Monday, 7 March 2011

జీవన సూత్రాలు...

1.సారీ
2.థాంక్యూ
3.విల్ యు ప్లీజ్
4. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్
5. యు డిడ్ అ ఘ్రేట్ జాబ్
6. ఐ ఎడ్మిట్ ఐ మేడ్ అ మిస్టేక్

     ఈ ఆరు సూత్రాలలోని విశేషమేమిటంటే మొదటి సూత్రంలో ఒకటే పదం రెండవదాంట్లో రెండు అదాలు..ఇలా ఆరవ సూత్రంలో ఆరు పదాలు ఉన్నాయి. ఈ ఆర్ సూత్రాలను పాటించిన వారికి జీవితన్లో తిరుగులేదు అని గంట బజాయించి ఎరిక్సన్ చెప్పినప్పుడు మొదట్లో అందరూ పరిహాసం చేశారు కానీ, చివరకూది మంతొరపదేశంగా మారింది.

    'సారీ ' అనే మాటను అనట వలన ఎన్ని కలహాలను అరికట్టవచ్చో అనుభవం మీదనే అవగతమవుతుంది. ఇకపోతే థాంక్యూ అనే రెండవ సూత్రాన్ని అక్షరాలా అల్లగే ఉపయోగించనవసరం లేదు. ఎదుటివారి సహాయాన్ని అందుకున్నాట్లుగా కృతజ్ఞత ను కళ్ళలో చూపగలిగినా చాలు. ఉదాహరణకు మీ ఇంట్లో వార్ మెకు కాఫీ కలిపి తెచ్చారనుకోండి. మీలో ఎంతమంది ఆ కప్పును చేతిలోకి తీసుకుని థాంక్స్ అంటారు? నాకు తెలిసినంతమటుకు 25శాతం కన్నా ఎక్కువ మంది ఉండరు. కాఫీ తీసుకువస్తే అక్కడ పెట్టు అనో సరేలే అనో అనేవారు ఎక్కువగా ఉంటారు. వారు ఎంతో ప్రేమతో కలిపి తెచ్చినది చేతో కూడా అందుకోలేని మహానుభావులు ఈ నాటి నుండి పద్ధతి మార్చుకోవాలి. అలాగే భర్త లేదా తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చినా, ఒక పని చేసినా ఆ పని చేసినందుకు ఇంట్లో స్త్రీ సంతోషంగా అభినందించ్చాలి తప్ప ఆ చాల్లే బడాయి అని తప్పించుకోక్కోడదు డాక్టర్ ఎరిక్సన్.

      ఇక మూడవది విల్ యు ప్లేజ్ అంతే దయచేసి నూ చేస్తావా ? మీకు టీ కాఫీలు కావాల్సినప్పుడు మర్యాదగా ఇలా అడిగినప్పుడు ఎంత కోపం లో ఉన్నవరైనా తప్పక ఇస్తారు. అలా కాకుండా ఏయ్ కావీ అంటేఅ పాలు లేవు! అనే సమాధానం రావచ్చు. కావాలాని పాలు పారబోయవచ్చు. అందువలన మర్యాదగా అదగడం మంచీని సైకాలజిస్టుల సలహా. ఇది కేవలం భార్యా భర్తలే కాదు..అత్తలూ, మామలూ, మొండి పిల్లలు కూడా ఆ వైఖరి మానేయడం మంచిది.

     వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనే నాల్గవ సూత్రాన్ని మనం తెలుగులో నాలుగు పదాలూఅ దీనిపై నీ అభిప్రాయం ఏంటి ? అనుకుందాం. కుటుంబంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చినా కుటుంబ పెద్ద ఇతరులను కూఆ సమ్రదించడం శ్రేయస్కరం. ఒక వస్తువు కొనాలన్నా, ఇల్లల స్కూలు మారాలన్నా, వ్యాపారంలో చేసే మార్పులు చేర్పుల ఉరించి భార్యతో సంప్రదించడం మంచీంటారు సైకాలజిస్టులు . దానికి వారెలాగూ మీ ఇష్టం అనొచ్చు. లేదా ఇంకా మంచి సూచనలు చేయవచ్చు. ఇలా వారిని సంప్రదించకుండా చేసిన పని. ఒక వేళ విఫలమైతే వారి సానుభూతి లభించదు. పైగా మీ ఖర్మ అని మనసులో అనుకుంటారు. పైకి మాత్రం సానుభూతి చూపించినట్లు నటిస్తారు.

    ఐదవ సూత్రం యు డిడ్ అ గూడ్ జాబ్ అంటే నువ్వు ఒక మంచి పని చేశావు. ఇది అద్బుతమైన సన్మోహన మంత్రం లాంటిది. ఎదుటివారు చేసిన పనిని అభినందించడం ఒక అందమైన ఆచారం. దాని వలన ఎదుటివారు ఇంకా బాగా పని చేయవచ్చు. తమ పనిని గుర్తించినందుకు తృప్తిపడి మరింత ఉత్సాహంగా చురుకుగా ఉండవచ్చు. ఉదాహరణకి ఇంట్లో వండిన కూర బాగుందనుకోండి. గుట్టు చప్పుడు కాకుండా గుటుక్కు మనిపించకుండా కూర బాగుంది అంటే మంచిది. ఈ రోజు కూర చాలా బాగుంది వెరీ గుడ్ అంటే ఇంకా మంచిది. ఈ రోజు కూర మార్వలెస్ ..మళ్ళీ ఎప్పుడు చేస్తావ్ అంటే అది తిరుగులేని బానం (ఐతే వారం రోజులూ అదే కూర చేసే ప్రమాదం ఉంది సుమా). నిజం చెప్పాలంటే నా సలహా ఏమిటంటే కూర బాగున్న రోజుకన్నా బాగాలేని రోజున మెచ్చుకుంటే మంచీ. ఐతే అది బ్యంగ్యంగా అన్నట్లుగా ఉంటే కొంప మునుగుతుంది. దేనికైనా కొంత ప్రాక్టీసు తప్పదు. నా ఉదేశ్యమల్లా ఒకటే - భార్యా భర్తల మధ్య పొరపొచ్చాలు ఉండకూడదు, ఇద్దరూ బద్ధ శతృవుల్లా ప్రవర్తించడం వలన అనక సంస్యలు తలెత్తుతాయి.

     ఇక చివరి సూత్రం ఐ ఎడ్మిట్ ఐ మేడ్ ఎ మిస్టేక్ ..అంటే నిజమే నేను చేసినది పొరపాటే..అది ఒప్పుకుంటున్నాను. అని ఆరుపదాల్లో అనుకోవచ్చు. ఈ ఆఖరి సూత్రం ఆచరణలో పెట్టగలిగినవారు నిజంగా అదృష్టవంతులు. అలా ఆచరించినవారికి విడాకుల ఆలోచనలు, మనస్ఫర్ధలు ఉండవు. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసి విడిపోయే ప్రమాదం సంభవించినప్పుడు ఇలా అంటం మచిది. అలాగే చీటికి మాటికి అలిగే అత్తగారితో కూడా కోడలు ఇలా అంటే ఆవిడ అదిరిపోతుంది. ఆపైన కోడలి అడుగులకి మడుగులొత్తుతుంది. అందుకే కోడళ్ళుకొంచెం మొండి వైఖరి విడిచి అత్తను కాకా పట్టి తీరాలి. దానివలన భర్త సంతోషిస్తాడు. ఆడపడుచు ఆటలు సాగవు. కుటుమం సజావుగా సాగుతుంది. ఎరిక్సన్ ఈ ఆరవ స్స్త్రం గురించి చెప్తూ ఇది అన్ని సందర్భాలఓ ఉపయోగించనవసరం లేదు. మనము ఎవరితో కలిసి జీవించాలని అనుకుంటున్నామో, ఎవరితో కలిసి పని చెయ్యాలనుకుంటున్నామో వారితో మాత్రమే అంటే చాలు అంటాడు.


-- 

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡






No comments:

Post a Comment