Friday, 21 September 2012

తెలుగు జాడ.. గురజాడ! 1862 సెప్టెంబర్ 21 - నేడు 150వ జయంతి .


దేశమంటే దేశమంటే
మతం కాదోయ్, గతం కాదోయ్
అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్నచేతి గన్ను కాదోయ్
క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్రవ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే
గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధనుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని జల్లే అరాచకమే కాదు కాదోయ్
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
క్రోధమెందుకు కరుణ పంచు
స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు
కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్త బంగరు భవిత నీదే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే
దేశమంటే మనుషులోయ్
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్'... అని నినదించిన ఘనుడు! తేట తెలుగు అక్షరాలను 'ముత్యాల సరాలు'గా పేర్చిన కవివర్యుడు! పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కష్టాలకు పాట కట్టిన పరిపూర్ణుడు! నేటి కాలపు మోసగాళ్లకు, ఒట్టి మాటగాళ్లకు ప్రతినిధిగా ఆనాడే 'గిరీశం' అనే పాత్రను సృష్టించిన కలం యోధుడు... తెలుగు వారికి వెలుగు జాడై నిలిచిన గురజాడ అప్పారావు 150వ జయంతి శుక్రవారమే. 1862 సెప్టెంబర్ 21న ఆయన జన్మించారు. వర్తమానం నుంచి వందేళ్లు ముందుకెళ్లి రచనలు సాగించిన మహాకవి. రవీంధ్రనాథ్ టాగూర్, భారతియార్ దేశభక్తి గీతాలు రాసినప్పటికీ వాటిలో ప్రాంతాలు, దిక్కులు మాత్రమే ఉన్నాయి. 

కానీ... గురజాడ 'దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుషులు' అని ఆ ఎల్లలు చెరిపేశారు.
"నన్న య్య గతం తెలిపిన రచయిత. శ్రీశ్రీ రచనలు భవిష్యత్‌ను తెలిపా యి. గురజాడ మాత్రం వర్తమానం తెలిపిన కవి. ఆయన తెలుగు వారి సోక్రటీస్''. 
from swapnamahi.blogspot.com


ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది-గురజాడ అప్పారావు
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

గురజాడ అప్పారావు
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.


వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.

జీవిత విశేషాలు:

గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం (ఎలమంచిలి) గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 వ తేదిన అప్పారావు మతామహుల ఇంట జన్మించారు.. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లి లో పదేళ్ళ వరకు చదివాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

1884
లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆప్ఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.


గిడుగు రామమూర్తి తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు (ఖచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించాడు.

53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.

»мαнι ℓσνє'ѕ υ« ミConnecting People彡


Thursday, 26 July 2012

రికార్డులు నెలకొల్పిన ప్రతిభాపాటిల్

దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా దేవీసింగ్ పాటిల్. సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన పెద్ద వయస్కురాలు కూడా ఆమే. రాష్ట్రపతిగా 24 సార్లు విదేశాల్లో పర్యటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. 12వ రాష్ట్రపతి అయిన ఆమె పదవీ కాలం రేపటితో (జూలై 25) ముగియనుండటంతో నిన్న (23న) పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ప్రతిభా పాటిల్‌ 1934 డిసెంబర్‌ 19న మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలోని నంద్ గావ్ గ్రామంలో జన్మించారు. జల్‌గావ్ లో ఆమె రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. బాంబే లా కాలేజ్‌ నుంచి లా డిగ్రీ పొందారు. క్రీడల్లో ఆమెకు బాగా ఆసక్తి కనబరిచేవారు. టేబుల్‌ టెన్నిస్‌లో ఆమె చాలా అవార్డులు కూడా గెలుచుకున్నారు.

జల్‌గావ్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఆమె తన ప్రాక్టీస్‌ ప్రారంభించారు. పేద మహిళల సమస్యలు తీర్చడంలో ఆమె ముందుండేవారు. 27 ఏళ్ళ వయస్సులోనే ఆమె మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1985 వరకూ ముక్తాయ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 1985 నుంచీ 90 వరకూ ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. 1991లో పదో లోక్‌సభకు అమ్రావతి నుంచి ఎన్నికయ్యారు. 1967 నుంచీ 80 వరకూ మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిద మంత్రి పదవులు అధిష్టించారు. 1979 జూలై నుంచి 1980 ఫిబ్రవరి వరకు ఆమె మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 1986 నుంచీ 88 వరకూ రాజ్యసభలో డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా కొనసాగారు. 1988 నుంచీ 90 వరకూ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

2007 జులై 25న రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ఆమె రాజస్థాన్‌కు గవర్నర్‌గా పనిచేశారు. ఆ నాటి యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రతిభాపాటిల్‌కు వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షం శివసేన కూడా మరాఠా వాదం పేరుతో ఆమెకే మద్దతిచ్చింది. దీంతో ఆమె ఎన్‌డిఏ అభ్యర్ధి, నాటి ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్‌ షెకావత్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాష్ట్రపతిగా ఐదేళ్ళ పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రతిభాపాటిల్‌ తన హయాంలో 24 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. దేశ విదేశాల్లో భారత వాణిని బలంగా వినిపించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకున్న ఆమె సుఖోయ్‌ యుద్ధ విమానంలో 30 నిమిషాల పాటు ప్రయాణించి రికార్డు సృష్టించారు. ఇలా సుఖోయ్‌లో ప్రయాణించిన పెద్ద వయస్కురాలు కూడా ప్రతిభాపాటిలే కావడం విశేషం. 

తమ పదవీకాలంలో ప్రతిభా పాటిల్‌ 35 మంది ఖైదీల మరణశిక్షను జీవిత కాల శిక్షగా మార్చారు. ప్రతిభాపాటిల్‌ పదవిలో ఉండగానే ఆమె భర్త దేవీసింగ్‌ రాణీసింగ్‌ షెకావత్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్రలోని పూణేలో రక్షణశాఖకు చెందిన భూమిని కారుచౌకగా పొందాలని చూశారని ప్రతిభ కుటుంబసభ్యులపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఆ భూమిని తీసుకోరాదని కూడా నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలో ఇటీవలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అయిన ప్రతిభ తనయుడి కారులో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం సంచలనం సృష్టించింది. రిటైర్‌మెంట్‌ తర్వాత ప్రతిభాపాటిల్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ నివాసానికి పక్కనే ఉన్న భవనంలోకి మారనున్నారు.

Tuesday, 29 May 2012

అకృత్య చక్రవర్తి - క్లాడియస్ సీజర్ అగస్టస్ జెర్మానికస్ అనే పూర్తి పేరు కలిగిన నీరో!

అకృత్య చక్రవర్తి

ఓ పక్క రోమ్ నగరం కాలి బూడిదైపోతోంది. ఇంకోపక్క నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూచున్నాడు. ఇది చాలు నీరో ఎలాంటి వ్యక్తో చెప్పడానికి! నీరోకి కళలంటే తగని మక్కువ. విచ్చలవిడితనం ఎక్కువ. నీరో ఓ వైపు సంగీతకారుడు. మరోవైపు క్రూరుడు. సమర్థ నాయకత్వ లక్షణాలున్నాయి. కాని వాటిని పట్టి ఉంచుకోగల బుద్ధి విచక్షణ లేదు.

ఓ పట్టాన అర్థం కాని వ్యక్తిత్వం నీరోది. జవాబుల్లేని ప్రశ్నలెన్నో నీరో జీవితంలో! 30 యేళ్లు మాత్రమే జీవించినా - రోమన్ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే సంచలనం సృష్టించిన చక్రవర్తి - క్లాడియస్ సీజర్ అగస్టస్ జెర్మానికస్ అనే పూర్తి పేరు కలిగిన నీరో!


నీరో పొడగరి కాదు. ఒంటి నిండా మచ్చలు. ఎప్పుడూ శరీరం నుండి ఏదో భరించలేని వాసన. రాగిరంగు జుట్టు. నీలం రంగు కళ్లు. అవి కాంతిలేని గాజు కళ్లకు నకళ్లు. పైగా కొద్దిగా మెల్ల. మెడ కొంచెం మందం. పైకి పొడుచుకు వచ్చిన పొట్ట. సన్నని కాళ్లు. దేహంలోని ఏ భాగమూ స్ఫుటంగా, తీరుగా ఉండవు. అయినా ఏదో తెలీని ఆకర్షణ, అందమూ!

నీరో అచ్చమైన కవి. సిసలైన గాయకుడు. బాణీలు కట్టి మాటల్ని పాటలుగా అల్లిన సంగీతకారుడు. లైర్ అనే వాద్య పరికర తంత్రుల్ని మీటుతూ రాగామృతంలో మునిగిపోయిన భావుకుడు. నాట్యం చేస్తూ ఊగిపోయిన ఉద్రేకుడు. నటుడు. తనలోని కళల్ని నలుగురికీ చూపించాలని తపించేవాడు. రసజ్ఞుల చప్పట్లకై మురిసిపోయిన అమాయకుడు. 

కాని వేదిక ఎక్కాలంటే మాత్రం తెగ భయం. సభాకంపంతో చాలాసార్లు ప్రదర్శనల్ని రద్దు చేసుకున్నాడు. చివరకు తెగించి క్రీ.శ.64లో 27వ యేట నియోపాలిస్ పట్టణంలో తొలి కచేరీ ఇచ్చాడు - అదీ చక్రవర్తి అయి ఉండి! ఆ రోజు వేలాది ప్రజలు నీరోని హీరోగా ఆరాధించారు. 

పాలకుడిగా కూడా మంచి మార్కులే పడతాయి నీరోకి. పేదలకు పన్నుల భారం తగ్గించాడు. అవినీతిని అరికట్టాడు. నైలునది పుట్టుకను తెలుసుకునేందుకు ఎంతో ఖర్చుపెట్టి పరిశోధనా యాత్రలు ఏర్పాటు చేశాడు. కాలువలు తవ్వించాడు. జిమ్‌లు, థియేటర్లు కట్టించాడు. ఖడ్గయుద్ధ ప్రదర్శనల్ని ఏర్పాటు చేశాడు.

రోమన్ అయినా గ్రీకు సంస్కృతి అంటే మాత్రం నీరోకి చెప్పలేనంత ఇష్టం. గ్రీకు భాషను ధారాళంగా మాట్లాడేవాడు. వస్త్రధారణలో గ్రీకుల్ని అనుకరించేవాడు. ఒలింపిక్స్ తరహాలోనే రోమ్‌లో కూడా నిరోనియా అనే పేరుతో క్రీడోత్సవాల్ని అంబరాన్ని తాకే సంబరంగా జరిపేవాడు.
గ్రీసు దేశంలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని తహతహలాడేవాడు. బోలెడన్ని బహుమతులు గెలవాలని ఉబలాటపడేవాడు. సంగీత పాటవ పోటీల్లో ఎలాగూ తానే గెలుస్తానని తెలుసు.
రథాల పోటీలో కూడా విజేతగా నిలవాలనుకున్నాడు. అక్కడేమో పది గుర్రాల్ని పూన్చిన రథాన్ని నడపాలి. తనకేమో ఒక్క గుర్రం మాత్రమే ఉండే రథాన్ని నడపడమే తెలుసు. కఠోర సాధన చేస్తుండగానే ఒలింపిక్స్ క్రీడలొచ్చేశాయి. దాంతో అధికారులకు మూడో కంటికి తెలీకుండా లంచాలిచ్చి రెండేళ్లు వాయిదా వేయించాడు. అంతలో దశాశ్వ రథ చోదనంపై పట్టు సాధించాడు.

చివరకు క్రీ.శ.67లో ఆ పోటీల్లో పాల్గొన్నాడు. అన్నింటిల్లోనూ విజయమే పొందాడు. రథ చోదనంలో మాత్రం చాలాసార్లు కిందపడ్డాడు. చావు తప్పి కన్ను లొట్టబోయింది. అయినా అందులోనూ గెలిచాడు. ఘనమైన రోమ్ చక్రవర్తి స్థానంలో ఉండి ఏకంగా 1800 గ్రీకు పతకాలు సాధించాడు.

ముగింపు వేడుకల్లో గ్రీకుల్ని ఉద్దేశించి ఉపన్యసించాడు. ఆ ఆవేశంలో, ఆనందంలో గ్రీకులకు అనేక రాయితీలు ప్రకటించేశాడు. అది కాస్తా రోమన్లకు ఆగ్రహాన్ని కలగజేసింది. అప్పటికే కళాపోషణలో పడి ప్రజారక్షణ, సంరక్షణ మరిచిపోయిన నీరోని రోమన్లు జీరోని చేశారు.
ఎన్నో ఉత్తమ గుణాలున్నప్పటికీ నీరో కథ విషాదాంతమవడానికి కారణం - అతని తల్లి అంటే ఆశ్చర్యం వేస్తుంది.

నీరో తల్లి అగ్రిప్పినా. తన కడుపున క్రీ.శ. 37 డిసెంబర్ 15న నీరో పుట్టిన నాటి నుంచి ఆ పిల్లాడు రోమ్ చక్రవర్తి కావాలని కలలు కంది. అగ్రిప్పినా అసాధారణ అందగత్తె. తెలివైనది. దురాశాపరురాలు. ఎంతకైనా తెగించే హింసాప్రవృత్తి ఆమెది. అధికార దాహం మెండు. ఆమెకు కుడివైపు పై దవడలో రెండు కోరపళ్లున్నాయి. అది అదృష్టమని రోమన్లు నమ్ముతారు.
భర్త గ్నాయెస్ డొమిటెస్ అహెనో బార్బస్‌తో ఆమె కొంతకాలమే కాపురం చేసింది. 

తర్వాత మరొకర్ని పెళ్లి చేసుకుని వెంటనే వదిలేసింది. తన పుత్రుణ్ని గద్దెనెక్కించేందుకు మార్గాల్ని అన్వేషించింది. అప్పటికి సింహాసనంపై క్లాడియస్ ఉన్నాడు. అతనెవరో కాదు - అగ్రిప్పినాకు పెదనాన్న. అతణ్ని చేసుకుంటే - వారసుడిగా తన కొడుకుని రోమ్ చక్రవర్తిని చేయొచ్చు. అంతే. వెంటనే క్లాడియస్‌ను పెళ్లి చేసుకొంది. అతనికి నాలుగో భార్యగా వెళ్లడానికి ఏమాత్రం వెనుకాడలేదు. తనకు అతగాడు మూడో జతగాడు కదా. పర్లేదు!

తన కొడుకు రేపోమాపో చక్రవర్తి అవుతాడు. అయితే సరిపోదు. నిలబడాలి. శాశ్వతంగా చక్రం తిప్పాలి. అలా జరగాలంటే ఎక్కడ నొక్కాలో చెక్కాలో మొక్కాలో తొక్కాలో తెలియాలి. అందుకోసం సెనెకా అనే ప్రత్యేక రాజగురువుని నియమించింది.
రాజనీతిపై గట్టి పట్టున్నవాడు సెనెకా. చక్రవర్తి క్లాడియస్ మేనకోడలు జూలియా లివిల్లాతో వివాహేతర సంబంధం మూలాన రాజదర్బారు నుంచి బహిష్కరణకు గురైనవాడు సెనెకా. అలాంటి వాడికే తెలుస్తాయి - కుట్రలూ కుతంత్రాలూ.

అలాంటి గురువు చేత - 10 యేళ్లు కూడా నిండని నీరోకి, రెక్కలు ఎదగని కోమలుడికి, కళలంటే పిచ్చి అభిమానమున్న బాలుడికి, మార్దవుడికి - కర్కశత్వాన్ని, కాఠిన్యాన్ని, అధికార లాలసను నేర్పించడం మొదలెట్టింది అగ్రిప్పినా! పిల్లల్ని మార్కుల కోసం చెండాడే నేటి తల్లుల్లా!!
ఏడేళ్లు ఎదురుచూసింది అగ్రిప్పినా. 

నీరో మేజర్ అయ్యాడు - ఆనాటి రోమన్ సూత్రాల ప్రకారం చక్రవర్తి అయ్యే వయసుకి వచ్చాడు. ఓ శుభదినాన భర్త క్లాడియస్‌ను అగ్రిప్పినా చంపించింది - పుట్టగొడుగుల్లో విషాన్ని కలిపి! కొడుకు చక్రవర్తి కావడానికి రాచమార్గం వేసింది. క్రీ.శ. 54 అక్టోబర్ 13న 17 యేళ్ల నీరో పీఠాన్ని అధిరోహించాడు.

కొడుకు చక్రవర్తి అయ్యాక చక్రం తిప్పాలనుకుంది అగ్రిప్పినా. కాని అనూహ్యంగా ఆమెకు అడ్డం పడ్డాడు సెనెకా. సవతి సోదరి క్లాడియా ఆక్టావియాతో నీరోకి పెళ్లి చేసింది అగ్రిప్పినా. వావి వరసలు లేని ‘అగమ్య గమనం’ అనే వివాహాలు నాటి రోమన్లకు సంప్రదాయమే! కాని వైవాహిక జీవితం అంతగా సంతృప్తినివ్వలేదు నీరోకి. దాంతో పనిమనిషి క్లాడియా ఆక్టేతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నీరో. తన స్నేహితుడు ఓథో భార్య పాపియా సబీనాతోనూ ఇలాగే ప్రవర్తించాడు. 

మొదట్లో తల్లి మాట విన్నాడు నీరో. క్రమంగా నువ్వెవరివి అని ఎదురు ప్రశ్నించాడు. రాజగురువు సెనెకా నీరోకే మద్దతిచ్చాడు. దాంతో అగ్రిప్పినాకు ఒళ్లు మండింది. సొంత కొడుకని కూడా చూడకుండా నీరోని గద్దె దింపాలని పంతం పట్టింది. నీరోకి సవతి సోదరుడైన బ్రిటానికస్‌ని చక్రవర్తిని చేయాలనుకుంది. కాని ఆ కుర్రాడు మేజర్ కాబోవడానికి ముందురోజే చనిపోయాడు. కాదు... కాదు... నీరోయే చంపించేశాడు.

దాంతో అగ్రిప్పినా తోక తొక్కిన తాచుపామయింది. పాలనా వ్యవహారాల్లో మునుపటికి మించి తలదూర్చింది. చివరకు నీరో ఆమెను హత్య చేయించేదాకా కథ ముదిరింది. మూడుసార్లు తల్లిపై విషప్రయోగం చేశాడు. ఆమె ఇంకా తెలివైంది! విరుగుడు ఔషధాన్ని సేవించి బయటపడింది. ఓసారి ఆమె ఓడలో మునిగిపోయేలా చేశాడు నీరో. బతికి బట్టకట్టింది. చివరకు తల్లినే ఉరితీసి ఆత్మహత్యగా చిత్రించాడు నీరో! నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!!

క్రీ.శ. 64 జూలై 18. రోమ్ నగరం తగలబడిన రోజు. ఆగ్నేయ మూల బాణసంచా మూలాన రాజుకున్న రవ్వ క్షణాల్లో దావానలమైంది. ఇళ్లు, భవంతులు అన్నీ బూడిద కుప్పలయ్యాయి. నగరాన్ని నల్లటి మేఘాలు కప్పుకున్నాయి. వరసగా ఐదు రోజులు మంటలే మంటలు. నీరోయే ఈ అకృత్యానికి కారణమని అంతా అనుకున్నారు. డోమస్ ఆరియా అనే మహా అద్భుత రాజప్రాసాదాన్ని నిర్మించేందుకు నీరో ఈ దారుణానికి ఒడిగట్టాడంటారు.

అగ్ని కీలలు ఓ పక్క అలుముకుంటున్నా... నీరో మాత్రం ‘లైర్’ అనే వాద్యాన్ని వాయించడంలో మునిగిపోయాడు. సాక్ ఆఫ్ ఇలియం గీతాలాపన చేశాడు. ఆనాటికి ఫిడేల్ ఇంకా రూపొందలేదు. లైర్‌ని ఫిడేల్‌కు పూర్వరూపమనవచ్చు. మంటలు కాస్త తగ్గాక, నీరో సహాయ చర్యలకు పూనుకున్నాడు విచిత్రంగా! శిథిలాల కింద చిక్కుకున్న వారిని తానే స్వయంగా తీశాడు. క్షతగాత్రుల్ని రక్షించాడు. తన రాజ ప్రాసాదంలో ఆశ్రయమిచ్చాడు. ఆహారమిచ్చాడు.

అయినా ప్రజలు నమ్మలేదు. నీరోయే దోషి అన్నారు. సెనెటర్లు నీరోపై కత్తికట్టారు. అధికారం కోసం అర్రులు చాచిన వారంతా ఏకమై నీరోపై కక్ష కట్టారు. నీరోలోని విశృంఖలత్వం ప్రజాకంటకుడయ్యేందుకు కారణమైంది. చేపల్ని పట్టేందుకు బంగారు తీగల్ని ఉపయోగించేంత భోగత్వం; తల్లిని, భార్యను, చివరకు గురువు సెనెకాను సైతం హతమార్చిన క్రూరత్వం; నిత్యం స్త్రీలతో సరసాలాడిన లాలసత్వం - వెరసి నీరోని ప్రజలు అసహ్యించుకునేలా చేశాయి. చివరకు నీరో క్రీ.శ. 68, జూన్ 9న ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. నీరో పలికిన చివరి మాటలు - ‘‘ఎంతటి అసహ్యకర జీవితం నాది. నాలోని కళాకారుడూ చావక తప్పదే!!’’

మొదట్లో తల్లి మాట విన్నాడు నీరో. క్రమంగా నువ్వెవరివి అని ఎదురు ప్రశ్నించాడు. రాజగురువు సెనెకా నీరోకే మద్దతిచ్చాడు. దాంతో అగ్రిప్పినాకు ఒళ్లు మండింది. సొంత కొడుకని కూడా చూడకుండా నీరోని గద్దె దింపాలని పంతం పట్టింది... నీరో తల్లి అగ్రిప్పినా

Tuesday, 3 April 2012

ఆత్మాహుతి వీర లక్షణం కాదు:

బతుకు.. బతికించు!
యుగయుగాల జీవన సారం ఇదే!
ఆత్మాహుతి వీర లక్షణం కాదు: విశ్లేషకులు

అప్పులు, కుటుంబ కలహాలు, ప్రేమలో విఫలం... ఇలాంటి చిన్న చిన్న కారణాలవల్ల ఆత్మహత్య చేసుకోవడం ఎన్నాళ్లుగానో ఉన్నదే! ఇప్పుడు... మన రాష్ట్రంలో సామాజికపరమైన అంశాలకోసం మరణించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. నమ్మిన సిద్ధాంతం కోసమో, తాము అభిమానించే వ్యక్తికోసమో మరణిస్తున్న వారు ఎక్కువయ్యారు. "ఎంచుకున్న మార్గాన్ని వీడకుండా... మరణానికి కూడా సిద్ధపడటాన్ని వీర లక్షణంగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం తమ జీవితానికి అర్థం లేదని, ఆత్మహత్మకు పాల్పడితే ఒక అర్థం వస్తుందని కొందరు భావిస్తారు. ఇది నిజం కాదనే విషయం వారికి తెలియ చెప్పాలి'' అని మనో విజ్ఞాన విశ్లేషకులు సుధీర్ కాకర్ పేర్కొన్నారు. 

తెలంగాణకోసం... బలిదానాలు చేసుకునే వారిలో యువతే ఎక్కువ! ఇలా పోరుబాట వీడి... చావుబాట వెతుక్కునే వారిపై కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఒక కన్నేసి ఉంచాలి. బలిదానాలు చేసుకున్న వారి నేపథ్యాన్ని గమనిస్తే... వారంతా అంతకుముందు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారే. 'ఛీ... ఇక లాభం లేదు' అంటూ చూచాయగానైనా మరణం బలిదానాల గురించి ప్రస్తావించి ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలను కుటుంబ సభ్యులు, మిత్రులు ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోరాదని ఆత్మహత్యల నివారణకు పనిచేసే కెవిన్ కరూసో (సూసైడ్ డాట్ ఆర్గ్) అనే మానసిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఆ ఆలోచనను మొగ్గలోనే తుంచి వేయాలని చెప్పారు. 

తొలుత ఆ వ్యక్తి మనసును విప్పించాలి. అతను చెప్పేది సానుకూలంగా వింటూనే... 'చనిపోతావా? నువ్వు చనిపోతే నిన్ను ప్రేమించే మేం ఏమైపోతాం? చనిపోతే ఏం జరుగుతుంది? సమస్య పరిష్కారమవుతుందా? గతంలో ఎందరో ఆత్మాహుతి చేసుకున్నారు! మరి... వారందరి బలిదానంవల్ల ఏం ఒరిగింది? మనం ఉండి పోరాడాలి తప్ప... పోతే ఏమీ కాదు!'' అని మనసు మార్చేందుకు ప్రయత్నించాలి. వీరిని మానసిక విశ్లేషకుల వద్ద కౌన్సెలింగ్ చేయించాలి. చనిపోవాలనుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించినా... దాని జోలికి వెళ్లరు. హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డుల విజేత హాలెబెర్రీ ఒకదశలో వ్యక్తిగత సమస్యలతో కుంగిపోయింది. 

ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. చివరి క్షణంలో... ఆమెకు అమ్మ గుర్తుకు వచ్చింది. 'నా శవాన్ని మా అమ్మ చూస్తే... ఆమె ఎంత ఆవేదనకు గురవుతుందో!' అని ప్రశ్నించుకుంది. అంతే... ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు... ఒక కుటుంబం ఉంటుంది. వీరిలో ఏ ఒక్కరి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకున్నా... ఆత్మహత్య చేసుకోరు! పైగా... ఆత్మహత్య అనేది సమస్య నుంచి పారిపోవడమే తప్ప, పరిష్కారం కాదు. అదీకాక... సామాజిక అంశాలపై ఆత్మహత్య చేసుకోవడం వల్ల కలిగే ఫలితం శూన్యం! ఈ విషయాన్ని మనసుకు హత్తుకునేలా చెబితే... ఏ ఒక్కరూ తమను తాము చంపుకోరేమో! 

ఇవీ లక్షణాలు...
ఆత్మహత్య ఆలోచన చేసుకునేవారిలో కొన్ని ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్ర ఆందోళన లేదా నిస్పృహ, తనకు ఎంతో ఇష్టమైన అంశాలపైనా అనాసక్తి ప్రదర్శించడం, నిస్సహాయత ప్రదర్శించడం, పదేపదే వ్యతిరేక భావనలు (ఇక లాభంలేదు, ఇక ఏమీ జరగదు.. ఇలా) వ్యక్తం చేయడం. 
పోరాడి గెలవాలె
"బిడ్డలారా... సచ్చి సాధించేది ఏదీ లేదు. పోరాడి గెలుచుకోవాలె. నా కొడుకోలే ఇంకెవ్వరూ తల్లిదండ్రులకు దూరమై పుట్టెడు శోకం మిగిల్చకండి. తెలంగాణ కోసం కొట్లాడాలే... ప్రాణాలు తీసుకోవద్దు. కన్నుమూసినా తెరిచినా కొడుకు జ్ఞాపకాలే. పెద్ద చదువు చదివి కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాం. ఇపుడు కుటుంబ పరిస్థితి ఎట్లా అని భయమవుతోంది.''
- లూనావత్ నామా (భోజ్యానాయక్ తండ్రి) 

మతాలేం చెబుతున్నాయి?
'నీ పని నువ్వు చేయి. ఫలితాన్ని నాకు వదిలిపెట్టు'.... ఇది శ్రీకృష్ణుడి గీత. అర్జునుడి అస్త్ర సన్యాసాన్నే శ్రీకృష్ణుడు సమ్మతించలేదు. ఇక జీవితాన్నే త్యాగం చేస్తానని ఎవరైనా అంటే ఊరుకుంటాడా? ఆత్మ బలిదానాలు ఏ మతానికీ సమ్మతం కాదు. ఇక్కడ సమస్యలున్నాయని 'తప్పించుకు' పారిపోతే... నరకలోకవాసం తప్పదని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆత్మహత్యల గురించి ఏ మతం ఏం చెబుతుందంటే... హైందవం: ఆత్మహత్య మహా పాపం. జీవుడిలోని ఆత్మ సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. ఆ ఆత్మను బలవంతంగా చంపుకోవడం పాతకం. గుడిలోని దీపంలా అది కొండెక్కేంతవరకూ అలా వెలుగుతూనే ఉండాలి. 

ఇస్లాం: ఇస్లాం జీవన విధానానికి ఆత్మహత్య పూర్తి వ్యతిరేకం. "మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమిత దయగలవాడు'' అని ఖురాన్ చెబుతోంది. 

క్రైస్తవం: సృష్టిలో ప్రతి ఒక్కరి జీవితానికీ దేవుడి మదిలో ఉన్న ప్రణాళిక 'జీవించడానికే'గానీ మరణించడానికి కాదు. ఈ జీవితం ఆ దేవుడికి చెందినది. ఆత్మహత్య చేసుకోడమంటే.. దేవుడి నియమాలను ఉల్లంఘించినట్టే. కష్టాలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. దేవుడిపై విశ్వాసం ఉంచాలి.

Wednesday, 7 March 2012

ఏది నీది? ఏది కానిది? -- ఆస్తి, అధికారం, అందం...

ఏది నీది? ఏది కానిది?

ఆస్తి, అధికారం, అందం...

ఇవన్నీ తనవే, అన్నీ తనకే అనుకుంటాడు మానవుడు. అందుకే ఈ స్వార్థం, గర్వం, మోహం. కానీ, నీది అనుకుంటున్న దంతా మాయ అంటారు జగద్గురు ఆది శంకరాచార్య! అయితే ఏదీ నాది కానప్పుడు ఇక నేనెందుకు అన్న నిస్తేజం మనిషిని ఆవరించదా? 

అందుకు ఆయన చూపిన పరిష్కారం - నువ్వే బ్రహ్మ, నువ్వే సత్యం అని! 
ఏమిటీ అద్వైతం? బొమ్మలు వేరే కాని వాటిలోని మట్టి ఒకటే. ఆకారాలు వేరే కాని మనుషులంతా ఒకటే. అదే అద్వైతం. అదే జగద్గురువు సిద్ధాంతం.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలడి గ్రామం. 
క్రీ.శ. 788. వైశాఖమాసం. శుక్లపక్ష పంచమి మధ్యాహ్నం. నంబూద్రి బ్రాహ్మణ ఇంట శంకరుడి జననం. నాలుగేళ్లకే - తండ్రి శివగురు మరణం. తల్లి ఆర్యాంబ అన్నీ తానై పెంచింది. 5వ ఏట ఉపనయనం జరిపించింది. స్వతహాగా తీక్షణబుద్ధి, తార్కికత, ఏకాగ్రత ఎక్కువ ఆ పిల్లాడిలో! అందుకే వేదం, తర్కం, సాంఖ్యం, యోగం... నేర్చేసుకున్నాడు. 
అన్నీ అభ్యసించాక ‘అసలు ఏది సత్యం’ అన్న శంక మొదలైంది శంకరుడిలో. సిసలైన వైదిక తత్వం గాడి తప్పిందని పసిగ ట్టాడు. సన్యాసం తీసుకుని అసలైన జ్ఞానదీపాన్ని దేశమంతా వెలిగించాలని ఉవ్విళ్లూరాడు. కాని తల్లి ససేమిరా అంది. 

ఓ రోజు శంకరుడు పెరియార్ నదిలో స్నానం చేస్తున్నాడు. అంతలో ఓ మొసలి అతడి కాలు పట్టుకుంది. బతికి బట్టకట్టడం కష్టమని తేలిపోయింది. ఇంతలో రొప్పుతూ పరుగున తల్లి వచ్చింది. ఆమెను చూస్తూనే మునిగిపోతున్న శంకరుడు- ‘‘అమ్మా.. ఇప్పుడైనా సన్యాసం తీసుకోనివ్వమ్మా’’అని అభ్యర్థించాడు. శోకిస్తూనే ఆమె సరేనంది. 
శంకరుడిలో పట్టరాని సంతోషం. ఆశయ సాధనకు ఇక ఏ అవరోధమూ లేదు- మొసలి తప్ప! అంతే... ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని పెనుగులాడాడు. ఆత్మలో నిద్రాణంగా ఉన్న విశ్వాసాన్ని జాగృతం చేసి ఆ జలచరాన్ని ఒక్క తన్ను తన్నాడు; ఒడ్డున పడ్డాడు- వెనక్కిలాగే సంసార బలహీనతల్ని ఛేదించుకుంటూ! తల్లిని బంధువులకు అప్పగించాడు. అవసానదశలో ఆదుకుంటానని మాటిచ్చాడు. భారతదేశ పర్యటనకు బయలుదేరాడు. 

నేరుగా పయనమై నర్మదా తీరం చేరాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుడనే యోగికి శిష్యుడయ్యాడు. శంకరుడు సన్యాస దీక్ష పొందింది ఆయన దగ్గరే! శాస్త్ర రహస్యాలెన్నో తెలుసుకున్నదిక్కడే! శంకరుడిలో వేదాంత శక్తి ఉద్దీప్తమైందిప్పుడే! లక్ష్యం స్పష్టమైంది అప్పుడే!
ఆపై కాశీ వెళ్లి వేదాంత గ్రంథాల్ని ఔపాసనం పట్టాడు. దాంతో శంకరుడి తత్త్వశాస్త్రం పరిపూర్ణమైంది. అయితే ఓ రోజు శంకరుడికి ఓ పంచముడు ఎదురయ్యాడు. తప్పుకోమన్నాడు శంకరుడు. ‘‘ఎవరిని తొలగమంటున్నావు? నా శరీరాన్నా? నా ఆత్మనా?’’ అని ప్రశ్నించాడా పంచముడు. 

శంకరుడు సిగ్గుపడ్డాడు. ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమయ్యే సిద్ధాంతం వాసన లేని పువ్వని తెలుసుకున్నాడు. ఆత్మతత్వపు ఏకత్వాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ఆ పంచముడికి నమస్కరించి ‘‘మనీషా పంచ క’’ శ్లోకాల్ని ఆశువుగా చెప్పాడు. 
జ్ఞానానికి ఇప్పుడు అనుభవం తోడైంది- నారుకి నీరులా! తనకన్న ముందే గురువులు ఉపదేశించిన అద్వైత సిద్ధాంతపు అసలైన సారాన్ని ఆత్మతో గ్రహించాడు శంకరుడు. 

అప్పుడు బోధనలు ప్రారంభించాడు. అందుకు కాశీలోని మణికర్ణికా ఘట్టంలోని ముక్తిమండలం వేదికైంది. పండితులు, మఠాధిపతులు, తాత్త్వికులు... శంకరునితో చర్చకు దిగారు. కానీ ఓడారు. వారంతా శంకరుని శిష్యులయ్యారు.

శంకరులవారు కాశీనుంచి బద్రీనాథ్, ప్రయాగ, బీహార్‌లోని మాహిష్మతీ నగరం వెళ్లారు. క్రతువులే మతమంటూ వితండంగా వాదించే మండనమిశ్రుడులాంటి వారితో తర్కించారు. ఒట్టి కర్మకాండ వల్ల మూఢభక్తి పెచ్చరిల్లుతుందని ఆదిశంకరులు విస్పష్టం చేశారు. మండన మిశ్రుడులాంటివారు శంకరులకు శిష్యులయ్యారు.

ఆపై- శ్రీశైలం, గోకర్ణం, మూకాంబికా క్షేత్రం పర్యటించారు. అద్వైత వేదాంత తత్త్వ పరివ్యాప్తికై శృంగేరిలో తొలిపీఠం స్థాపించారు. అంతలో తల్లికి అనారోగ్యమంటూ కబురొచ్చింది. హుటాహుటిన కాలడి వెళ్లారు. కడసారిగా కొడుకుని చూసుకుని ఆమె ఆనందించింది. ఆపై కన్నుమూసింది. సన్యాసికి కర్మాధికారం లేదు. బంధువులు వారించారు. అయినా కన్నతల్లికి తానే అగ్ని సంస్కారాలు నిర్వహించారు. 

సన్యాసి అంటే భవబంధాల్ని తెంచుకోవడమే. కానీ మానవీయ స్పర్శను కోల్పోడం కాదు. మాతృరుణం తీర్చుకుని మాతృదేశ సేవకై తిరిగి యాత్ర ప్రారంభించారు శంకరాచార్య. రామేశ్వరం, కంచి, తిరుపతి, ద్వారక, ఉజ్జయిని, అస్సాం, పూరి, కాశ్మీర్... ఇలా తిరుగని ప్రాంతం లేదు; క్రీ.శ. 820లో కేదారనాథ్‌లో 32వ ఏట పరమపదించేంతవరకు అద్వైత వాణిని వినిపించని క్షేత్రం లేదు. 
నిండా 30 ఏళ్లు నిండని యువకుడికి ... స్వార్థపు వెంపర్లాట కాకుండా కొండలు, కోనలు, నదులు, పల్లెలు... దాటి దాటి... భారతదేశం ప్రతి మట్టి అణువునూ స్పృశించి ప్రతి భారతీయుడి గుండెల్లోనూ వేదాంత భేరి మోగించాలన్న తపన దేనికి? 
ఎందుకంటే...

క్రీ.శ. 8వ శతాబ్ది భారత్‌కు సంధికాలం. దేశమంతా అనైక్యత, అస్థిరత. ఆధ్యాత్మిక శక్తి ఉన్నా కావలసినంత అజ్ఞానం. వైదిక మతం, అందులోంచి శైవవైష్ణవాలంటూ అనేక శాఖలు, తిరిగి ఆ శాఖల్లో శాక్తేయం, పాశుపతం, కాపాలికం, పాంచరాత్రం, సౌరం అంటూ చెప్పలేనన్ని చీలికలు; వైదిక ధర్మాల్ని వ్యతిరేకించే బౌద్ధజైనాలు, మళ్లీ వాటిలో అనేక పీలికలూ... ఇదీ పరిస్థితి. 
వీటికి తోడు ... ఇతర మతాల ప్రవాహం. ఇస్లాం భారత్‌లోకి తొలుత ప్రవేశించింది కేరళలోకి- క్రీ.శ. 629లో. తొలి భారత ముస్లిం రామవర్మ కులశేఖర కేరళలోని కొడంగల్లూర్‌లో మసీదు కట్టించిందప్పుడే!

భారత్‌లోకి క్రైస్తవం ప్రవేశించింది క్రీ.శ. 52లో. క్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్ తొలుత అడుగిడింది - కేరళలోని ముజిరిస్ గ్రామంలో! ఆ కొడంగల్లూర్, ముజిరిస్ గ్రామాల చేరువలో ఉన్నదే కాలడి. ఈ నేపథ్యంతో సాగింది శంకరుడి బాల్యం. 

పాయలుగా విడిపోయిన మతాలు, తాత్వికత ఛిన్నాభిన్నమైన తీరు ఆయన మదిని కదిలించాయి. వేదాల్లోని ఏవో కొన్ని శ్లోకాల్ని విడదీసి వాటికి కావలసిన అర్థాలనో, అపార్థాలనో కల్పించి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేస్తూ, ఇతర శాఖలపై అసహనంతో ప్రత్యక్షదాడులు చేస్తూ సాగుతున్న ముఠాలపోరు శంకరుడి గుండెను కలచి వేసింది. 

కర్మకాండలు, ఆత్మశుద్ధి లేని ఆచారాలు, భ్రష్టాచారాలు, వెర్రితలలు వేసిన తంత్రవిద్యలు, జుగుప్సను కలిగించే మల్లరి పూజలు, భైరవ పూజలు, నరబలులు, భోగలాలసత, అనైతికత, బాహ్యాడంబరాల పట్ల ఆసక్తి, భౌతిక వస్తువులే శాశ్వతమన్న భ్రమ... ఇవన్నీ దేశీయుల్లో నాటుకుపోవడాన్ని చూశారాయన. ఆత్మ ఎన్నో మందపు ఇనప పొరల కింద కొన ఊపిరితో రెపరెపలాడడాన్ని గమనించారాయన. 

అలాంటి పరిస్థితిలో - అన్ని సిద్ధాంతాల్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సత్యం ఒక్కటే అని చాటి చెప్పేందుకు వేల మైళ్ల పాదయాత్ర చేయడమే శంకర విజయం. కంటికి కనపడేదే నిజమనుకుని అది తప్ప ఇంకొకటి లేదని భ్రమించి, ఈ ప్రపంచాన్ని ముక్కలుగా, వైరుధ్యాలుగా జమకట్టే తత్త్వాన్ని నిర్దంద్వంగా ఖండించి... వివేకబుద్ధి నేర్పిన జ్ఞానమూర్తి శంకరాచార్య. 

కుమతాల్ని, విమతాల్ని, మూఢాచారాల్ని దౌర్జన్యంతో కాక తార్కికతతో వాక్పటిమతో ఎదుర్కోగలగడమే శంకరుల వ్యక్తిత్వం! ఆయన శైవ, వైష్ణవ, బౌద్ధ... ప్రాంతాల్ని పర్యటించడానికి కారణమిదే. ఓ ప్రాంతపు పీఠానికి మరో ప్రాంతపు శిష్యుడిని నియమించడానికి నేపథ్యమిదే. 

మనిషి అంతరంగం దృఢంగా ఉంటే అతని బాహ్యప్రపంచం శక్తిమంతమవుతుంది. అందుకే ఆయన మానసిక దౌర్బల్యాన్ని నిరసించారు. ‘‘నారీస్తన భార వాభీదేశం...’’ అనే శ్లోకంలో ‘‘వక్షోజభారాన్ని మోస్తున్న స్త్రీ నాభిని చూసి మోహం చెందకు. అది కేవలం మాంసవసాది వికారమే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం...’’ అంటూ దేనిమీదా మోహం లేకపోతే మనసు వజ్రమవుతుందన్నారు. 

దీపాన్ని చూపించడానికి మరోదీపం అవసరం లేదు. నిజానికి ఆ దీపమే అన్నింటినీ చూపిస్తుంది. శుద్ధ చైతన్యం కూడా అలాంటిదే! దాన్ని తట్టిలేపడమెలాగో నేర్పారు శంకరులు. దానికి నీ- నా భేదం వచ్చిందీ అంటే అది అజ్ఞానం. 

నదిలో కుండ ఉంది. దానికి లోపలా, వెలుపలా నీళ్లుంటాయి. అటూ ఇటూ ఉన్న నీళ్లు వేరు కాదు. కుండ ఉన్నంత వరకే భేదం. అదే మాయ. తాడుని పామనుకునేంత భ్రాంతి. కుండ పగిలితే ఏమీ లేదు. అంతా ఒకటే. ఈ మనిషి, ఈ దేహం, ఈ స్వపర భేదం, నాదీ నీదీ అనుకునే వెర్రితనం, అహంకారం... అంతా ఆ కుండలాంటిదే! 
కుండ అస్తిత్వాన్ని గుర్తించడం జ్ఞానం. అది ఏనాటికైనా కరగక తప్పదని తెలుసుకోవడం అసలైన జ్ఞానం. ఇదే శంకర తత్త్వం. 

‘‘అంగం గలితం పలితం ముండం...’’ అనే భజగోవింద శ్లోకంలో చెప్పినట్లు ‘శరీరం ముసలిదైపోయింది. పళ్లు ఊడిపోయాయి. రేపో మాపో చావు. అయినా కోరికల్ని వదిలిపెట్టని అజ్ఞాని మానవుడు’ 
జ్ఞానానికి అటా ఇటా తేల్చుకోవాల్సింది మనమే!

....

--

Monday, 30 January 2012

అతి చార్జింగ్ అనర్థదాయకం - దీపావళి టపాసుల్లా పేలుతున్న మొబైల్స్

'మొబైల్' బాంబులు
దీపావళి టపాసుల్లా పేలుతున్న మొబైల్స్
చైనా పీసులతోనే అధిక ముప్పు
అతి చార్జింగ్ అనర్థదాయకం. 

ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతూ గృహిణి మృతి.. జేబులోనే సెల్‌ఫోన్ పేలి వృద్ధుడి దుర్మరణం.. దాదాపు రోజూ పేపర్లలో ఇలాంటి వార్తలే! అంటే.. ఫోన్ల పేరుతో జేబులో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నామా? ఫోన్లు ఎందుకిలా దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి? ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం ఎలా? 

..తమ సూచనలను పాటిస్తే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని సాంకేతికనిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 
+ తక్కువ ధరకు దొరుకుతాయన్న ఉద్దేశంతో చాలా మంది చైనా ఫోన్లను కొనుగోలు చేస్తారు. సాధారణంగా వాటిలో వాడే నాసిరకం బ్యాటరీలే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతాయి. నాణ్యతగల బ్యాటరీలను వాడినప్పుడు పేలుడు ముప్పు చాలా తక్కువ. 

+ బ్రాండెడ్ ఫోన్లతో పాటు వచ్చే బ్యాటరీలు పూర్తిగా డెడ్ అయినప్పుడు మళ్లీ అదే కంపెనీ అవుట్‌లెట్లలో దొరికే ఒరిజినల్ బ్యాటరీలను కొని వేసుకోవాలి. అంతే తప్ప ఖర్చు తక్కువ కదా అనే ఉద్దేశంతో స్థానికంగా తయారయ్యే బ్యాటరీలను పొరపాటున కూడా కొనొద్దు. అలాంటివాటిలో నకిలీ బ్యాటరీలు కూడా ఉండే ప్రమాదం ఉంది. 

+ బ్రాండెడ్ ఫోన్ చార్జర్ పాడైనప్పుడు కొద్దిగా ధర ఎక్కువైనా సరే, మళ్లీ అదే చార్జర్ అదే కంపెనీ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేయాలి. రూ.100-200కి దొరుకుతాయి కదాని ఊరూపేరూ లేని చార్జర్లను కొనుగోలు చేయవద్దు. అవి బ్యాటరీలను పూర్తిస్థాయిలో చార్జ్ చేయలేవు.

+ టార్చ్‌లైట్లలోనూ రిమోట్ కంట్రోళ్లలోనూ వాడే ఆల్కలీన్ (ఏఏ, ఏఏఏ) బ్యాటరీలతో పోలిస్తే.. సెల్‌ఫోన్లలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు అత్యంత శక్తిమంతమైనవి. వాటితో ఆటలాడటం ప్రమాదకరం. ఆ బ్యాటరీలను బయటికి తీసినప్పుడు నగలు, నాణేల వంటి వాటితో వాటిపై గీయడం వంటివి చేయకూడదు. వాటిని ఎక్కువ వేడి ఉండేచోట.. అంటే గ్యాస్ స్టవ్ గట్టు మీద, హీటర్లు, పొయ్యిలకు దగ్గరగా పెట్టడం ప్రమాదహేతువు. 

+ పనికిరాని బ్యాటరీలను మీ చేతులతో మీరే నాశనం చేయాలనుకోవద్దు. కొందరు వాటిని రాయితో కొట్టడం, మంటల్లో పడేయటం వంటివి చేస్తారు. అలాంటి పని అస్సలు చేయకూడదు. ఇటీవలికాలంలో ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీలు పాత ఫోన్లను పారేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మీ ఫోన్, బ్యాటరీ, చార్జర్ వంటివి పాడైపోతే అక్కడికి తీసుకెళ్లి వారు ఏర్పాటు చేసిన బిన్‌లలో వేయండి. 

+ ఫోన్ పొరపాటున నీళ్లలో పడితే కొందరు తుడిచి, మళ్లీ చార్జింగ్ పెడతారు. ఇది చాలా ప్రమాదకరం. తడిసిన ఫోన్‌లోంచి బ్యాటరీని తీసి, ఫోన్‌నూ బ్యాటరీనీ పొడిబట్టతో శుభ్రంగా తుడిచి నీడలో ఆరబెట్టండి. పూర్తిగా ఆరినట్టు అనిపించకపోతే స్థానికంగా ఉండే సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లండి. వారు బోర్డును బయటకు తీసి రసాయనాల సాయంతో ఆ తడి పూర్తిగా పోయేలా చేస్తారు. 


బ్యాటరీలు ఉబ్చితే?
బ్యాటరీలు ఉబ్బడం అంటే.. అవి అవసానదశకు చేరినట్టేనని అర్థం. వాటిని తక్షణం తీసేసి, కొత్త బ్యాటరీలను వేసుకోవడం ఉత్తమం. దీనికి కారణం ఓవర్ చార్జింగ్. "ఎంత ఎక్కువ సేపు చార్జింగ్ పెడితే అంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు'' అనే ఉద్దేశంతో చాలామంది ఫోన్లను ఎప్పుడూ చార్జింగ్‌లోనే ఉంచుతారు. రాత్రి నిద్రపోయేటప్పుడు చార్జింగ్ పెడితే మర్నాడు ఆఫీసుకెళ్లేదాకా ఆ చార్జింగ్ అలానే ఉంటుంది. ఆఫీసులో ఉన్న ఎనిమిది గంటలూ అలా చార్జింగ్‌లోనే పెట్టి ఉంచేవారూ ఉంటారు. 

దీనివల్ల లిథియం అయాన్ బ్యాటరీల్లో ఉండే క్యాథోడ్‌లో అనేక రసాయన మార్పులు జరిగి కోబాల్ట్ ఆక్సైడ్ ఏర్పడి అలా ఉబ్బిపోతాయి. పాత ఫోన్ల సంగతి పక్కన పెడితే... ఇటీవలి కాలంలో వచ్చే ఫోన్లను గంట-గంటన్నర సేపు చార్జింగ్ పెడితే పూర్తిగా చార్జ్ అయి, 'బ్యాటరీ ఫుల్లీ చార్జ్‌డ్' అనే సందేశం వస్తోంది. అది రాగానే చార్జింగ్ చేయడం ఆపేయవచ్చు. ఫోన్లలోనే కాదు.. ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణానికి సంబంధించిన బ్యాటరీ అయినా.. చార్జింగ్ అదేపనిగా పెట్టకూడదు.

-- 

Wednesday, 18 January 2012

GENERAL KNOWLEDGE:

GENERAL KNOWLEDGE:


1. What is the expansion ( Full Form ) of  YAHOO ?
Yet Another Hierarchy of Officious Oracle


2. What is the expansion ( Full Form ) of ADIDAS?
ADIDAS- All Day I Dream About Sports


3. Expansion of Star as in Star TV Network?
Satellite Television Asian Region


4. What is expansion of "ICICI?"
Industrial credit and Investments  Corporation  of  India


5. The 1984-85 season. 2nd ODI between India and Pakistan at  Sialkot  -
INDIA 210/3 with Vengsarkar 94*. Match abandoned. Why?
That match was abandoned after people heard
The news of  Indira Gandhi  being killed.


6. Who is the only man to have written the  National Anthems
For two different countries?
Rabindranath Tagore  who wrote  national anthem  for two different
Countries one is our 's National anthem and another one is for
BANGLADESH-(Amar Sonar* *Bangla )


8. How was Agnes Gonxha Bojaxhiu better known ?
Agnes Gonxha Bojaxhiu is none  other Mother Teresa


9. Name the only other country to have got independence on Aug  15th ?
South Korea


10. Why was  James Bond  Associated with the Number 007 ?
Because 007 is the ISD code for  Russia  (or the USSR ,
As it was known during the cold war)


11. Who faced the first ball in the first ever One day match ?
Geoffrey Boycott


12. Which cricketer played for  South Africa  before it was banned
From  international cricket  and later represented  Zimbabwe  ?
John Traicos


13. Which is the only country that is surrounded from all sides by
Only one country (other than  Vatican  )?
LESOTHO Surrounded from all sides by South Africa ..


14. Which is the only sport which is not allowed to play left handed?
Polo

15. From what four word expression does the word `goodbye` derive?
Goodbye comes from the ex-pression: 'god be with you'.


--