Tuesday, 3 May 2011

బిన్ లాడెన్‌ను బలిగొన్నది అమెరికా కాదు.

బిన్ లాడెన్‌ను బలిగొన్నది అమెరికా కాదు. ఆ పని చేసింది..

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)
ఆ సాంకేతికత సాయంతోనే అమెరికాకు ఆచూకీ



గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. ఈ విధానంలో ప్రపంచంలో ఎక్కడైనా దేన్నైనా స్పష్టంగా చూడొచ్చు. గూగుల్ యాండ్రాయిడ్ ఉన్న సెల్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న హైఎండ్ కంప్యూటర్ ఇవి ఉంటే చాలు. ఈ సాంకేతికతతోనే పాక్‌లో అనుమానం వచ్చిన ప్రదేశాలన్నింటినీ సీఐఏ ఏజెంట్లు జల్లెడ పట్టారు. ఎన్నో వారాల పాటు ఒసామా బిన్ లాడెన్‌ను ప్రస్తుతం పట్టుకున్న భవనాన్ని పరిశీలించారు. మొదట్లో అక్కడ ఎవరు నివసిస్తున్నారో వారికి తెలియలేదు.

ఆ తరువాత ఒసామా నివసిస్తున్నాడని అనుమానం వచ్చింది. అది నిజమై అతడిని హతం చేసేందుకు మార్గం ఏర్పడింది. అలా ఈ జీపీఎస్ సాంకేతికత ఒసామా బిన్ లాడెన్‌ను హతం చేసేందుకు తోడ్పడింది. అయితే.. ఈ సాంకేతికతతో అతడి మీద దాడి చేయడం అమెరికాకు ఇది మొదటి సారి కాదు. 1998లోనే అఫ్థానిస్థాన్‌లోని బిన్ లాడెన్ ఉగ్రవాద క్యాంపుల మీద జీపీఎస్ సాయంతో క్రూయిజ్ క్షిపణులతో దాడి అమెరికా దాడి చేసింది. దాన్నుంచి బిన్ లాడెన్ తృటిలో తప్పించుకున్నాడు.

ఆ తరువాత పాకిస్థాన్‌లోని వాయవ్య రాష్ట్రంలో మానవ రహిత విమానాల ద్వారా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఎంతో మంది చనిపోయారు. తాజాగా బిన్‌లాడెన్ ఆ సాంకేతికతకు బలయ్యాడు. అయితే.. విచిత్రమేమంటే ఈ జీపీఎస్ టెక్నాలజీని మొబైల్ ఫోన్లకు ఇచ్చే గూగుల్ వారి ఆండ్రాయిడ్ వంటి అప్లికేషన్లు తమ దేశంలోకి అనుమతిని నిరాకరించడానికి పాక్ ప్రయత్నిస్తోంది. విచిత్రంగా అదే సాంకేతికతతో ఒసామా ఎక్కడున్నాడో పసిగట్టి అమెరికా అతడిని హతం చేసింది.

No comments:

Post a Comment