గెలిచిందెవరు?
కడప ఉప ఎన్నికల్లో ప్రచార తీరు, హోరు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఫలితాలు చూసి ఇంకా ఎక్కువ మంది హడలిపోయారు. ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యానికి గురైందా? ఎన్నికల్లో గెలుపును అడ్డం పెట్టుకుని అడ్డగోలు అక్రమాలకు, సంపాదనకు పాల్పడ్డా ప్రజల్లో చలనం లేదా? చైతన్యం లేదా? ఇంతింత డబ్బు పంపకాలకు అలవాటు పడ్డాక ఎన్నికల పట్ల ఓటర్ల ఆలోచనలను ఎప్పటికైనా మార్చగలమా? ఇలా అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ పరిస్థితి ఒక్క రోజులో రాలేదు. కొన్ని దశాబ్దాలుగా నూరిపోసిన భావజాలం, ఐడియాల ఫలితమిది. విలువలిలా పడిపోయాయేమిటా అని ఇప్పుడు వగచి ఎమీ లాభం లేదు.
స్వాతంత్య్రం తర్వాత మనం ఎంచుకున్న సోషలిస్టు పంథా ప్రకారం దేశ ప్రజల సంపాదన, సహజవనరులు, ప్రజల స్వేచ్ఛ, చివరికి వారి ఆలోచనా సరళి అన్నీ ప్రభుత్వపరమై పోయాయి. అంతులేని అధికారాలు, వచ్చిపడిన పన్నుల సొమ్ముతో పంపకాల కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రజల్ని రకరకాల సమూహాలుగా విభజించి, ఏదో ఒకటి ఉచితంగా ఇచ్చి, వారిని స్వప్రయోజన వర్గాలుగా తయారు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక వర ్గం, షెడ్యూల్డు కులాలు ఒక వర ్గం, రైతులు ఒక వర్గం, మైనారిటీలు, బిసిలు, దీపం మహిళలు, డ్వాక్రా మహిళలు, సొంత జిల్లావారు, సొంత కులం, సొంత పార్టీవారు-ఇలా ఒకటికాదు, ఎన్ని రకాలుగా విభజించొచ్చో చూపించారు.
నాయకుల, పార్టీల సృజనాత్మకత అంతా ఎన్నికల సమయానికి కొత్త వర్గాలను తయారు చేయడం, వారికి ఉచిత వరాలు ప్రసాదించడంగా మారింది. ఇదంతా ఎందుకు చేశారు? ప్రజల మీద ప్రేమతోనా, లేక నిజంగా సమ సమాజ స్థాపన పట్ల నిబద్ధతతోనా? రెండూ కాదు. ఏదో మాయఫెస్టో చూపి గెలిచాక, కొన్ని వర్గాలకు పడేయాల్సింది పడేశాక, ఇక తెరచాటు సంపాదన మొదలెడతారు. ప్రభుత్వోద్యోగుల్ని బదిలీ చేయడానికి డబ్బు, బదిలీ చేయకుండా ఉంచడానికి డబ్బు, పథకాల అమలుకు జరిపే కొనుగోళ్ళ ద్వారా డబ్బు. వసూలు చేసిన పన్నుల డబ్బుతో రోడ్లేసినా, కాలువలు తవ్వినా, అన్నిట్లోనూ డబ్బే. తన నియోజకవర్గంలో ఏ బదిలీ జరిగినా, ఎవరు కాంట్రాక్టు పట్టినా తన అనుమతి కావాల్సిందే.
తనను కలిసి, ముడుపులు, వంగి వంగి వందనాలు చెల్లించుకుంటే తప్ప, అన్నీ ఆపేస్తారు. ఈ రకంగా, సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయో కనిపెట్టడంలో కూడా కాలక్రమేణా మన నాయకులు సృజనాత్మకతను చూపారు.అప్పనంగా వస్తున్న ఇంత సొమ్ము, దానికి తోడు ప్రజానాయకుడు, మహానేత అన్న బిరుదులు, గౌరవం వదులుకోలేదు కాబట్టి, తిరిగి ఎన్నికవడం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఎంత ఖర్చు పెట్టినా దాన్ని పెట్టుబడిగానే భావిస్తారు.
ఉచిత పథకాలకు ఎలాగూ అలవాటు పడ్డ ప్రజలకు ఎన్నికలవేళ డబ్బు, మద్యం, బిర్యానీ పంచడంలో కొత్తగా వచ్చిన నైతిక సమస్య ఏమీ లేదు. అదీగాక, ఎలక్షన్ కమిషన్, కోర్టులు, మీడియా, మేధావుల పిచ్చిగానీ, గెలిస్తే క లర్ టీవీ పంచుతాననడం అనైతికం కానప్పుడు, గెలుపు కోసం డబ్బు పంచడం అనైతికం ఎలా అవుతుంది? ఈ అక్రమ సంపాదన, అనైతిక పంపిణీ, అనైతిక గెలుపు, తిరిగి అక్రమ సంపాదన అనే చక్రం ఒకసారి పూర్తయ్యాక, ఎవరు మంచి, ఎవరు చెడు అనే మీమాంస తొలగిపోయింది. ఎన్నికలపుడు పంచిన డబ్బు తీసుకున్న ప్రజలు నాయకులను ప్రశ్నించే అర్హత కోల్పోయారు.
అనైతికంగా అంతంత డబ్బు సంపాదించిన నాయకులు, డబ్బు తీసుకోకుండా ఓట్టేయమని అడిగే యోగ్యతను కోల్పోయారు. చివరికి మేధావి వర్గం కూడా చేతులెత్తేసింది. అవున్లే పాపం, ఎన్నికల్లో అంత ఖర్చు పెట్టాక సంపాదించుకోకుండా ఎలా ఉంటారులే అని పార్టీలు, నాయకుల పట్ల సానుభూతి. ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు కూడా, అయినా ఓటుకు రెండొందలే ఇస్తున్నారు, ఓటర్లు ఆశించినట్లుగా కనీసం వెయ్యి రూపాయలైనా ఇవ్వడం లేదేమని బహిరంగ ప్రశ్నలు.
హేతుబద్ధంగా ఆలోచించి, సరైన తాత్విక దృష్టితో చూస్తే ప్రభుత్వం ఏర్పరచుకున్నది ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడానికి, వ్యక్తుల మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించే న్యాయవ్యవస్థను నడపడానికి మాత్రమే. అంతకుమించి ఎందులో తల దూర్చినా అది అహేతుకం, అనైతికమే. ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించాల్సింది తమ మానవ సహజసిద్ధమైన స్వేచ్ఛకు రక్షణ మాత్రమే. అంతేగానీ, రెండు రూపాయలకు కిలో బియ్యమో, ఉచిత విద్యుత్తో, పనిచేయకున్నా ఫర్వాలేని ప్రభుత్వోద్యోగాలో కాదు. ఈ విషయంలో ఎవరు కాలుజారినా, అది ఒక విషయంతో ఆగదు.
కాలుజారిన విషయాన్ని వెంటనే గుర్తించి, దాన్ని తప్పుబట్టి, వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తేగల మేధో వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఈ తప్పిదాలు ఆగుతాయి. కాలు జారడమే ఆధునిక సామాజిక విప్లవం, ఎదుటివాడి జేబు కొట్టేయడం ఒక గౌరవప్రదమైన ఉద్యమం అనే భావనలు వ్యాపింపజేస్తే ఫలితాలు ఇదుగో ఇలాగే ఉంటాయి. ఒక ప్రభుత్వంతో పోటీపడి ఇంకోటి, ఒక స్వప్రయోజన వర్గంతో పోటీగా ఇంకో వర్గం, రాజకీయ, సామాజిక, భావజాల భ్రష్టత్వాన్ని పరాకాష్ఠకు తీసుకెళతాయి, తీసుకెళ్లాయి. అలా తయారైన నేటి సమాజంలో హేతుబద్ధత (ఆబ్జెక్టివిటీ), వివేకం (రేషనాలిటి), తర్కం అంతర్థానమయ్యాయి. అశాస్త్రీయ, అహేతుకమైన భావనలు, వాదనలే అందరి ఆలోచనలనూ ప్రభావితం చేస్తున్నాయి.
వారసత్వవాదం, సెంటి మెంటు, సానుభూతి, (నాయకుడి) ఆత్మగౌరవం, భాష, ప్రాంతం, కులం, మతం, రంగు, రక్తం-ఇలాంటి అప్రధాన, అహేతుక అంశాలే రాజకీయ చర్చలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. మడమ తిప్పని వంశం అనే వారొకరు, తొడకొట్టేవారొకరు, మా కులానికెప్పటికీ ఇవ్వరా అనే వారొకరైతే,మా ప్రాంతంలో అడుగుపెడితే ఖబడ్దార్ అనేవారు ఇంకొకరు. ఇటువంటి చర్చల్లో మనిషి స్వేచ్ఛ, దాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత అనే విషయాలకు ఎక్కడైనా చోటుందా?
అసలు తన హక్కులేమిటో, ఏవి హక్కులు కావో, ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవాలో, ఏం ఆశించకూడదో, మన డబ్బు కొట్టేసి మనకే ఉచిత వరాలిస్తానంటున్నవాడు నాయకుడా, మాయలోడా అనే వివేచన కోల్పోయిన జనం ఈ సెంటిమెంట్ల నిషాలో ఊగిపోయి ఒట్లేయడం ఇది మొదటి సారీకాదు, చివరిసారీ కాబోదు. ఇంతకుముందు తెలంగాణ లో జరిగిన ఉప ఎన్నికలలో, అంతకుముందు కరీంనగర్‌లో కూడా ఇదే తంతు. ఎదో పేదలకు సాయం చెయ్యాలన్నాం కానీ అవినీతికి పాల్పడమన్నామా అని సోషలిస్టులు వాపోతారు.
కానీ వారు గుర్తించడానికి ఇష్టపడని వాస్తవం ఏమిటంటే, సోషలిస్టు భావజాలం, ఐదేళ్ళకోసారి ఎన్నికలొచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ-ఈ రెండూ కలిస్తే కల్తీ కల్లు లాంటి విషం తయారవుతుంది. అది జాతి నరనరాల్లోకి ఎక్కి, నిర్వీర్యం, నిస్తేజం చేసేస్తుంది. పంచమనడం తేలికే. కానీ ఎవరి దగ్గర్నుంచి లాక్కుని, ఎవరికి ఎంత పంచాలో తేల్చడంలోనే ఉంది ఓట్ల సంఖ్యా శాస్త్రమంతా. అసలీ గుంజడం, పంచడం రెండూ అనైతికమేనని ఎప్పటికి తెలుసుకుంటాం? సకాలంలో మేలుకోకపోతే ఈ దిగజారుడు ఇంకా ఇంకా లోతైనా ఊబిలోకి నెడుతుంది.
ఎక్కడో, ఏదో తప్పు జరిగిపోయిందని తెలుసుకోవడానికి, ఆ ఊబిలోంచి బయటపడే బలమైన ప్రయత్నం చెయ్యడానికి దశాబ్దాలు పట్టొచ్చు. బీహార్, బెంగాల్‌లోలాగా, కానీ ఈలోగా తరాలు తరలిపోతాయి, అవకాశాలు తరిగిపోతాయి, కాలం కదలిపోతుంది. మహాభారత యుద్ధానంతరం మిగిలిన వల్లకాడులాంటి స్థితే మనకూ మిగులుతుంది. సజీవ స్రవంతైన సమాజంలోని వ్యక్తులు ఏనాడైతే మేల్కోని ఆలోచిస్తారో, వ్యక్తి స్వేచ్ఛ, పరిమిత ప్రభుత్వాలను ప్రప్రధానమైన అంశాలుగా గుర్తిస్తారో అదే పండగ రోజు. అప్పుడే విముక్తి.

--
No comments:
Post a Comment