు. ప్రయాణం సమయంలో పనేమీ ఉండదు గనుక లవ్ నుంచి మొదలు అన్ని సంగతులనూ, రేడియోలో లాగ అందరికీ ప్రసారం చేస్తున్నారు కొందరు! వాళ్లకు అభ్యంతరం లేకపోవచ్చు గానీ, వినేవారికి ఎంత ఇరకాటంగా ఉంటుందో ఊహించాలి.
5. తగిన సమయం ఏమిటి?
బిజినెస్ కాల్స్‌కు కొంత, సొంత కాల్స్‌కు కొంత ‘అనుకూలమైన’ టైం ఉండాలి. మనం తరుచుగా కాల్ చేయవలసిన వారికి, ఏ సమయం సరైంది? అని ముందే అడిగి తెలుసుకోవాలి. మనకు కాల్ చేసే వారికి కూడా మన టైమింగ్స్ గురించి చెప్పాలి. కొంత కాలానికి ఆ సమయం వచ్చిందంటే చాలు... కాల్ వస్తుందని ఎదురు చూచేదాకా వస్తుంది పరిస్థితి. ఇది ఇరువేపుల వారికీ, అనుకూలంగా ఉంటుంది.
6. రాంగ్ నంబర్ ప్లీజ్!
అది మామూలు ఫోన్ గానీ, మొబైల్ గానీ రాంగ్ నంబర్లు తప్పడం లేదు. మామూలుగా కాల్‌చేసే వారయితే, వాళ్ళ పేరు మొబైల్ ఫోన్లలో కనపడుతుంది. ‘అంకెలు కనబడ్డాయంటే అది అనుమానం కాల్ కింద లెక్క. తప్పుడు నెంబరుకు ఫోన్ చేయడం తప్పుకాదు. అందుకు ఏదో కారణం ఉంటుంది. నేను మీరనుకుంటున్న వ్యక్తిని కాదు అని చెప్పినా కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు. రాంగ్ కాల్స్‌కు చేతయినంత గౌరవంగా ప్రశాంతంగా జవాబునివ్వాలి. చికాకు పడితే మన మూడ్ పాడవుతుంది తప్ప మరోటి లేదు. మనమయినా, కాల్‌చేసి, అవతలివ్యక్తి ఎవరో తేల్చుకోకుండా నేరుగా సంభాషణలోకి దిగకూడదు. గొంతు గుర్తించ గలిగితే ఫరవాలేదు. అందులోనూ చిక్కులుంటాయి. ఒక మిత్రునికి ఫోన్ చేసి, ‘ఏరా! గాడిదా? ఇంకా నిద్రలేవలేదా?’ అన్నాను. అవతలగొంతు ‘నిజమే! మీ గాడిద నిద్ర లేవలేదు. నేను నాన్న గాడిద, లేదా గాడిద నాన్నను’ అంది. నేను గతుక్కుమన్నాను!
7. ఇంకా ఏమిటి సంగతులు?
మాట్లాడవలసిన విషయం ముగుస్తుంది. మనకు కావలసిన సమాచారం దొరుకుతుంది. దొరకదు. అప్పుడు మరో చ్యూయింగ్ గమ్ ప్రశ్న! ఇంకా ఏమిటి? సంగతులు? అని ఈ ప్రశ్నకు మామూలుగా దొరికే జవాబు ఏముంటాయి? నీవే చెప్పాలి!’ అని, అడగగానే అదే జవాబు వస్తుందని తెలుసు. అయినా అడగవలసిందే!
మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, మానవ సంబంధాలలో ఏరకంగా మార్పులు వచ్చిందీ, పరిశీలన జరగవలసి ఉంది. మనవాళ్ళు ఎక్కడున్నారు అన్న అనుమానం మాత్రం సులభంగా తీరుతున్నది. పోతే రకరకాల కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. ఫోన్ ఉండి కూడా జవాబు చెప్పకపోతే మాత్రం అపార్థాలు తప్పవు. సౌకర్యాన్ని సరిగ్గా వాడుకున్నంత సేపే, అది సౌకర్యం.!

-- 

Wednesday, 18 May 2011

గెలిచిందెవరు?


గెలిచిందెవరు?

కడప ఉప ఎన్నికల్లో ప్రచార తీరు, హోరు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఫలితాలు చూసి ఇంకా ఎక్కువ మంది హడలిపోయారు. ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యానికి గురైందా? ఎన్నికల్లో గెలుపును అడ్డం పెట్టుకుని అడ్డగోలు అక్రమాలకు, సంపాదనకు పాల్పడ్డా ప్రజల్లో చలనం లేదా? చైతన్యం లేదా? ఇంతింత డబ్బు పంపకాలకు అలవాటు పడ్డాక ఎన్నికల పట్ల ఓటర్ల ఆలోచనలను ఎప్పటికైనా మార్చగలమా? ఇలా అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ పరిస్థితి ఒక్క రోజులో రాలేదు. కొన్ని దశాబ్దాలుగా నూరిపోసిన భావజాలం, ఐడియాల ఫలితమిది. విలువలిలా పడిపోయాయేమిటా అని ఇప్పుడు వగచి ఎమీ లాభం లేదు.

స్వాతంత్య్రం తర్వాత మనం ఎంచుకున్న సోషలిస్టు పంథా ప్రకారం దేశ ప్రజల సంపాదన, సహజవనరులు, ప్రజల స్వేచ్ఛ, చివరికి వారి ఆలోచనా సరళి అన్నీ ప్రభుత్వపరమై పోయాయి. అంతులేని అధికారాలు, వచ్చిపడిన పన్నుల సొమ్ముతో పంపకాల కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రజల్ని రకరకాల సమూహాలుగా విభజించి, ఏదో ఒకటి ఉచితంగా ఇచ్చి, వారిని స్వప్రయోజన వర్గాలుగా తయారు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక వర ్గం, షెడ్యూల్డు కులాలు ఒక వర ్గం, రైతులు ఒక వర్గం, మైనారిటీలు, బిసిలు, దీపం మహిళలు, డ్వాక్రా మహిళలు, సొంత జిల్లావారు, సొంత కులం, సొంత పార్టీవారు-ఇలా ఒకటికాదు, ఎన్ని రకాలుగా విభజించొచ్చో చూపించారు.

నాయకుల, పార్టీల సృజనాత్మకత అంతా ఎన్నికల సమయానికి కొత్త వర్గాలను తయారు చేయడం, వారికి ఉచిత వరాలు ప్రసాదించడంగా మారింది. ఇదంతా ఎందుకు చేశారు? ప్రజల మీద ప్రేమతోనా, లేక నిజంగా సమ సమాజ స్థాపన పట్ల నిబద్ధతతోనా? రెండూ కాదు. ఏదో మాయఫెస్టో చూపి గెలిచాక, కొన్ని వర్గాలకు పడేయాల్సింది పడేశాక, ఇక తెరచాటు సంపాదన మొదలెడతారు. ప్రభుత్వోద్యోగుల్ని బదిలీ చేయడానికి డబ్బు, బదిలీ చేయకుండా ఉంచడానికి డబ్బు, పథకాల అమలుకు జరిపే కొనుగోళ్ళ ద్వారా డబ్బు. వసూలు చేసిన పన్నుల డబ్బుతో రోడ్లేసినా, కాలువలు తవ్వినా, అన్నిట్లోనూ డబ్బే. తన నియోజకవర్గంలో ఏ బదిలీ జరిగినా, ఎవరు కాంట్రాక్టు పట్టినా తన అనుమతి కావాల్సిందే.

తనను కలిసి, ముడుపులు, వంగి వంగి వందనాలు చెల్లించుకుంటే తప్ప, అన్నీ ఆపేస్తారు. ఈ రకంగా, సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయో కనిపెట్టడంలో కూడా కాలక్రమేణా మన నాయకులు సృజనాత్మకతను చూపారు.అప్పనంగా వస్తున్న ఇంత సొమ్ము, దానికి తోడు ప్రజానాయకుడు, మహానేత అన్న బిరుదులు, గౌరవం వదులుకోలేదు కాబట్టి, తిరిగి ఎన్నికవడం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఎంత ఖర్చు పెట్టినా దాన్ని పెట్టుబడిగానే భావిస్తారు.

ఉచిత పథకాలకు ఎలాగూ అలవాటు పడ్డ ప్రజలకు ఎన్నికలవేళ డబ్బు, మద్యం, బిర్యానీ పంచడంలో కొత్తగా వచ్చిన నైతిక సమస్య ఏమీ లేదు. అదీగాక, ఎలక్షన్ కమిషన్, కోర్టులు, మీడియా, మేధావుల పిచ్చిగానీ, గెలిస్తే క లర్ టీవీ పంచుతాననడం అనైతికం కానప్పుడు, గెలుపు కోసం డబ్బు పంచడం అనైతికం ఎలా అవుతుంది? ఈ అక్రమ సంపాదన, అనైతిక పంపిణీ, అనైతిక గెలుపు, తిరిగి అక్రమ సంపాదన అనే చక్రం ఒకసారి పూర్తయ్యాక, ఎవరు మంచి, ఎవరు చెడు అనే మీమాంస తొలగిపోయింది. ఎన్నికలపుడు పంచిన డబ్బు తీసుకున్న ప్రజలు నాయకులను ప్రశ్నించే అర్హత కోల్పోయారు.

అనైతికంగా అంతంత డబ్బు సంపాదించిన నాయకులు, డబ్బు తీసుకోకుండా ఓట్టేయమని అడిగే యోగ్యతను కోల్పోయారు. చివరికి మేధావి వర్గం కూడా చేతులెత్తేసింది. అవున్లే పాపం, ఎన్నికల్లో అంత ఖర్చు పెట్టాక సంపాదించుకోకుండా ఎలా ఉంటారులే అని పార్టీలు, నాయకుల పట్ల సానుభూతి. ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు కూడా, అయినా ఓటుకు రెండొందలే ఇస్తున్నారు, ఓటర్లు ఆశించినట్లుగా కనీసం వెయ్యి రూపాయలైనా ఇవ్వడం లేదేమని బహిరంగ ప్రశ్నలు.

హేతుబద్ధంగా ఆలోచించి, సరైన తాత్విక దృష్టితో చూస్తే ప్రభుత్వం ఏర్పరచుకున్నది ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడానికి, వ్యక్తుల మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించే న్యాయవ్యవస్థను నడపడానికి మాత్రమే. అంతకుమించి ఎందులో తల దూర్చినా అది అహేతుకం, అనైతికమే. ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించాల్సింది తమ మానవ సహజసిద్ధమైన స్వేచ్ఛకు రక్షణ మాత్రమే. అంతేగానీ, రెండు రూపాయలకు కిలో బియ్యమో, ఉచిత విద్యుత్తో, పనిచేయకున్నా ఫర్వాలేని ప్రభుత్వోద్యోగాలో కాదు. ఈ విషయంలో ఎవరు కాలుజారినా, అది ఒక విషయంతో ఆగదు.

కాలుజారిన విషయాన్ని వెంటనే గుర్తించి, దాన్ని తప్పుబట్టి, వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తేగల మేధో వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఈ తప్పిదాలు ఆగుతాయి. కాలు జారడమే ఆధునిక సామాజిక విప్లవం, ఎదుటివాడి జేబు కొట్టేయడం ఒక గౌరవప్రదమైన ఉద్యమం అనే భావనలు వ్యాపింపజేస్తే ఫలితాలు ఇదుగో ఇలాగే ఉంటాయి. ఒక ప్రభుత్వంతో పోటీపడి ఇంకోటి, ఒక స్వప్రయోజన వర్గంతో పోటీగా ఇంకో వర్గం, రాజకీయ, సామాజిక, భావజాల భ్రష్టత్వాన్ని పరాకాష్ఠకు తీసుకెళతాయి, తీసుకెళ్లాయి. అలా తయారైన నేటి సమాజంలో హేతుబద్ధత (ఆబ్జెక్టివిటీ), వివేకం (రేషనాలిటి), తర్కం అంతర్థానమయ్యాయి. అశాస్త్రీయ, అహేతుకమైన భావనలు, వాదనలే అందరి ఆలోచనలనూ ప్రభావితం చేస్తున్నాయి.

వారసత్వవాదం, సెంటి మెంటు, సానుభూతి, (నాయకుడి) ఆత్మగౌరవం, భాష, ప్రాంతం, కులం, మతం, రంగు, రక్తం-ఇలాంటి అప్రధాన, అహేతుక అంశాలే రాజకీయ చర్చలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. మడమ తిప్పని వంశం అనే వారొకరు, తొడకొట్టేవారొకరు, మా కులానికెప్పటికీ ఇవ్వరా అనే వారొకరైతే,మా ప్రాంతంలో అడుగుపెడితే ఖబడ్దార్ అనేవారు ఇంకొకరు. ఇటువంటి చర్చల్లో మనిషి స్వేచ్ఛ, దాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత అనే విషయాలకు ఎక్కడైనా చోటుందా?

అసలు తన హక్కులేమిటో, ఏవి హక్కులు కావో, ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవాలో, ఏం ఆశించకూడదో, మన డబ్బు కొట్టేసి మనకే ఉచిత వరాలిస్తానంటున్నవాడు నాయకుడా, మాయలోడా అనే వివేచన కోల్పోయిన జనం ఈ సెంటిమెంట్ల నిషాలో ఊగిపోయి ఒట్లేయడం ఇది మొదటి సారీకాదు, చివరిసారీ కాబోదు. ఇంతకుముందు తెలంగాణ లో జరిగిన ఉప ఎన్నికలలో, అంతకుముందు కరీంనగర్‌లో కూడా ఇదే తంతు. ఎదో పేదలకు సాయం చెయ్యాలన్నాం కానీ అవినీతికి పాల్పడమన్నామా అని సోషలిస్టులు వాపోతారు.

కానీ వారు గుర్తించడానికి ఇష్టపడని వాస్తవం ఏమిటంటే, సోషలిస్టు భావజాలం, ఐదేళ్ళకోసారి ఎన్నికలొచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ-ఈ రెండూ కలిస్తే కల్తీ కల్లు లాంటి విషం తయారవుతుంది. అది జాతి నరనరాల్లోకి ఎక్కి, నిర్వీర్యం, నిస్తేజం చేసేస్తుంది. పంచమనడం తేలికే. కానీ ఎవరి దగ్గర్నుంచి లాక్కుని, ఎవరికి ఎంత పంచాలో తేల్చడంలోనే ఉంది ఓట్ల సంఖ్యా శాస్త్రమంతా. అసలీ గుంజడం, పంచడం రెండూ అనైతికమేనని ఎప్పటికి తెలుసుకుంటాం? సకాలంలో మేలుకోకపోతే ఈ దిగజారుడు ఇంకా ఇంకా లోతైనా ఊబిలోకి నెడుతుంది.

ఎక్కడో, ఏదో తప్పు జరిగిపోయిందని తెలుసుకోవడానికి, ఆ ఊబిలోంచి బయటపడే బలమైన ప్రయత్నం చెయ్యడానికి దశాబ్దాలు పట్టొచ్చు. బీహార్, బెంగాల్‌లోలాగా, కానీ ఈలోగా తరాలు తరలిపోతాయి, అవకాశాలు తరిగిపోతాయి, కాలం కదలిపోతుంది. మహాభారత యుద్ధానంతరం మిగిలిన వల్లకాడులాంటి స్థితే మనకూ మిగులుతుంది. సజీవ స్రవంతైన సమాజంలోని వ్యక్తులు ఏనాడైతే మేల్కోని ఆలోచిస్తారో, వ్యక్తి స్వేచ్ఛ, పరిమిత ప్రభుత్వాలను ప్రప్రధానమైన అంశాలుగా గుర్తిస్తారో అదే పండగ రోజు. అప్పుడే విముక్తి.

-- 

Tuesday, 17 May 2011

నువ్వు నా ఊపిరైనట్టు … నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కళలు ..

ఓహ్  చలి  చలిగా  అల్లింది ..గిలి  గిలిగా  గిల్లింది ..
నీ  వైపే  మళ్ళింది  మనసు ..

చిటపట  చిన్దేస్తుంది … అటు ఇటు దూకేస్తుంది
సతమతమై  పోతుంది  వయసు

చిన్ని  చిన్ని  చిన్ని  చిన్ని  ఆసలు  ఏవేవో ..
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి  పోతున్నాయి

చిట్టి  చిట్టి  చిట్టి  చిట్టి  ఊసులు  ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపెస్తున్నాయే

నువ్వు  నాతోనే  ఉన్నట్టు … నానీడ  వైనట్టు
నన్నే  చూస్తున్నట్టు  ఊహలు
నువ్వు  నా  ఊపిరైనట్టు … నా  లోపలున్నట్టు
ఏదో  చెబుతున్నట్టు  ఏవో  కళలు ..

ఓహ్  చలి  చలిగా  అల్లింది ..గిలి  గిలిగా  గిల్లింది ..
నీ  వైపే  మళ్ళింది  మనసు.

చిటపట  చిన్దేస్తుంది … అటు ఇటు  దూకేస్తుంది
సతమతమై  పోతుంది  వయసు

గొడవలతో  మొదలై …తగువులతో  బిగువై
పెరిగిన  పరిచయమే …నీది  నాది
తలపులు  వేరైనా …కలవని  తీరిన
బలపడి  పోతుందే …ఉండే  కొద్ది
లోయలోకి  పడిపోతున్నట్టు
ఆకాశం  పైకీ  వెళుతున్నట్టు
తారలన్ని  తరసపదినట్టు
అనిపిస్తుందే  నాకు  ఏమైనట్టు

నువ్వు  నాతోనే  ఉన్నట్టు … నానీడ  వైనట్టు
నన్నే  చూస్తున్నట్టు  ఊహలు
నువ్వు  నా  ఊపిరైనట్టు … నా  లోపలున్నట్టు
ఏదో  చెబుతున్నట్టు  ఏవో  కళలు ..

నీ  పై  కోపాన్ని …ఎందరి  ముందైన
బెదురు  లేకుండా  తెలిపే  నేను ..
నీ  పై  ఇష్టాన్ని  నేరుగా  నీకైనా
తెలపలనుకుంటే  తడబడుతున్నాను
నాకు  నేనే  దూరం  అవుతున్న …
నీ  అల్లరులన్ని  గురుతోస్తుంటే ..
నన్ను  నేనే  చేరాలనుకున్న
నా  చెంత  కి  నీ  అడుగులు  పడుతూ  ఉంటె

నువ్వు  నాతోనే  ఉన్నట్టు … నానీడ  వైనట్టు
నన్నే  చూస్తున్నట్టు  ఊహలు
నువ్వు  నా  ఊపిరైనట్టు … నా  లోపలున్నట్టు
ఏదో  చెబుతున్నట్టు  ఏవో  కళలు ..


-- 



Tuesday, 10 May 2011

Mr.Mahi with Mr.Perfect song


ఎప్పటికి  తన  గుప్పెట  విప్పదు

ఎవ్వరికి  తన  గుట్టుని  చెప్పదు  

ఎందుకు  ఇలా  ఎదురైనది  పొడుపుకథ 
తప్పుకొనేందుకు  దారిని  ఇవ్వదు 
తప్పు  అనేందుకు  కరనమున్డదు 
చిక్కులలో  పడడం  తనకేం  సరదా ..
బదులు  తోచని ప్రశ్నల  తాకిడి  ఏమిటో  ఇలా 
కళలు  ఆగని  సంధ్రములా  మది  పారితే  ఎలా .. 
నిన్న  మొన్న  నీలోపలా ... కలిగినద  ఏనాడిన  కల్లోలం  ఇలా ..
 రోజే  ఏమైందని  ఈదిన  అయ్యిందని 
నేకైన … కాస్తైన  అనిపించిందా 
ఎప్పటికి తన …
ఎదోల చూస్తారే  ... నిన్నూ  వింతాలా 
నిన్నే  నీకు  చూపుతారే   ... పోల్చలేనంతగా 
త్వరపడినా  లేవంటూ కొందరు  నిందిస్తుంటే 
నిజమో  కదూ  స్పష్టంగా  తెలేదిలా   
సంబరపడి  నిన్ను  చూపిస్తూ ...కొందరు  అభినందిస్తుంటే 
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా …
బదులు  తోచని  ప్రశ్నల  తాకిడి  ఏమిటో  ఇలా 
కళలు  ఆగని  సంధ్రములా  మది  పారితే  ఎలా …
నీ  తిరు  మారింది  నిన్నకి  నేటికి  ...
నీ  దారే  మల్లుతుందా  కొత్త  తీరానికి ...
మర్పెధైన వొస్తుంటే  నువ్వధి  గుర్తించక  ముందే 
ఎవరెవరో  చెబుతుంటే    నమ్మేదెలా 
వెళ్ళే  మార్గం  ముల్లుంటే..    సంగతి  గమనించందే 
తొందరపడి  మున్ధడుగేసీ  వీల్లెదేలా …
బదులు  తోచని  ప్రశ్నల  తాకిడి  ఏమిటో  ఇలా 
కళలు  ఆగని సంధ్రములా  మది  పారితే  ఎలా …

-- 

Wednesday, 4 May 2011

wife is wife..

May be you are King of World...

May be you are most dangerous in world...
 
May be you are an independent one...

May be you can rule other or rule the World...
 
May be you are most lovable by others...

Either you are a Gentleman...
 
Or most Dangerous Killer of the world...
 
But The fact is this...
*
*
*
*
*
*
*
*
*
*
When you are at home...
*
*
*
*
*
*
*
*
*
*
...Does not matter Who the Hell are you...

A FEW TIPS TO ENJOY LIFE..

A FEW TIPS TO ENJOY LIFE:
                                      
1. Dont smoke too much or don't smoke at all. 
2. Work hard.
3. Drink good drinks.
4. Smile as much as you can.
5. Dont look much at the mirror.
6. Change your life routine.
7. Take care of your appearance.
8. Brush your teeth after meals.
9. Make lovely jokes with your friends.
 
 »мαнι ℓσνє'ѕ υ« ミConnecting People彡

Tuesday, 3 May 2011

కలిసిన ఆర్కుట్ స్నేహబంధం

కలిసిన ఆర్కుట్ స్నేహబంధం 


ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం - 03-05-2011.
ముహూర్తం: 15.40 Hrs

'ఆపరేషన్ ఒసామా'..లాడెన్ గుట్టు.. కొరియర్‌తో రట్టు

లాడెన్ గుట్టు.. కొరియర్‌తో రట్టు
నాలుగేళ్లుగా కొరియర్‌పై నిఘా
ఆగస్టు నుంచి నివాసంపై కన్ను

డిటెక్టివ్‌ల ద్వారా సమాచార సేకరణ
గత నెలలోనే లాడెన్ ఆచూకీపై నిర్ధారణ
'ఆపరేషన్ ఒసామా' సాగిందిలా... 

న్యూయార్క్, మే 2: కొండలు తిరిగారు. గుట్టలు చుట్టుముట్టారు. గుహల్లో వెతికారు! ఒసామా బిన్ లాడెన్ ఎక్కడా దొరకలేదు! చివరికి... పాకిస్థాన్ రాజధాని సమీపంలో... విలాసవంతమైన భవంతిలో లాడెన్ హతమయ్యాడు. అసలు లాడెన్ ఇక్కడే ఉన్నట్లు అమెరికా నిఘా కంటికి ఎలా తెలిసిందంటే...

గ్వాంటనామా బేలోని ఖైదీల నుంచి అమెరికా రకరకాల సమాచారాన్ని రాబడుతోంది. ఈ క్రమంలో లాడెన్‌కు అత్యంత విశ్వసనీయుడైన ఒక కొరియర్ గురించి తెలిసింది. ఆ కొరియర్ అసలు పేరు మాత్రం తెలియలేదు. నాలుగేళ్ల క్రితం అసలు పేరు కూడా తెలిసింది. అప్పటి నుంచి ఆ కొరియర్ ఆచూకీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. చివరికి... గత ఏడాది ఆగస్టులో అతని నివాసాన్ని కూడా కనిపెట్టారు. అబోత్తాబాద్ శివార్లలో ఆ కొరియర్ నివసిస్తున్నట్లు గుర్తించారు.

అది... విశాలమైన, విలాసవంతమైన భవంతి. దాని చుట్టూ 12 నుంచి 18 అడుగుల ఎత్తైన కాంక్రీట్ గోడ. ఆ గోడపై ఇనుప కంచె! ఇలాంటి భవంతిలో కేవలం ఒక కొరియర్ ఉండడని, అంతకంటే 'ముఖ్యమైన' వారెవరో ఉంటారని అమెరికా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. 'ఆపరేషన్ ఒసామా' మొదలుపెట్టారు. అమెరికా నిఘా విభాగం సీఐఏ నిపుణులు సుమారు రెండు నెలలపాటు ఆ భవంతిపై ఉపగ్రహాల ద్వారా కన్నేశారు. ఫొటోలు తెప్పించుకున్నారు.

2005లో 'ఒక ప్రత్యేక అవసరం' కోసమే ఆ భవనాన్ని నిర్మించినట్లు అంచనాకు వచ్చారు. ఈ భవన నిర్మాణానికి సుమారు 45 లక్షల రూపాయలు వెచ్చించినట్లు తేల్చారు. ఆ ఇంటికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌లు లేవు. టీవీ కూడా లేదు. ఆ ఇంట్లో వాళ్లు అందరిలాగా చెత్తా చెదారం తీసుకొచ్చి బయట పడేయడంలేదు. బయటి వారు కూడా చెత్తను సేకరించేవారు కాదు. చెత్తను ఇంటి ఆవరణలోనే కాల్చేసేవారు. ఇంటిలోపలికి వెళ్లేందుకు రెండు గేట్లు మాత్రం ఉన్నాయి. సీఐఏ నియమించిన డిటెక్టివ్‌లు ఈ మొత్తం సమాచారాన్ని సేకరించారు.

చివరికి... ఆ ఇంట్లో ఉన్నది లాడెన్, అతని కుటుంబమే అని గత నెలలో ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధ్యక్షుడు ఒబామాకు చేరవేశారు. 'అక్కడ లాడెన్ ఉన్నట్లు తేలితే ఏం చేయాలి?' అనే అంశంపై ఒబామా గతనెల 14న కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇలాంటి సమావేశాలు మరో నాలుగు జరిపారు. ఏప్రిల్ 29న 'కిల్ ఒసామా బిన్ లాడెన్' ఆదేశాలపై ఒబామా సంతకం చేశారు. ఆదివారం 'ఆపరేషన్ ఒసామా' విజయవంతంగా పూర్తయింది.

దేవాంతకులు-4: సాయిపైనే పెత్తనం

దేవాంతకులు-4: సాయిపైనే పెత్తనం
పేరు బాబాది.. అధిపత్యం ట్రస్టుది.. ఏనాడో గమనించిన సత్యసాయి

ట్రస్టును రద్దు చేసే యత్నం.. ఆస్తులు వేరే సంస్థకు అప్పగించే యోచన
అడ్డుకున్న ఇందూలాల్.. బాబుకు ప్రత్యామ్నాయం కోసం ట్రస్టీల ప్లాన్
మరొకరిని ఎన్నుకునేలా రూల్స్‌లో మార్పు..
ఈ హంగులు, ఆర్భాటాలు నాకు నచ్చవు. వీటి నుంచి నాకు ఎటువంటి ఆనందం కలగదు. ఈ మధ్య కాలంలో యోగులు, స్వాముల్లో కూడా ఇటువంటి ఆడంబరాలు ఫ్యాషన్ అయిపోయాయి. పేదరికం గురించి, నిరాడంబరత గురించి వీరు మాట్లాడతారు. తమ శిష్యులు ఆడంబరాల మీద ఖర్చు పెట్టడాన్ని అనుమతిస్తూ ఉంటారు... ప్రోత్సహిస్తారు కూడా. ఇటువంటి చర్యల వల్ల స్వాముల్లోనూ, వారి భక్తుల్లోనూ ఈగో పెరుగుతుంది. ఆడంబరాల వల్ల అసలు విషయం మరుగున పడిపోతుంది.
- 1963 డిసెంబర్ 14న సాయిబాబా

ఒకప్పుడు ప్రశాంతి నిలయం చిన్న భవంతి. సాయిబాబా ఆడంబరాలకు వ్యతిరేకి. అటువంటి ప్రశాంతి నిలయం ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారుమయం. స్వర్ణ సింహాసనాలు, మణిమయ వాహనాలు... సాయి చుట్టూ అంతా సంపదే. ప్రశాంతి నిలయం కొన్నివేల కోట్ల రూపాయలకు ఆలయం ఎలా అయింది? ఇదంతా బాబా ఇష్టంతోనే జరిగిందా? నిరాడంబరత గొప్పతనాన్ని పదే పదే ప్రవచించిన సాయిబాబా తన పేరిట ట్రస్టు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు?

ట్రస్ట్ పేరిట సంపాదించిన సంపద ద్వారా లాభం పొందిందెవరు? సత్యసాయిని బందీగా చేసి- "నన్నే ట్రస్టు నుంచి బయటకు పంపేసేలా ఉన్నార''ని ఆయన ఆవేదన చెందేలా చేసింది ఎవరు? అనే ప్రశ్నలు ఉదయించకమానవు. వీటికి సమాధానాలు వెదికితే కఠోర వాస్తవాలు బయటపడతాయి. ఒక దశలో ట్రస్టునే రద్దు చేయాలని సాయి భావించారని, కానీ ట్రస్టు సభ్యులు కుదరనీయలేదనేది ఒక వాస్తవం. ఇక ట్రస్టుతో తనకు సంబంధం లేదనుకుని, భక్తులే తన ఆత్మీయులుగా భావించి బాబా చివరిదశలో ట్రస్టుకు చాలా దూరం జరిగిపోయారన్నది మరో వాస్తవం.

సత్యసాయికి లక్షల మంది విదేశీ భక్తులు ఉండేవారు. వారు ప్రశాంతి నిలయానికి వచ్చి ఆ«ధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలోనే వారు పుట్టపర్తి సమీప ప్రాంతాలను కూడా సందర్శిస్తూ ఉండేవారు. మన దేశంలో పేదరికం, నిరక్ష్యరాస్యత మొదలైనవి చూసి కలత చెంది, పరిస్థితులు మెరుగుపరచటానికి విరాళాలు ఇవ్వటానికి సిద్ధపడేవారు. ఈ విషయాన్ని గమనించిన సాయి ట్రస్టు ఈ విరాళాలను సేకరించి వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగించటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో అనేక స్కూల్స్ వెలిశాయి.

ఈ విరాళాలతో పాటుగా సత్యసాయికి విదేశీ భక్తులు కోట్లాది రూపాయలు ట్రావెలర్స్ చెక్కుల రూపంలోను, కరెన్సీ రూపంలోను పంపుతూ ఉండేవారు. ఇలాంటి సొమ్ములు లెక్కలు చూపాల్సిన అవసరం లేనందున ట్రస్టు సభ్యులు కూడా దీనినే ప్రోత్సహించేవారు. దీనితో లెక్క లేనంత ధనం ప్రశాంతి నిలయానికి వచ్చి చేరటం మొదలుపెట్టింది. ఈ సొమ్మును సాయి ఒక్కరే నియంత్రించలేరు కాబట్టి ఆయన తన సన్నిహితుల మీద, ట్రస్టు సభ్యులపైన ఆధారపడటం మొదలుపెట్టారు.

కొన్నిసార్లు సాయి ఆధ్యాత్మిక విషయాల వల్ల ఆర్థికపరమైన లావాదేవీలను అంతగా పట్టించుకొనేవారు కాదు. ఇదే ట్రస్టు సభ్యులకు వరంగా మారింది. డాలర్ల రూపంలో వచ్చిన కరెన్సీని పుట్టపర్తిలో ఉన్న కొందరు కాశ్మీరీ వ్యాపారులకు ఇచ్చి వారు రూపాయల రూపంలోకి మార్చుకొనేవారు. ఇదే విధంగా కొన్ని ట్రావెలర్స్ చెక్కులను కూడా మార్చి సొమ్మును తీసుకొనేవారు. ఈ అవినీతి 1986-87ల నాటికి సాయి ట్రస్టులు నిర్వహించే అన్ని కార్యక్రమాలలోకీ పాకింది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో అందినంత తినేయటం మొదలుపెట్టారు. ఈ విషయం బాబాకు తెలుసు.

అందుకే సురేష్ ప్రభుతో- 1987లో బాబా- "అక్కడ ఏముంది.. అంతా అవినీతి .. అవినీతి.. అవినీతి..'' అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ విషయం బాబాకు తెలిసిన తర్వాత కూడా ట్రస్టు సభ్యులు ఏ మాత్రం జంకలేదు. తమకు కావాల్సిన వారికి వాహనాలను సమకూర్చటం, ముఖ్యమైన కార్యక్రమాల పర్యవేక్షణను అప్పగించటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ట్రస్టులోని బాబా కుటుంబ సభ్యులకు, ఇతరులకు మధ్య విభేదాలు ముదిరిపోయాయి.

ట్రస్టు సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనే స్థితి ఏర్పడింది. దీనితో ప్రశాంతి నిలయం పరువును కాపాడాల్సిన బాధ్యత బాబాపై పడింది. ఏ వర్గాన్నీ సమర్థించలేక, వ్యతిరేకించలేక బాబా మౌనం వహించడం మొదలుపెట్టారు. "ప్రశాంతి నిలయమే పీకల దాకా అవినీతిలో కూరుకుపోయింది. వీళ్లంతా భౌతిక, లౌకిక ప్రయోజనాల కోసమే నా చుట్టూ చేరారు. ఈ ఆస్తులేమీ నావి కావు. ఏదో ఒక రోజు ట్రస్టు నన్నే బయటికి పంపేయవచ్చు..'' అని బాబా ఒక దశలో తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అనుకున్నంతా అయింది.

ట్రస్టులో గొడవలు 1993లో కాల్పుల సంఘటనకు దారి తీశాయి. ఎప్పుడూ ట్రస్టులో ఉన్న అంతర్గత విభేదాల గురించి బయటకు చెప్పని సాయిబాబా తమ్ముడు జానకి రామయ్య కూడా - "నాకు కానీ బాబాకు కానీ తెలియకుండా ట్రస్టు సభ్యులు కానీ వారి అనుచరులు కానీ ఏవైనా అక్రమాలు చేశారేమోనని నాకు కూడా అనుమానం కలుగుతోంది. ట్రస్టు సభ్యులైనా సరే అక్రమాలు చేసి ఉంటే వదిలే ప్రసక్తి లేదు'' అని వ్యాఖ్యానించారు.

ట్రస్టులో విభేదాలు లేవన్న ప్రకటనల్లోని డొల్లతనమేమిటో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాల్పుల సంఘటన తర్వాత బాబా కూడా ట్రస్టు సభ్యుల మధ్య విభేదాలను తీవ్రంగా పరిగణించారు. ఏదో ఒక మందు వేయకపోతే వ్యాధి శరీరాన్నే కబళిస్తుందని ట్రస్టుకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేశారు.

కీలకమైన మార్పు ఇదే..

సత్యసాయి ట్రస్టు నిబంధనలలో - ఆస్తులను ఏం చేయాలనే విషయం గురించి కానీ, ఒక వేళ ట్రస్టు రద్దు అయితే ఏం చేయాలనే విషయంపై కానీ ఎలాంటి ప్రస్తావనా లేదు. ఆ విధమైన చర్చ కూడా ఎప్పుడూ జరగలేదు. కాల్పుల సంఘటన తర్వాత రెండు వర్గాల మధ్య విభేదాలు ముదిరాయని గమనించిన సాయి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన చేశారు. ఒకవేళ ట్రస్టును రద్దు చేస్తే దాని ఆస్తులను ఏం చేయాలో కూడా ఆలోచించారు.

ట్రస్టు నిబంధనల్లో ఒక కొత్త నిబంధనను చేర్చారు. "ఒక వేళ ట్రస్టును ఎప్పుడైనా రద్దు చేస్తే- దానికి సంబంధించిన ఆస్తులన్నీ - ట్రస్టు ఏవైతే కార్యకలాపాలు నిర్వహిస్తోందో అటువంటి కార్యక్రమాలు నిర్వహించే భావసారూప్యం గల సంస్థకు చెందుతాయి'' అనేది ఈ నిబంధన. సాయి ట్రస్టు అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు అయిన సాయిబాబాకు- ఏ సభ్యుడినైనా నియమించే, తొలగించే అధికారం ముందు నుంచీ ఉంది. ఈ నిబంధనను మరింత బలోపేతం చేయటానికి, కుమ్ములాటలు ఆపకపోతే మొత్తం ట్రస్టునే రద్దు చేస్తాననే సంకేతాన్ని పంపటానికి సాయి ఈ మార్పులు చేశారు.

చక్రం తిప్పిన షా

ట్రస్టును రద్దు చేయాలని బాబా తీసుకున్న నిర్ణయం - సభ్యులకు శరాఘాతమైంది. నిబంధనల్లో చేసిన మార్పుల వల్ల ట్రస్టును బాబా రద్దు చేస్తే మొత్తం సొమ్ము మరో సంస్థకు చేరుతుంది. ఆ సంస్థ ఏదో నిర్ణయించే అధికారం కూడా బాబాదే కాబట్టి మొత్తం సభ్యులందరూ నష్టపోతారు. ఈ సమయంలో ట్రస్టు సభ్యుడు ఇందులాల్ షా రంగంలోకి దిగారు.

ఆ సమయంలో ఇందులాల్‌షా సాయి ఇంటర్నేషనల్ చైర్మన్‌గా ఉండేవారు. విదేశాలలోని సాయి సంస్థలపై ఆయనకు గట్టి పట్టు ఉండేది. విరాళాలు ఎక్కువగా విదేశాల నుంచే వస్తాయి కాబట్టి ట్రస్టులో ఆయన కీలకపాత్ర పోషిస్తూ ఉండేవారు. ఇందూలాల్ షా మళ్లీ 'పరువు మంత్రాన్ని' సత్యసాయిపై ప్రయోగించారు. ట్రస్టు రద్దు కానీయకుండా చేశారు.

ఈ సందర్భంలో నరసింహన్ గురించి చెప్పుకోవాలి. నరసింహన్ ఒక ప్రముఖ జర్నలిస్ట్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్. బాబాకు చాలా సన్నిహితుడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాబా భక్తుడిగా ఉన్నారు. అయితే ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సంఘటనలపై నరసింహన్ తీవ్రంగా కలత చెందారు. అక్కడ తాను గమనించిన విషయాలన్నింటినీ నోట్స్ రూపంలో రాసుకున్నారు. నార్వేలోని సత్యసాయి ఇంటర్నేషనల్ సంస్థ శాఖాధ్యక్షుడు, సాయి సన్నిహితుడు అయిన రాబర్ట్ పిడ్రీ నరసింహన్‌కు కూడా సన్నిహితుడు.

తన నోట్స్‌లోని ముఖ్యమైన విషయాలను నరసింహన్ రాబర్ట్‌కు చెబుతూ ఉండేవారు. నరసింహన్ రాసుకున్న నోట్స్ చాలా కాలం బయటకు రాలేదు. బాబాకు భక్తుడిగా ఉన్న రాబర్ట్.. ట్రస్ట్‌లో తన బాధ్యతలను పరిత్యజించిన తర్వాత - ఈ నోట్స్‌ను బయటపెట్టారు. రాబర్ట్ ఆన్‌లైన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "ట్రస్టులో కీలకమైన వ్యక్తి సాయిబాబా అని.. ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం ఉంది. కానీ ఇది నిజం కాదు. 1983-2000 సంవత్సరాల మధ్యలో మాజీ రాజకీయవేత్త ఇందూలాల్ షా కీలకమైన పాత్ర పోషించేవారు. ట్రస్ట్ ఇంటర్నేషనల్ చైౖర్మన్ కూడా ఆయనే.

ఆ సమయంలో సాయిబాబా మొత్తం ట్రస్ట్‌ను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఇందూలాల్ షాకు దేశ, విదేశాలలో సాయిసంస్థలపై గట్టి పట్టు ఉంది. సాయిబాబా ప్రకటనను ఆయన పట్టించుకోలేదు. ఏమీ జరగనట్లే కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాలన్నింటి గురించి నరసింహన్‌కు తెలుసు. విదేశాలలో ఉన్న మహారాష్ట్రీయుల ద్వారా సాయిబాబా ఆదేశాలు పూర్తిగా తిరగబడేలా ఇందూలాల్ షా చేయగలిగాడని నరసింహన్ తన నోట్స్‌లో పేర్కొన్నారు'' అని వెల్లడించారు.

దూరం జరిగిన బాబా

ట్రస్టు సభ్యుల తీరులో మార్పు లేకపోవటం గమనించిన బాబా ట్రస్టు నుంచి క్రమేపీ దూరంగా జరగటం మొదలుపెట్టారు. "సాయి సెంట్రల్ ట్రస్టు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ ఇందులాల్‌షాతో సహా అందరికి ఆస్తుల పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పాను. ఈ ఆస్తుల విషయంలో నా ప్రమేయం లేకుండా చూడమన్నాను. ధనం విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఎటువంటి సంబంధం ఉండాలని నేను కోరుకోవటం లేదు.

నా దృష్టంతా నా భక్తులపైనే..'' అని 1998లో బాబా పేర్కొన్నారు. 2000 సంవత్సరం తర్వాత సత్యసాయి సంస్థల కార్యక్రమాల జోరు క్రమేపీ తగ్గటం ప్రారంభించింది. వయస్సు మీద పడటంతో బాబా ముందంత చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయేవారు. దీనితో మొత్తం వ్యవహారమంతా ట్రస్టు చేతిలోకి వచ్చేసింది. ఈ సమయంలో పేరు బాబాది. పెత్తనం మాత్రం ట్రస్టుది.

మార్చేసిన ఘనులు

గత ఏడాది బాబాకు ప్రమాదం జరిగింది. నడుము తుంటి దగ్గర ఎముక విరిగింది. దీనితో సాయి కేవలం వీల్ చైౖర్‌కు మాత్రమే పరిమితమయ్యారు. భక్తులకు దర్శనాలు ఇవ్వటం కూడా తగ్గించారు. ఈ సమయంలోనే నిబంధనలను మరోసారి మార్చారు. వీటి ప్రకారం బాబా ఎప్పటికీ వ్యవస్థాపక ట్రస్టీగానే ఉంటారు. ఒకవేళ బాబా ఆ పదవిని నిర్వహించటానికి ఇష్టం లేకపోయినా, నిర్వహించలేని పరిస్థితులు తలెత్తినా- ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకొనే అధికారం ట్రస్టీలకు ఉంటుంది.

వీటి ప్రకారమే అతి త్వరలో ట్రస్టీలు కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవటానికి రంగం సిద్ధమయింది. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే- ఈ మార్పులు జరిగిన విషయాన్ని అతి రహస్యంగా ఉంచడం. అంటే బాబా మరణానంతరం ట్రస్టు తమ చేతుల్లోనే ఉండేలా ట్రస్టు సభ్యులు అన్ని రకాలుగా ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారన్న మాట!

ఒసామా బిన్ లాడెన్‌

ఒక సోమవారం

గత పదేళ్లుగా ఇక్కడున్నాడంటే ఇక్కడున్నాడంటూ ఎక్కడ చూసినా ఒసామా జపమే. అంతెందుకు హైదరాబాద్‌లో కూడా ఒక ఒసామా హల్‌చల్ చేశాడా మధ్య. మొత్తంమీద ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తేలింది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఒసామా మరణించాడని తెలిసిన గంట తరువాత "ఒసామా బిన్ లాడెన్‌లా చాలామంది ఉన్నప్పుడు మరణించింది నిజమైన ఒసామానే అనడానికి సాక్ష్యమేమిటి?'', "అఫ్‌కోర్సు డిఎన్ఎ టెస్ట్ చేశామంటున్నారు.'' "అయితే అవి ఒసామా నుంచి సేకరించిన ఒరిజినల్ శాంపిల్సే అని నమ్మకమేంటి?'' అంటూ ఎన్నో అనుమానాలు వెబ్‌ప్రపంచంలో వెల్లువెత్తాయి. దీనికి కారణం గతంలో ఎందరో ఒసామాలను మనం చూసి ఉండడమే. వాళ్లలో కొందర్ని గుర్తు చేసుకుందాం ఇవ్వాళ...
దరో లాడెన్‌లు!
బీహార్‌లో ఒసామా
జనవరి 19, 2005

బీహార్‌లో 2005లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రామ్ విలాస్ పాశ్వాన్ ఒసామాని పక్కన పెట్టుకుని మరీ ప్రచారం చేశాడని తెలుసా మీకు! ఒసామా అంటే మరీ ఒసామా కాదు. అచ్చం ఒసామాలా ఉండే మౌలానా మీరజ్ ఖలీద్ నూర్‌ను వెంటపెట్టుకుని ప్రచారం చేశారు పాశ్వాన్. మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ఉగ్రవాదిని వాడుకోవడం ఎలా ఆమోదయోగ్యం అని పాశ్వాన్‌ని అడిగితే "మీ ముఖం కూడా సద్దాం హుస్సేన్‌లా, లేదా ఒసామా బిన్ లాడెన్‌లా ఉంటే మీరేం చేస్తారు? మీరజ్ ఖలీద్ నూర్ ముఖం ఒసామాలా ఉంటుంది.

అంతమాత్రాన ఒసామా అయిపోతాడా? మీరజ్ నాకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడి కొడుకు. అతని తండ్రీ, నేనూ ఒకేసారి సోషలిస్టు పార్టీలో చేరాం. మా ఇద్దరిదీ దీర్ఘకాల స్నేహబంధం. అందుకే ఆయన కొడుకుని ప్రచారానికి తీసుకొచ్చాను'' అంటూ విసుక్కున్నాడు. ఒకేలా ఉన్నంత మాత్రాన ఒసామా అయిపోతాడా అని పాశ్వాన్ చిర్రుబుర్రులాడారు కాని ఒసామా వలె ఉన్న కారణంగా జీవనాధారం పోగొట్టుకున్నాడు ఒకాయన.

పొట్టకొట్టిన పోలిక
జనవరి, 11/2006

ఆస్కార్ బ్రూఫని అనే 52 యేళ్ల పెద్దమనిషి జీవితాన్ని దుర్భరం చేసింది ఆయనకున్న ఒసామా ముఖమే. బ్యునస్ ఎయిర్స్‌లో బంగాళాదుంప చిప్స్ అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు ఆస్కార్. ఆయన జీవితం 2004 అక్టోబరు వరకు బాగానే ఉంది. కాని ఆ తరువాతే అదృష్టం తిరగబడింది. లా ప్లాటాలోని వాల్‌మార్ట్‌లో సరుకు అన్‌లోడింగ్ అయిపోయి డెలివరీ రిపోర్టు కోసం ట్రక్ దగ్గర ఎదురుచూస్తున్నాడు ఆస్కార్.

ఎంతకీ స్టోర్ మానేజర్ ఆయనకి రశీదు ఇవ్వలేదు. ఆవిడ ఏం చేస్తోందా అని చూస్తే యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఇద్దరు వాల్ మార్ట్ కంట్రోలర్లతో మాట్లాడుతూ కనిపించిందామె. ఆ తరువాత కొంతసేపటికి "నువ్వు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదంటూ ఆర్డర్ వచ్చింది అంది'' తానేం తప్పు చేశానో తెలియని ఆస్కార్ అదే విషయాన్ని అడిగాడు. దానికి సమాధానంగా "నువ్వు ఒసామా బిన్‌లాడెన్‌లా ఉన్నావు. సెక్యూరిటీ కెమెరాల్లో నీ ఫోటో రికార్డు అయితే నా ఉద్యోగం పోతుంది. అందుకే నువ్వు ఈ సరిసర ప్రాంతాలకు రాకు'' అని చెప్పింది.

ఆస్కార్‌కి చిప్స్ సరఫరానే జీవనాధారం కావడంతో ఎన్నోసార్లు వాల్‌మార్ట్ స్టోర్‌లోకి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. ఎప్పటికయినా వాళ్లు మారకపోతారా అని ఒక డ్రైవర్‌ని పెట్టుకుని ఆస్కార్. డాష్‌బోర్డు కిందకు తలదూర్చి దాక్కుని డెలివరీ ఎలా చేయాలో అతనికి చెప్పేవాడాయన. కాని ఎన్నాళ్లలా దాక్కుని తిప్పలు పడతాడు! చూసి చూసి విసుగొచ్చి వాళ్లు మారరని కోర్టులో కేసు వేసాడు. ఈలోగా వేరే స్టోర్స్ వాళ్లు ఆస్కార్‌కు ఆహ్వానం పలికినా ఒసామా పోలికలు తన పొట్ట కొట్టాయని వాపోతుంటాడు ఆస్కార్.

రెండుసార్లు అరెస్టు
ఏప్రిల్ 30, 2007

అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ఆదివాసి ఒకడు అచ్చం ఒసామాలా ఉండడం వల్ల రెండుసార్లు అరెస్టు అయ్యాడు. ఆరడుగుల పొడవుతో ఉండే ఇతని ముక్కు అచ్చం లాడెన్ ముక్కులాగానే ఉంటుంది. ఆయన పేరు షేర్ అక్బర్. బాగ్ ఎ మెటల్ ప్రాంతానికి చెందినవాడు. అక్కడే బిన్ లాడెన్ దాక్కున్నాడని అమెరికా నిఘా వర్గాలు భావించేవి. బిన్‌లాడెన్ ఆరడుగుల నాలుగున్నర అంగుళాల ఎత్తు, 160 పౌండ్ల బరువుతో ఉన్నాడనేది నిఘా వర్గాల అంచనా.

పాకిస్తాన్ సరిహద్దులోని చిత్రాల్ పరిసర ప్రాంతాల్లో లాడెన్ తిరుగుతున్నాడని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి షేర్ అక్బర్‌ను అరెస్టు చేశారు. ఇలా జరగడానికి కారణం బిన్‌లాడెన్ పేరు మీద 25 మిలియన్ డాలర్ల రివార్డు ఉండడమే. దాంతో లాడెన్‌ను పోలిన వ్యక్తి కనిపిస్తే చాలు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం చేరిపోయేది. అలా అక్బర్ రెండుసార్లు అరెస్టయ్యాడు. కొలంబియాను కూడా వదల్లేదు ఒసామా. కాకపోతే ఇక్కడ ఒసామా చాలా బాగా ఉపయోగపడ్డాడులెండి....

పహారాతో పరార్...
జనవరి 31, 2008

ఫెర్నాండో అనే కొలంబియన్ సెక్యూరిటీ గార్డు. శాంటా ఫె జిల్లాలో ఉద్యోగం చేస్తుండేవాడు. ప్రమాదకరమైన నేరాలకు ప్రసిద్ధి ఆ ప్రాంతం. మాదకద్రవ్యాల వ్యాపారం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెెట్టడం ఎలా అని ఆలోచించే ఫెర్నాండోకు 9/11 దాడుల తరువాత మాంఛి ఆలోచన వచ్చింది. అల్ ఖైదా నాయకుడు ఒసామా వేషంలో తిరిగితే నేరాలను కొంతవరకయినా అదుపు చేయొచ్చనుకున్నాడు. ఆలోచన రావడం ఆలస్యం అక్కడి పోలీసుల సాయంతో ఒసామాగా మారిపోయాడు ఫెర్నాండో.

"కొన్ని కుక్కలను వెంటపెట్టుకుని రాత్రిళ్లు పహారా తిరగడం నా పని. నన్ను ఒసామా అనే పిలవమనే వాడ్ని. చాలామందే భయపడే వాళ్లు. నా ఎనిమిదినెలల వయసులో అమ్మను, నన్ను వదిలేసి వెళ్లిపోయాడు మా నాన్న. నాకు సంబంధించినంత వరకు ఆయనే ఒసామా'' అంటాడు ఫెర్నాండో. ఈ చిట్కా బాగానే పని చేసినట్టుంది. ఇతను ఉన్నంతకాలం మాకు భయం లేదనే ధీమా వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. ఒసామా వల్ల చెడే కాదు మంచి కూడా జరిగిందన్నమాట. అందుకే కాబోలు నాణేనికి మరో వైపు అంటారు. మనుషులే కాదు సినిమాలనూ వదల్లేదు ఒసామా బిన్ లాడెన్.

వదల బొమ్మాళీ...
జూలై 15, 2010

'తేరే బిన్ లాడెన్' అనే సినిమాలో పాకిస్తానీ జర్నలిస్టు యునైటెడ్ స్టేట్స్ వెళ్లేందుకు పడే తిప్పలుంటాయి. ఇదో కామెడీ సినిమా. జర్నలిస్టు పాత్రలో పాప్ సింగర్ అలీ జాఫర్ నటించాడు. ఈ పాత్ర నకిలీ ఒసామా బిన్ లాడెన్‌ను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇదంతా హాస్యంగా చిత్రించామని చిత్ర యూనిట్ అన్నా దీనిలో హాస్యం ఏమీ లేదంటూ పాకిస్తాన్ సెన్సార్ బోర్డు అనుమతివ్వలేదు. అసలైనా, నకిలీ అయినా లాడెన్ లాడెనే. ఆయన పేరు వాడడానికి వీల్లేదన్నారు.

బిన్ లాడెన్‌ను బలిగొన్నది అమెరికా కాదు.

బిన్ లాడెన్‌ను బలిగొన్నది అమెరికా కాదు. ఆ పని చేసింది..

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)
ఆ సాంకేతికత సాయంతోనే అమెరికాకు ఆచూకీ



గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. ఈ విధానంలో ప్రపంచంలో ఎక్కడైనా దేన్నైనా స్పష్టంగా చూడొచ్చు. గూగుల్ యాండ్రాయిడ్ ఉన్న సెల్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న హైఎండ్ కంప్యూటర్ ఇవి ఉంటే చాలు. ఈ సాంకేతికతతోనే పాక్‌లో అనుమానం వచ్చిన ప్రదేశాలన్నింటినీ సీఐఏ ఏజెంట్లు జల్లెడ పట్టారు. ఎన్నో వారాల పాటు ఒసామా బిన్ లాడెన్‌ను ప్రస్తుతం పట్టుకున్న భవనాన్ని పరిశీలించారు. మొదట్లో అక్కడ ఎవరు నివసిస్తున్నారో వారికి తెలియలేదు.

ఆ తరువాత ఒసామా నివసిస్తున్నాడని అనుమానం వచ్చింది. అది నిజమై అతడిని హతం చేసేందుకు మార్గం ఏర్పడింది. అలా ఈ జీపీఎస్ సాంకేతికత ఒసామా బిన్ లాడెన్‌ను హతం చేసేందుకు తోడ్పడింది. అయితే.. ఈ సాంకేతికతతో అతడి మీద దాడి చేయడం అమెరికాకు ఇది మొదటి సారి కాదు. 1998లోనే అఫ్థానిస్థాన్‌లోని బిన్ లాడెన్ ఉగ్రవాద క్యాంపుల మీద జీపీఎస్ సాయంతో క్రూయిజ్ క్షిపణులతో దాడి అమెరికా దాడి చేసింది. దాన్నుంచి బిన్ లాడెన్ తృటిలో తప్పించుకున్నాడు.

ఆ తరువాత పాకిస్థాన్‌లోని వాయవ్య రాష్ట్రంలో మానవ రహిత విమానాల ద్వారా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఎంతో మంది చనిపోయారు. తాజాగా బిన్‌లాడెన్ ఆ సాంకేతికతకు బలయ్యాడు. అయితే.. విచిత్రమేమంటే ఈ జీపీఎస్ టెక్నాలజీని మొబైల్ ఫోన్లకు ఇచ్చే గూగుల్ వారి ఆండ్రాయిడ్ వంటి అప్లికేషన్లు తమ దేశంలోకి అనుమతిని నిరాకరించడానికి పాక్ ప్రయత్నిస్తోంది. విచిత్రంగా అదే సాంకేతికతతో ఒసామా ఎక్కడున్నాడో పసిగట్టి అమెరికా అతడిని హతం చేసింది.

Monday, 2 May 2011

దేవాంతకులు-3: 18 ఏళ్ల క్రితమే భవిష్య వాణి

దేవాంతకులు-3: 18 ఏళ్ల క్రితమే భవిష్య వాణి
చెప్పింది బాబా కాదు!
డబ్బు మీదే ట్రస్టు సభ్యుల దృష్టంతా

బాబాను చంపడానికీ వారు వెనుకాడరు
బాబాను గొప్పవాణ్ని చేసింది తామేనంటారు
ఆయన సమాధి మీదా పైసలేరుకుంటారు
కాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న ప్రభు, రవి చెప్పిన విషయాలివి...
బాబా వాస్తవాలు బయట పెడితే ట్రస్టు ఆటలు సాగవు. బాబా అలా చేస్తారనే అనుమానం కలిగితే, బాబాని హత్య చేసి, ఆయన సమాధిని భక్తులకు చూపి, దానిపై సొమ్ము చేసుకోవటానికి కూడా ట్రస్టు వారు వెనకాడరు.

ఈ మాటలు వింటుంటే, సత్యసాయి ఆసుపత్రిలో చేరిన తర్వాత ఎవరో ఈమధ్యనే అన్న మాటల్లా అనిపిస్తున్నాయా? కాదు. కానేకాదు. ఎప్పుడో 18 ఏళ్ల కిందటి మాటలివి. 1993లో సత్యసాయి బాబాపై హత్యాయత్నం కేసులో నిందితులుగా ముద్రపడ్డ ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. వారు ఆ మాటలు మాట్లాడడం విచిత్రమేమీ కాదు. కానీ 18 ఏళ్ల కిందటి ఆ మాటలు ఇప్పటి మాటల్లా వినిపించడమే విచిత్రం. అందుకు తప్పుబట్టాల్సింది ఆనాటి దాడి 'నిందితుల్ని' కాదు. ఈనాటి ట్రస్టు నిందితుల్నే!

హైదరాబాద్, మే 1 : "ప్రశాంతి నిలయమే పీకల దాకా అవినీతిలో కూరుకుపోయింది. వీళ్లంతా భౌతిక, లౌకిక ప్రయోజనాల కోసమే నా చుట్టూ చేరారు. ఈ ఆస్తులేవీ నావి కావు. ఏదో ఒక రోజు ట్రస్టు నన్నే బయటికి పంపేయవచ్చు..'' ' అక్కడ ఏముంది.. అంతా అవినీతి .. అవినీతి.. అవినీతి..'' ( సాయి ట్రస్టు అమలు చేసే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల గురించి..) నమ్మినవారే తనను నట్టేట ముంచేస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయతతో అనేకసార్లు తన ఆత్మీయులతో సాయిబాబా స్వయంగా ఈ మాటలు అన్నారట! 1993లో సాయి మందిరంలో జరిగిన కాల్పుల సంఘటనలో నిందితులుగా ముద్రపడి, ఆనాటి నుంచీ కనిపించకుండా పోయిన బోయపాటి రవి, శాంతారాం ప్రభులు తమతో కూడా బాబా ఇలాంటి మాటలు అన్నట్లు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'ట్రస్టు పెత్తందార్లే అసలు కుట్రదార్లు' అనే శీర్షికతో ఒక పత్రికలో ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైంది. ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది నిందితులుగా ముద్రపడ్డ వ్యక్తులే కావచ్చు. కానీ, దీనిని చదివితే అందులోని అంశాలు మరీ సత్యదూరం కావని ఆనాటి పరిణామాలు, నేటి పరిస్థితుల్ని బట్టి కచ్చితంగా అనిపిస్తుంది. ఆనాటి ఇంటర్వ్యూలో బోయపాటి రవి, శాంతారాం ప్రభు చెప్పిన విషయాలివీ...

ట్రస్ట్ చేతిలో బాబా బందీ

"భగవత్ స్వరూపుడైన బాబా లౌకిక విషయాల్లో ప్రమేయం పెట్టుకోకపోవడాన్ని ఆసరాగా తీసుకొని, పెత్తందారులు తాము చేసే పనులన్నీ బాబా ఆమోదంతోనే జరుగుతున్నాయన్న భ్రమ కల్పిస్తున్నారు. బాబా సందేశాలకు వక్రభాష్యం చెప్పి తప్పుడు ప్రచారం వచ్చేలా చూసిన వారిలో కస్తూరి ముఖ్యుడు. ప్రశాంతి నిలయంలో పెత్తందార్లంతా ప్రతి సందర్భంలోను తమ లక్ష్యాలకు బాబా పేరు వాడుకుంటున్నారు.''

బాబాకూ ప్రాణగండం..

"బాబా వాస్తవాలు బహిర్గతం చేస్తారనుకుంటే ట్రస్టు అధికారులు బాబాని హత్య చేయటానికి కూడా వెనకాడరు. బాబా అంటే ఏ మాత్రం భక్తి, గౌరవం లేనివారు కేవలం డబ్బు, పెత్తనం కోసమే బాబాని అడ్డుపెట్టుకున్నారు. బాబా వాస్తవాలు బయటపెడితే ట్రస్టు ఆటలు సాగవు. బాబా అలా చేస్తారనే అనుమానం కలిగితే బాబాని హత్య చేసి ఆయన సమాధిని భక్తులకు చూపి దానిపై సొమ్ము చేసుకోవటానికి కూడా వెనకాడరు''

బాబా పని అయిపోయింది..

"ట్రస్టుకు కాంగ్రెస్‌తోను, పోలీసులతోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాబాపై హత్యాప్రయత్నం జరిగితే, ట్రస్టు అధికారులకు సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? బాబా పేరుతో ట్రస్టు సభ్యులు, అధికారులు స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. సాయి పట్ల వారికి భక్తి లేదు. 'బాబా పని అయిపోయిందని' ట్రస్టు వారు బాహాటంగానే అంటున్నారు.

సత్యసాయి మౌనం, మంచితనమే కొందరు పెత్తందార్లకు, అధికార లాలసులకు వెర్రితలలు వేసే అవకాశం ఇస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సేవాభావాన్ని హరిస్తూ, బాబా అభిప్రాయాలను పక్కకు తోసేస్తూ వారు వ్యవహరిస్తున్న తీరు ప్రశాంతి నిలయాన్ని అశాంతి నిలయంగా మార్చేస్తోంది. తన ఉప్పు తింటూ కృతఘ్నతతో మసలే వీరి గురించి బాబా వాస్తవాలు బయట పెడితే ట్రస్టు పెత్తందార్ల ఆటలు సాగవు''

బాబాను మేమే తయారుచేశాం..

"కొందరు ట్రస్ట్ సభ్యులు, ట్రస్ట్ అధికారులు బాబా దైవత్వాన్ని ప్రైవేటు సంభాషణల్లో ఆమోదించరు. అనేక మంది మనుషుల్లో లేని కొన్ని ప్రత్యేక శక్తులున్న రత్నాకర సత్యనారాయణరాజుగా మాత్రమే బాబాను వారు పరిగణిస్తారు. అలాంటి సత్యనారాయణ రాజును సత్యసాయిబాబాగా తయారుచేసిందని తామేనని చెప్పుకుంటూ ఉంటారు. బాబా పని అయిపోయిందని ఇటీవల ప్రశాంతి నిలయం పెత్తందార్లు బాహాటంగానే అంటున్నారు''.

అక్రమాలు చేసేది వీరే..

"సాయి సెంట్రల్ ట్రస్ట్ విధులేమిటో, నిధులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ట్రస్ట్ సెక్రటరీ నారాయణన్, మెయిన్ అడ్మినిస్ట్రేటర్ కల్నల్ జోగిరావు పుట్టపర్తిలో ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ట్రస్ట్ సభ్యులైన శ్రీనివాసన్, ఇందూలాల్ షాల వత్తాసు వీరికి ఉంది. వీరందరూ కలిసి సేవాదళ్ కార్యకర్తల్లో కొందరిని లోబరుచుకొని ప్రశాంతి నిలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు''

బాబాకి తెలిసే అవినీతి..

"1986లో నేను (ప్రభు) బాబా ఆశ్రమంలోకి వెళ్లాను. ఏ విధులు నిర్వహిస్తావని బాబా అడిగారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాలని అడిగా. 'అక్కడ ఏముంది.. అవినీతి.. అవినీతి.. అవినీతి' అని బాబా వ్యాఖ్యానించారు. ఆశ్రమంలో ఉండు. తర్వాత చూద్దాం అన్నారు.

ఆశ్రమం సమీపంలో ఉన్న చలపతిరావు దుకాణం స్థలాన్ని ట్రస్ట్ ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకుంది. ఈ విషయం చలపతిరావు చెప్పుకున్నప్పుడు - ' నీ స్థలం మాకు అవసరం లేదు' అని బాబా స్వయంగా చెప్పారు. అయినప్పటికీ ట్రస్ట్ పెద్దలు రెవెన్యూ అధికారుల ద్వారా షాపు మూసేయాలని నోటీసు ఇప్పించారు. ఆ షాపుకు వెళ్లే భక్తులపై వలంటీర్లు చేయి చేసుకోవటంతో ఎవరూ వెళ్లటం లేదు''.

ట్రస్ట్ అక్రమాలు..

"హైదరాబాద్‌లో కళ్యాణ మండపం కట్టడం కంటే ఆ నిధులను ఒక ఫండ్‌గా రూపొందించి దానిపై రాబడులతో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది బాబా అభిమతం. అలాగే పుట్టపర్తిలో ఆయుర్వేద వైద్యశాల మాత్రమే విస్తృత ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. ఇందుకు భిన్నంగా కళ్యాణమండపాన్ని, అలాగే అల్లోపతి విధానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ట్రస్ట్ నిర్మింపచేసింది. సంపన్నుల నుంచి, విదేశీయుల నుంచి భారీగా విరాళాలు సేకరించి వీలైనంత కైంకర్యం చేయటానికే బాబా అభీష్టానికి వ్యతిరేకంగా ఈ నిర్మాణాలు చేపట్టారు''

ఆర్థిక అక్రమాలు..

"దేశ, విదేశాల నుంచి భక్తులు రోజూ బాబాకు లేఖలు రాస్తారు. కార్యక్రమాల కోసం విరాళాలు పంపుతారు. ఇక ప్రశాంతి నిలయానికి స్వయంగా వచ్చి విరాళాలు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారు. ఒక రోజులో ఎంత మొత్తం సొమ్ము వస్తోంది? వాస్తవంగా అందులో ఎంత సొమ్ము ట్రస్టుకి జమ అవుతోంది అన్న విషయం ఒక బాధ్యతాయుతమైన ఏజెన్సీ ఏదైనా పరిశీలిస్తే అక్రమాలు బయటపడతాయి. చెక్కుల రూపంలో కాకుండా ట్రావెలర్స్ చెక్కుల రూపంలో విరాళాలు ఇవ్వాలని ట్రస్టు అధికారులు భక్తుల్ని ఒత్తిడి చేస్తుంటారు. దీనికి కారణం ఆ సొమ్ము లెక్కల్లో చూపించకుండా కైంకర్యం చేయటానికి వీలు ఉండటమే''.

అయ్యప్ప భక్తులపై వివక్ష

"అయ్యప్ప స్వామి భక్తులను ప్రశాంతి నిలయంలోకి ట్రస్టు అధికారులు అనుమతించటం లేదు. విశ్వప్రేమను ప్రబోధించే బాబాకు వ్యత్యాసాలు, వివక్షలు లేవు. ఎన్నో సందర్భాల్లో ఆయన ఈ విషయాలు స్పష్టంగా చెప్పారు. అయినా ట్రస్ట్ అధికారులు అయ్యప్ప భక్తులను అనుమతించలేదు. గేటు వెలుపలే ఉండిపోయిన భక్తులను స్వయంగా గమనించిన బాబానే లోనికి రప్పించారు''.

వీరే పూనుకోవాలి..

"బాబా భక్తులు, పత్రికలు, పౌరహక్కుల సంఘాలు, న్యాయవ్యవస్థ తలుచుకుంటే ప్రశాంతి నిలయంలో దారుణాలు వెల్లడి కావడం పెద్ద సమస్యకాదు''

--