Friday, 25 March 2011


ఇప్పుడిక చిరంజీవి కుటుంబంలో విలీనం కార్యక్రమం:

కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంచి ఊపుమీద ఉన్న చిరంజీవి ఇప్పుడు తన కుటుంబంలో మరొక విలీనం ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ప్రేమ వివాహం చేసుకుని తనకు దూరమైన కూతురు శ్రీజను తిరిగి కుటుంబంలో కలుపుకొనే దిశగా అడుగులు వేస్తున్నాడు. తన భర్త శిరీష్ పైన, అతడి తల్లి తండ్రుల పైన శ్రీజ కేసు పెట్టడం ఇందులో భాగమే. భర్తను వదిలి వస్తే తిరిగి కుటుంబంలో కలుపుకోవడానికి సిద్ధమే అని చిరు శ్రీజకు చెప్పినట్లు, అందుకు ఆమె సిద్ధమైనట్టు చిరు సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి దగ్గర సాగిన హైక్లాస్ జీవితం దూరం కావడంతో, అల్ట్రా రిచ్ లైఫ్‌కి అలవాటు పడ్డ శ్రీజ మళ్ళీ ఆ జీవితం కోరుకొని చిరుకి దగ్గరయ్యేందుకు సిద్దమయిందని సమాచారం.


  
తన సినిమాలలో కుల మతాలకీ, పేద ధనిక తేడాలకీ అతీతంగా ఎన్నో పాత్రలు పోషించిన మెగా స్టార్ నిజానికి ఈ తేడాలకి అతీతుడు కాదని ఆయనని ఎరిగిన వారంటారు. కుల మతాలకీ, పేద ధనిక తారతమ్యాలు ఉండకూడదనీ సినిమాలలో, సామాజిక న్యాయం అని రాజకీయాలలో నానా యాగీ చేయడమే కానీ చిరంజీవి ఇవి పాటించడని, తన మొదటి కూతురు సుస్మితని హీరో ఉదయ కిరణ్‌తో నిశ్చితార్ధం జరిపి, తరువాత కొన్నాళ్ళకే దాన్ని రద్దు చేసి ఆ అమ్మాయికి మరొక పెళ్ళి చేయడం ఇందుకు నిదర్శనమని వారంటారు.

తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని తనని విడిచి వెళ్ళిన కూతురుని క్షమించి, కూతుర్నీ అల్లుడ్నీ, వారి కూతుర్నీ కుటుంబంలో కలుపుకొంటే చిరు పెద్దమనిషిగా నిలబడగలరేమో ఆయనే ఆలోచించాలి.

No comments:

Post a Comment