Friday, 25 March 2011


ఆర్కూట్ లో ఫేక్ ఐడిలతో అమ్మాయిలను వేదిస్తున్న ప్రవీణ్ కుమార్ అనే విధ్యార్ది అరెష్టు




ఆర్కూట్ లో ఫేక్ ఐడిలతో అమ్మాయిలను వేదిస్తున్న ప్రవీణ్ కుమార్ అనే విధ్యార్ది అరెష్టు..వరంగల్ లో చేసిన ప్రవీణ్ కుమార్ అనే విద్యార్ది ఒ అమ్మాయి ఫొటోతో ఆర్కూట్ల్ లో నకిలి ఐడీ క్రియేట్ వల్గర్ కామెంట్స్ తో వేదిస్తున్నట్టు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు రావడంతో..గుగుల్ వారు ఇచ్చిన సమాచారం మేరకు సైబర్ క్రైంపోలీదులు అరెష్టు చేసారు...కొంతమంది బ్లాగర్లు అసబ్యికరమైన బ్లాగులు క్రియేట్ చేసి అసభ్యికరమైన మెస్సేజ్ లు పెడుతూ వేదిస్తున్న విషయాన్ని మేము www.cybercrimehelp.com ఆద్వర్యింలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసాం సదరు వ్యక్తులు మమ్మల్ని చాలెంజ్ చేస్తూ పంపిన మెస్సేజ్ లను కూడా వారికి ఇవ్వడం జరిగింది ఇలా నిందితులను అరెష్టు చేయడమేకాక ఇండియాలోని వారి ఇంటికి నోటీసులు వీసా కాన్సిలేషన్ పాస్పోర్టు సీజ్ చేయడం జరుగుతుంది కొత్తగా వచ్చిన ఐటి యాక్టు ప్రకారం రెండు సంత్స్రరాల నుండి ఎనిమిది సంత్సరాల వరకు జైలు శిక్ష భారీ జరిమానాకూడా ఉంటుంది..అరెష్టు అయిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టడంతో ఇండియాలో అందరి ముందు మీరు నేరస్తులుగా మిగిలి పోతారు హేపీగా ఉద్యొగం కోసమో , చదువుకోవడానికో విదేశాలకు వెళ్ళిన మీకు ఇవన్నీ అవసరమా..? ఆలోచించుకోండి ఆతరువాత మీష్టం....ఇప్పటికైనా అలాంటి బ్లాగులు అపివేస్తే మంచిది లేదంటే వారి భవిష్యత్ నాశనం అవుతుంది ఇది మాత్రం నిజం..లైట్ గా తీసుకంటే తరువాత భాదపడేది మీరే..ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటి యాక్టు 2008 ను సైబర్ క్రైం పోలీసులు కచ్చితంగా పాటిస్తున్నారు అమెరికాలో ఉన్న గుగుల్ కంపెనీతో కొన్ని ఒప్పందాలు కుదిరాయి...ఇలాంటి కేసుల విషయంలో గుగుల్ సహకరించకపోతే ఇండియాలో ఉన్న గుగుల్ కంపెనీల పై చర్యలు తీసుకునే అవకాసం ఉనందువల్ల ఇలాంటి కేసుల విషంలొ పోలీసులకు సహకరించేందుకు గుగుల్ కంపెనీ అమెరికాలో ఇండియాలో కొందరిని ప్రత్యెకంగా నియమించినట్టు సమాచారం..అందుకే కేసులు త్వరగా పరిష్కారం అవుతున్నాయి.. పోలీసులు పంపిన mail వివరాలు చూడండి..

Today the Cyber Crime Police, Cybeabad arrested the accused Sunkishala Praveen Kumar @ Raju aged about 25 years r/o Warangal in Cr.No.03/2010, U/S 509 IPC & Sec. 67 I.T. Act of 2000 for creating a fake account in social network site Orkut on the name of a girl and harassing her through abusive/vulgar message and obscene pictures.


He completed M.Sc at NIT Warangal in the year 2007-2009. After completion of his studies he came to Hyderabad in search of job. During that time he stayed with his Uncle’s residence at Gandhi Nagar and used to browse the net, which is available in the room. During the browsing he saw a community site in Orkut on the name of NIT Warangal, MSc Chemistry. He searched and found his junior account and opened his photos gallery and found many photographs of his classmates in group and individual. In that he found a girl Photograph also. He made copy of that and with the help of that photograph and created fake email id with rajunatco@gmail.com and through which he created an account on her name in Orkut. In that account he pasted her Photographs and some obscene scenes collected from different sites by writing vulgar comments in that account as if she wrote and used to respond the massages and mails to that account. The accused with an intention to defame the girl created an account on her name with vulgar comments and obscene photographs.

The arrested accused is being produced before the Hon’ble court at Miyapur.

ఇప్పుడిక చిరంజీవి కుటుంబంలో విలీనం కార్యక్రమం:

కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంచి ఊపుమీద ఉన్న చిరంజీవి ఇప్పుడు తన కుటుంబంలో మరొక విలీనం ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ప్రేమ వివాహం చేసుకుని తనకు దూరమైన కూతురు శ్రీజను తిరిగి కుటుంబంలో కలుపుకొనే దిశగా అడుగులు వేస్తున్నాడు. తన భర్త శిరీష్ పైన, అతడి తల్లి తండ్రుల పైన శ్రీజ కేసు పెట్టడం ఇందులో భాగమే. భర్తను వదిలి వస్తే తిరిగి కుటుంబంలో కలుపుకోవడానికి సిద్ధమే అని చిరు శ్రీజకు చెప్పినట్లు, అందుకు ఆమె సిద్ధమైనట్టు చిరు సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి దగ్గర సాగిన హైక్లాస్ జీవితం దూరం కావడంతో, అల్ట్రా రిచ్ లైఫ్‌కి అలవాటు పడ్డ శ్రీజ మళ్ళీ ఆ జీవితం కోరుకొని చిరుకి దగ్గరయ్యేందుకు సిద్దమయిందని సమాచారం.


  
తన సినిమాలలో కుల మతాలకీ, పేద ధనిక తేడాలకీ అతీతంగా ఎన్నో పాత్రలు పోషించిన మెగా స్టార్ నిజానికి ఈ తేడాలకి అతీతుడు కాదని ఆయనని ఎరిగిన వారంటారు. కుల మతాలకీ, పేద ధనిక తారతమ్యాలు ఉండకూడదనీ సినిమాలలో, సామాజిక న్యాయం అని రాజకీయాలలో నానా యాగీ చేయడమే కానీ చిరంజీవి ఇవి పాటించడని, తన మొదటి కూతురు సుస్మితని హీరో ఉదయ కిరణ్‌తో నిశ్చితార్ధం జరిపి, తరువాత కొన్నాళ్ళకే దాన్ని రద్దు చేసి ఆ అమ్మాయికి మరొక పెళ్ళి చేయడం ఇందుకు నిదర్శనమని వారంటారు.

తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని తనని విడిచి వెళ్ళిన కూతురుని క్షమించి, కూతుర్నీ అల్లుడ్నీ, వారి కూతుర్నీ కుటుంబంలో కలుపుకొంటే చిరు పెద్దమనిషిగా నిలబడగలరేమో ఆయనే ఆలోచించాలి.

Thursday, 10 March 2011


మిలియన్ మార్చ్ పైన పోలీసులది యాక్షన లేదా ఓవర్ యాక్షన...

ట్యాంక్ బ్యాండ్ కి వెళ్ళే అన్ని దారులను ముసివేసి జనాలకు నరకాన్ని చూపిస్తున్న పోలీసులు..

ఇది ఎవరి తప్పిదం..రాజకీయ నాయకులద...ప్రజలదా...

ఆర్కుట్ చర్చ వేదికలో మీ అభిప్రాయాలను పంచుకోండి....

reply from: (..) lakshmi akka...from orkut:

ఖచితంగా ప్రజలదే!!
ఎందుకంటే మన చిన్నప్పుడు చదువు కున్న సుమతి శతకం లో బలవంతం ఐన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి! అన్నారు,మనం మనకి అనవసరం అనుకుంటున్నాం! నిజమే, ఈ ఫాస్ట్ సొసైటీ లో మనకి మన టైం చాలా విలువైనది, కాని ప్రతిఘటించటం ఎందుకు రాదు? ఇది ఎవరిని అడిగే మాట కాదు, నన్ను నేను ప్రతి రోజు అడిగి చూసుకుంటున్నాను! నన్ను నేనే తరచుకుంటే నే కూడా ఇలా చెయ్యటం ఏమిటి? అనే ప్రశ్న నాకే వస్తున్నప్పుడు, ఎదుటివాళ్ళ వలన ఇబ్బంది, నరకం ఎంతవరకు???
ఒక కాలేజీ నేనున్నా విజయవాడ లో కట్టటం జరుగుతున్నది, అయినా కూడా వర్క్ జరిగే టైం లోనే క్లాస్సేస్ స్టార్ట్ చేసారు, ఒక స్టూడెంట్ చనిపోయింది! ఇది నేను కూడా చూసాను, ఆ డే చాలా కోపం వచినది, అంతే ఇంసిడెంట్ వేడి తగ్గాక అది మర్చిపోయాను.


నా సిస్టర్ తన పిల్లల్ని స్కూల్ జాయిన్ అన్నప్పుడు నేనే వెళ్లి జాయిన్ చేసిన స్కూల్ కూడా కడుతున్న బిల్డింగ్ నే! డైలీ ఆ స్కూల్ మీదుగా నే వెళ్ళేదాన్ని! రోజు చూసేదాన్ని వర్క్ నడవటం! పిల్లల చిన్నవాళ్ళు
ఏదన్న జరిగితే తప్పు పిల్లలదా? స్కూల్ వాళ్లదా? లేక మాదా?
రోజు నాకు నే చెప్పుకునే దాన్ని! తప్పు, స్కూల్ మారుద్దాం అని! కాని అది కాసేపే! సమాజం ఇలా ఉన్నది! సమాజం అంటే నా దృష్టిలో నేను! నేను మారలేను! దానికి నేనే వంద కారణాలు చెప్పుకుంటాను! అవి నిజమైనవి కాదు! నా వాదన నిజం అని మోసం! ఒకప్పుడు ఒక వ్యక్తి చని పోతే ఆ గ్రామం లో అన్నం వండుకునే వారు కాదట! శవం వెళ్ళాక వంట మొదయ్య్యేది! కారణం ఎదుటి వాడి కష్టం, మన కష్టం అని! మరి ఈ రోజు?

నాకు అయితే ముందు నేను మారాలి అనిపిస్తది! నేను మారితే నా వాళ్ళు మారచునేమో? తప్పు నాదే! నచనిది ఖండించక పోవటం! విమర్శించటం లో ఆనందించటం, ఇవన్ని మారిన రోజు, ఎవరికీ వారు ఆలోచించటం జరిగినప్పుడు, మన ఇల్లు మారుతుంది, అలా అందరు అనుకుంటే సమాజం మారుతుంది! లోపం తప్పు కాదు! దిద్దుకోగలగాలి! తెలిసాక మారాలి! కాని ఇవన్ని సాధ్యమా? పోటి ప్రపంచం లో అన్నిటికి పరుగులే! ఆవేశం! ఆందోళన!

--  

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡


Monday, 7 March 2011

జీవన సూత్రాలు...

1.సారీ
2.థాంక్యూ
3.విల్ యు ప్లీజ్
4. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్
5. యు డిడ్ అ ఘ్రేట్ జాబ్
6. ఐ ఎడ్మిట్ ఐ మేడ్ అ మిస్టేక్

     ఈ ఆరు సూత్రాలలోని విశేషమేమిటంటే మొదటి సూత్రంలో ఒకటే పదం రెండవదాంట్లో రెండు అదాలు..ఇలా ఆరవ సూత్రంలో ఆరు పదాలు ఉన్నాయి. ఈ ఆర్ సూత్రాలను పాటించిన వారికి జీవితన్లో తిరుగులేదు అని గంట బజాయించి ఎరిక్సన్ చెప్పినప్పుడు మొదట్లో అందరూ పరిహాసం చేశారు కానీ, చివరకూది మంతొరపదేశంగా మారింది.

    'సారీ ' అనే మాటను అనట వలన ఎన్ని కలహాలను అరికట్టవచ్చో అనుభవం మీదనే అవగతమవుతుంది. ఇకపోతే థాంక్యూ అనే రెండవ సూత్రాన్ని అక్షరాలా అల్లగే ఉపయోగించనవసరం లేదు. ఎదుటివారి సహాయాన్ని అందుకున్నాట్లుగా కృతజ్ఞత ను కళ్ళలో చూపగలిగినా చాలు. ఉదాహరణకు మీ ఇంట్లో వార్ మెకు కాఫీ కలిపి తెచ్చారనుకోండి. మీలో ఎంతమంది ఆ కప్పును చేతిలోకి తీసుకుని థాంక్స్ అంటారు? నాకు తెలిసినంతమటుకు 25శాతం కన్నా ఎక్కువ మంది ఉండరు. కాఫీ తీసుకువస్తే అక్కడ పెట్టు అనో సరేలే అనో అనేవారు ఎక్కువగా ఉంటారు. వారు ఎంతో ప్రేమతో కలిపి తెచ్చినది చేతో కూడా అందుకోలేని మహానుభావులు ఈ నాటి నుండి పద్ధతి మార్చుకోవాలి. అలాగే భర్త లేదా తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చినా, ఒక పని చేసినా ఆ పని చేసినందుకు ఇంట్లో స్త్రీ సంతోషంగా అభినందించ్చాలి తప్ప ఆ చాల్లే బడాయి అని తప్పించుకోక్కోడదు డాక్టర్ ఎరిక్సన్.

      ఇక మూడవది విల్ యు ప్లేజ్ అంతే దయచేసి నూ చేస్తావా ? మీకు టీ కాఫీలు కావాల్సినప్పుడు మర్యాదగా ఇలా అడిగినప్పుడు ఎంత కోపం లో ఉన్నవరైనా తప్పక ఇస్తారు. అలా కాకుండా ఏయ్ కావీ అంటేఅ పాలు లేవు! అనే సమాధానం రావచ్చు. కావాలాని పాలు పారబోయవచ్చు. అందువలన మర్యాదగా అదగడం మంచీని సైకాలజిస్టుల సలహా. ఇది కేవలం భార్యా భర్తలే కాదు..అత్తలూ, మామలూ, మొండి పిల్లలు కూడా ఆ వైఖరి మానేయడం మంచిది.

     వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనే నాల్గవ సూత్రాన్ని మనం తెలుగులో నాలుగు పదాలూఅ దీనిపై నీ అభిప్రాయం ఏంటి ? అనుకుందాం. కుటుంబంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చినా కుటుంబ పెద్ద ఇతరులను కూఆ సమ్రదించడం శ్రేయస్కరం. ఒక వస్తువు కొనాలన్నా, ఇల్లల స్కూలు మారాలన్నా, వ్యాపారంలో చేసే మార్పులు చేర్పుల ఉరించి భార్యతో సంప్రదించడం మంచీంటారు సైకాలజిస్టులు . దానికి వారెలాగూ మీ ఇష్టం అనొచ్చు. లేదా ఇంకా మంచి సూచనలు చేయవచ్చు. ఇలా వారిని సంప్రదించకుండా చేసిన పని. ఒక వేళ విఫలమైతే వారి సానుభూతి లభించదు. పైగా మీ ఖర్మ అని మనసులో అనుకుంటారు. పైకి మాత్రం సానుభూతి చూపించినట్లు నటిస్తారు.

    ఐదవ సూత్రం యు డిడ్ అ గూడ్ జాబ్ అంటే నువ్వు ఒక మంచి పని చేశావు. ఇది అద్బుతమైన సన్మోహన మంత్రం లాంటిది. ఎదుటివారు చేసిన పనిని అభినందించడం ఒక అందమైన ఆచారం. దాని వలన ఎదుటివారు ఇంకా బాగా పని చేయవచ్చు. తమ పనిని గుర్తించినందుకు తృప్తిపడి మరింత ఉత్సాహంగా చురుకుగా ఉండవచ్చు. ఉదాహరణకి ఇంట్లో వండిన కూర బాగుందనుకోండి. గుట్టు చప్పుడు కాకుండా గుటుక్కు మనిపించకుండా కూర బాగుంది అంటే మంచిది. ఈ రోజు కూర చాలా బాగుంది వెరీ గుడ్ అంటే ఇంకా మంచిది. ఈ రోజు కూర మార్వలెస్ ..మళ్ళీ ఎప్పుడు చేస్తావ్ అంటే అది తిరుగులేని బానం (ఐతే వారం రోజులూ అదే కూర చేసే ప్రమాదం ఉంది సుమా). నిజం చెప్పాలంటే నా సలహా ఏమిటంటే కూర బాగున్న రోజుకన్నా బాగాలేని రోజున మెచ్చుకుంటే మంచీ. ఐతే అది బ్యంగ్యంగా అన్నట్లుగా ఉంటే కొంప మునుగుతుంది. దేనికైనా కొంత ప్రాక్టీసు తప్పదు. నా ఉదేశ్యమల్లా ఒకటే - భార్యా భర్తల మధ్య పొరపొచ్చాలు ఉండకూడదు, ఇద్దరూ బద్ధ శతృవుల్లా ప్రవర్తించడం వలన అనక సంస్యలు తలెత్తుతాయి.

     ఇక చివరి సూత్రం ఐ ఎడ్మిట్ ఐ మేడ్ ఎ మిస్టేక్ ..అంటే నిజమే నేను చేసినది పొరపాటే..అది ఒప్పుకుంటున్నాను. అని ఆరుపదాల్లో అనుకోవచ్చు. ఈ ఆఖరి సూత్రం ఆచరణలో పెట్టగలిగినవారు నిజంగా అదృష్టవంతులు. అలా ఆచరించినవారికి విడాకుల ఆలోచనలు, మనస్ఫర్ధలు ఉండవు. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసి విడిపోయే ప్రమాదం సంభవించినప్పుడు ఇలా అంటం మచిది. అలాగే చీటికి మాటికి అలిగే అత్తగారితో కూడా కోడలు ఇలా అంటే ఆవిడ అదిరిపోతుంది. ఆపైన కోడలి అడుగులకి మడుగులొత్తుతుంది. అందుకే కోడళ్ళుకొంచెం మొండి వైఖరి విడిచి అత్తను కాకా పట్టి తీరాలి. దానివలన భర్త సంతోషిస్తాడు. ఆడపడుచు ఆటలు సాగవు. కుటుమం సజావుగా సాగుతుంది. ఎరిక్సన్ ఈ ఆరవ స్స్త్రం గురించి చెప్తూ ఇది అన్ని సందర్భాలఓ ఉపయోగించనవసరం లేదు. మనము ఎవరితో కలిసి జీవించాలని అనుకుంటున్నామో, ఎవరితో కలిసి పని చెయ్యాలనుకుంటున్నామో వారితో మాత్రమే అంటే చాలు అంటాడు.


-- 

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡






Saturday, 5 March 2011

ప్రేమ

ప్రేమనేది అందరికీ దొరకదు... అది కొందరినే వరిస్తుంది...
ప్రేమ ఎన్నో కష్టాలను కొని తెస్తుంది...
ప్రేమలో మనసు కాలుతూ మనిషిని కాలుస్తుంది....
అందుకే అందరూ స్నేహభావంతో మెలగమంటుంది...
స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవంటుంది...
స్నేహం ఎదుటివారి ఆనందాన్ని కోరుతుంది...
స్నేహం ప్రాణం తీయదు ప్రాణమే ఇస్తానంటుంది.

-- 

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡