అప్రమత్తత అన్నివేళలా అవసరం

‘ప్రమాదం’ అనే సంస్కృత పదాన్ని తెలుగువారు ప్రయాణాల్లో జరిగే ఆపదగా
ఉపయోగిస్తున్నారు. కానీ అసలైన అర్థం ఏమరుపాటు’, నిర్లక్ష్యం, అజాగ్రత్త.
దానివలన కలిగిన కష్టాన్ని మనం సరాసరి ‘ప్రమాదం’ పేరుతో పిలుస్తున్నాం. ఏ
ప్రాణి అయినా ప్రతిక్షణం జాగరూకతతో ఉండకపోతే ఏ క్షణంలోనైనా ఇబ్బందులకు గురి
కావచ్చు. ఎఱ చూసి చేప, నూకలు చూసి పక్షులు, చెఱకుగడలు చూసి ఏనుగు ఆకర్షణకు
లోనై ప్రమత్తతతో పరుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. మానవజాతిని
బురిడీ కొట్టించి బుట్టలో వేసే అంశాలు చాలా ఉన్నాయి. మనిషికి అప్రమత్తత
మరింత అవసరం అని మహాభారతం చెబుతోంది.
‘ప్రమాదోధీమతామపి’ (తెలివైనవారు కూడా పొరబడతారు) అనే సూక్తి సుప్రసిద్ధం. ‘ఇంత బతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్టు’ అనేది తెలుగు సామెత. ఇంటా, బయటా జీవితంలో తుదిక్షణం వరకు ఏమరుపాటు పనికిరాదు. ఒళ్లు మరిచి ఉంటే ఇంట్లోనైనా మృత్యువు కబళిస్తుంది.
కణికుడు దుర్యోధనునికి రాజనీతి ఇలా చెబుతున్నాడు... ‘తనకు అపకారి అయిన వాడికి దగ్గరలో ఉండే మూర్ఖుడు ఎత్తయిన చెట్టు చిటారుకొమ్మన నిద్రపోయేవాడితో సమానం. ఎంత జాగ్రత్తగా ఉన్నా నిద్రలో ఏమరుపాటుతో జారి కిందపడతాడు’. (ఆది - 6 - 118). ఈ నీతి సూత్రంలో చెప్పిన పోలిక చాలా గొప్పది. నేలమీద పడుకున్నవాడు ఆదమరచి ఉన్నా పడడు. ఉన్నతస్థానంలో ఉన్నవారికే ప్రతిక్షణం అప్రమత్తత అవసరం. నిద్ర ప్రాణులకు కనీస అవసరమైనా ప్రాణరక్షణ కోసం వారు దానిని త్యాగం చెయ్యక తప్పదు.
మహాభారతంలోని పోలికలో చెప్పిన అపకారి రాజనీతి విషయంలో శత్రువు కావచ్చు. ఎంతోకాలంగా నైపుణ్యంతో నడుపుతూ ఉండవచ్చు. అయినా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కూడిన ఏమరుపాటు వలన వచ్చిన కునికిపాటు కొంపలు ముంచుతుంది. తినే పదార్థాలు, తాగే పానీయాలు, ఎప్పటినుంచో తెలిసిన మనుషులు... ఏవైనా, ఎవరైనా, ఎప్పుడైనా మన ప్రమత్తత, ఏమరుపాటు వలన అపకారిగా మారి ప్రాణాలను అపహరించే అవకాశం అన్నివేళలా ఉంటుంది. అందుచేత ఎంతటి మేధావి, నిపుణుడు, బలవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు, అధికారం ఉన్నవాడైనా ప్రతిక్షణం జాగరూకతతో అప్రమత్తులై ఉండాలి. భౌతికనేత్రం నిద్రపోతున్నా జ్ఞాననేత్రం ఎప్పుడూ మేలుకొనే ఉండాలి.
అహంకారం, అతిశయం, అలసత్వం, అధికారగర్వం వంటి దుర్లక్షణాల వలన ఆ కన్ను మూతపడితే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి. ఇవి స్వయంకృతాలు. విధి లిఖితమైన ఆపదలను తప్పించుకోలేకపోవచ్చు. స్వయంకృతాలను మాత్రం అప్రమత్తతో రాకుండా చేసుకోవచ్చు. ఇదే మహాభారత సందేశం.

No comments:
Post a Comment