కాలం
దైవస్వరూపం. అందుకనే కాలాన్ని కాలపురుషుడు అని వ్యవహరిస్తుంటాం. కాలుడు
అంటే యముడు అని కూడా అర్థం. అంటే కాలం గడుస్తున్న కొద్దీ ఆయువు తరుగుతోందని
గుర్తించాలి. ఈ కాలాన్ని... మహాయుగాలు, యుగాలు, కల్పాలు, మన్వంతరాలు,
సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, వారాలు, రోజులు, జాములు,
ఘడియలు, విఘడియలు, క్షణాలు ఈ విధంగా భారతీయ కాలవిభాగం కనబడుతుంది.
గీతలో ఉన్నది... కొంతమంది అమాయకులు భ్రమపడినట్లుగా తీవ్రవాదం కాదు. ధర్మవీరం. కాలం దేనినీ పట్టించుకోకుండా దాని ధర్మం అది పాటించుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రతిమానవుడూ జీవితకాలంలో ఏ ధర్మాన్నీ ఆచరించకపోయినా, ఏదో ఒకనాటికి కాలధర్మం చెందక తప్పదు. ఈ లోగా మనిషిగా పుట్టినందుకు మానవ ధర్మాన్ని కూడా నిలబెట్టుకోమని మనకు పురాణగ్రంథాలు చెబుతున్నాయి.
కాలాన్ని గుర్తు చేయడానికే ఎన్నో వార్షికపర్వాలను మనం జరుపుకుంటుంటాం. ఆ పండుగలలో కొత్తబట్టలు కట్టుకోవడం, పిండివంటలు చేసుకోవడం, బంధుమిత్రులతో వినోదంగా గడపడం మాత్రమే కాదు, ఇంతవరకూ తాను సాధించిందేమిటో సింహావలోకనం చేసుకోవాలి. పుట్టినరోజు పండుగనాడు... ‘‘పుట్టి ఇన్నేళ్ళు వచ్చాయి. సాధించిందేమిటి? సాధించాల్సిందేమిటి?’’ అని తనలోకి తాను చూసుకోవాలి.
నూతన సంవత్సరం నాడు అందరూ వారివారి బంధుమిత్రులకు ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ అంటూ ఈ సంవత్సరమంతా ఆనందంగా గడవాలని శుభాకాంక్షలు తెలియచేస్తారు. ఇక్కడే మానవ మానసిక తత్త్వం తెలుస్తుంది. మనిషి ఆశావాది. నిజానికి వారు అలా శుభాకాంక్షలు తెలియజేసినంత మాత్రాన అందరికీ ఏడాదంతా సంతోషంగానే గడుస్తుందని కాని, కష్టాలు రానే రావనికాని అనుకోలేం.
కాలప్రవాహంలో సుఖాలు, కష్టాలు అన్నీ అనుభవించాల్సిందే. అందుకే ఉగాది నాడు ఆరు రుచులతో పచ్చడి తయారుచేసి, పరస్పరం పంచుకు తింటారు. జీవితంలో తీయని అనుభవాలే కాదు, చేదు సంగతులను కూడా సమానంగా తీసుకునే స్థితప్రజ్ఞత సంపాదించుకోవాలనే గొప్ప సందేశం అందులో ఉంది. సుఖ దుఃఖాలు రెండూ తప్పవని తెలిసి కూడా సుఖసంతోషాలే కలుగుతాయనే ఆశ మనిషిని బతికిస్తుంది. మునుముందుకు నడిపిస్తుంది.

ఆశ నాలుగు రకాలుగా కనిపిస్తుంది. ఆశ, అత్యాశ, దురాశ, నిరాశ. వీటిలో మొదటిది తప్ప అన్నీ ప్రమాదాలే. చివరి మూడూ ఉన్నా పతనమవుతాడు, మొదటిది లేకపోయినా కూడా మనిషి పతనమవుతాడు. తన అర్హతకు మించి ఎక్కువ కోరుకుంటే అత్యాశ. తనది కానిది, పొందరానిది తనకు కావాలని ఆశ పడితే దురాశ. ప్రయత్నం చేసినా అది నాకు దక్కదు కనుక ప్రయత్నించడమే అనవసరమని తనకు యోగ్యత కలిగిన విషయాలలో కూడా నిర్లిప్తంగా ఊరుకుండిపోతే అది నిరాశ.
చీకటి పడిందని బెంగపడకూడదు. 12 గంటలు ఆగితే వెలుగు వస్తుందనే ఆశావాదంతోనే ఆ రాత్రి హాయిగా నిద్రపోతాడు మనిషి. అమావాస్య స్థిరంగా ఉండదు. 15 రోజులలో పూర్ణిమ వస్తుంది. అలాగని అదీ స్థిరం కాదు. వద్దన్నా మళ్ళీ అమావాస్య వస్తుంది. రెండిటినీ సమానంగా ఆహ్వానించగలగాలి. ఆయా కాలాలకు తగినట్లుగా తన జీవనసరళిని సర్దుబాటు చేసుకోవాలి. అంతేనా! కాలం మరో మూడు రకాలుగా మనకు దర్శనమిస్తుంది. అవే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఎండలను తట్టుకోవాలి. వర్షాన్ని ఉపయోగించుకోవాలి. చలిని భరించగలగాలి. ఒక్కసారి ఆలోచించండి. వీటిలో ఏదో ఒక్కటే ఉంటే మనం బతకగలమా?
పగలు ఒక్కటే ఉంటే మనకు నిద్ర పట్టదు. రాత్రి ఒక్కటే ఉంటే ఏ పనీ జరుగదు. అందుకనే భగవంతుడు కాలంలో ఇన్ని మార్పులు కలిగించి, మనిషి హాయిగా బతకడానికి వీలుగా ఒక చక్కని వ్యవస్థను ఏర్పాటు చేశాడు. రాబోయే కాలం ముందే మనకు తెలుసు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు ఎన్నో విషయాలను మనకు చెప్పారు.
రాత్రి సుఖంగా నిద్రపోవాలంటే పగలంతా కష్టపడి పని చేయాలి. వర్షాకాలంలో సుఖంగా జీవించాలంటే మిగిలిన ఎనిమిది మాసాలూ కష్టపడి సంపాదించుకోవాలి. ముసలితనంలో ఆరోగ్యంగా, లోటు లేకుండా జీవించాలంటే వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి. అలాగే పరలోకంలో సుఖపడాలంటే ఈ జన్మలో కష్టపడాలి... అని చెప్పిన ఆర్యోక్తి నిత్యసత్యం. ఈనాటి యువతరానికి పదే పదే బోధించాల్సిన విషయం.
రేపటితరం కోసం ఈనాడు చెట్లు నాటాలనుకొన్న తాతల సంస్కృతిని మననం చేసుకోవాలి. పెద్దలు మనకందించిన సంస్కృతిని మనం నిలబెట్టుకోవడమే కాదు, ముందు తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్న విషయం మరచిపోకూడదు. కాలానికి కళ్ళెం వేయలేం. మనకు అనుకూలంగా మార్చుకోవాలి. కాలానికి ఎదురీదలేం. వాలుగా ఈదుతూనే గట్టు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అందరూ కాలం విలువ తెలుసుకోవాలి. ఉదయం సంధ్యావందనం దగ్గర నుంచి, నిత్యకృత్యంలో మన బాధ్యతలను కూడా సమయ నియమానికి లోబడి నిర్వర్తించాలి. అటువంటివాడే క్రమశిక్షణాత్మకమైన జీవితాన్ని గడపగలుగుతాడు. జీవితంలో సుఖపడతాడు.
కాలాన్ని గౌరవిస్తూ, కాలం అందించే సుఖాలన్నీ సద్వినియోగం చేసుకునే శక్తి అందరికీ రావాలని, ఈ నూతన సంవత్సరం అందరికీ అటువంటి ఉత్తేజాన్ని, ఉదాత్తతను అందివ్వాలని మనసారా కోరుకుందాం.
ఆంగ్ల సంవత్సరాది ( న్యూ ఇయర్ - 2012) శుభాకాంక్షలు
--
No comments:
Post a Comment