సాయి చుట్టూ కసాయిలు !!
ఎప్పటి నుంచో ట్రస్టులో ముఠాలు
దేవాంతకులు -1
బాబాపై హత్యాయత్నానికి కారణమిదే!
ప్రశాంతి నిలయంలో ఆరు హత్యలు
కట్టలు కట్టలు డబ్బు మాయం
1993 నుంచీ వీడని మిస్టరీ
అంతర్గత వ్యవహారమన్న సభ్యుడు
ఆగిపోయిన పోలీసు విచారణ
బాబాపై హత్యాయత్నానికి కారణమిదే!
ప్రశాంతి నిలయంలో ఆరు హత్యలు
కట్టలు కట్టలు డబ్బు మాయం
1993 నుంచీ వీడని మిస్టరీ
అంతర్గత వ్యవహారమన్న సభ్యుడు
ఆగిపోయిన పోలీసు విచారణ
బంగారం, డబ్బు తరలించేసినట్లు వచ్చిన వార్తలు అబద్ధమంటోంది ట్రస్టు...
మరి గతాన్ని పరిశీలిస్తే... ప్రశాంతి నిలయంలో కనిపించిన వందలకొద్దీ అయిదొందల రూపాయల, డాలర్ల నోట్ల కట్టలు రాత్రికి రాత్రి మాయమయ్యాయి.
ఈ విషయం చెప్పింది సాక్షాత్తూ ఒక పోలీసు అధికారి!
ప్రశాంతి నిలయంలో ప్రత్యర్థి వర్గాల మధ్య తీవ్ర విభేదాలు లేవంటోంది ట్రస్టు...
గతాన్ని తరచిచూస్తే అవి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రమైనవంటే ఒకే రాత్రిలో ఆరు మరణాలకు దారితీసేంత! ఈ విషయం చెప్పింది సాక్షాత్తూ ఒక ట్రస్టు సభ్యుడు.
ట్రస్టు వ్యవహారాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండదంటోంది ట్రస్టు...
గతాన్ని బట్టి చూస్తే ఇదొక్కటి మాత్రమే పచ్చి నిజం. ట్రస్టు ఆస్తుల వ్యవహారాలే కాదు, ప్రశాంతి నిలయంలో ఏం జరిగినా, చివరికి హత్యలు జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. ఈ హత్యలు తమ అంతర్గత వ్యవహారమని, దర్యాప్తు సంస్థలు వేలు పెట్టక్కర్లేదని ట్రస్టు సభ్యులు నిర్లజ్జగా ప్రకటనలు ఇచ్చేసినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు ఉండదు.
"సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుల మధ్య విభేదాల్లేవు. అంతా మీడియా సృష్టే. బంగారం, విలువైన వస్తువులు, డబ్బు తరలించేసినట్లు వచ్చిన వార్తలు బాధ్యతారహితమైనవి''... ట్రస్టు సభ్యులు గురువారం పుట్టపర్తిలో విలేకరుల సమావేశంలో పలికిన పలుకులివి. అయితే ఈ పలుకుల్లో ఏ ఒక్కటీ వాస్తవమని నమ్మలేం. గతమే దానికి సాక్ష్యం.
హైదరాబాద్, ఏప్రిల్ 29 : అది ప్రశాంతి నిలయం. అక్కడ ఏం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు, పట్టించుకోకూడదు. 86 ఏళ్ల వృద్ధుడైన బాబా అనారోగ్యంతో బాధపడుతున్నా ట్రస్టు సభ్యులెవరూ పట్టించుకోరు. బాబాకు ఎవరు వైద్యం చేస్తున్నారో, ఆయన ఏ మందులు వేసుకుంటున్నారో కూడా ఎవరూ పట్టించుకోరు. బయటి వారెవరైనా పట్టించుకుంటే ఊరుకోరు. మీడియా ప్రశ్నిస్తే కస్సున లేస్తారు. బాబా ఆరోగ్యం విషయమే కాదు.. ప్రశాంతి నిలయంలో దారుణమైన మరణాలుసంభవించినప్పుడు కూడా ఇదే సూత్రం. అక్కడేం జరిగినా ఎవరూ పట్టించుకోకూడదు. హత్యలు జరిగినా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకూడదు. ఏదైనా వారి అంతర్గత వ్యవహారంగానే పరిగణించాలి.
తాము అనుసరించేది సత్యసాయి బాటేనని, ట్రస్టులో ఎటువంటి విభేదాలు లేవని సభ్యులందరూ ప్రకటనలు చేస్తుండవచ్చు. కానీ, ట్రస్టుకు ఉన్న కోట్లాది రూపాయల ఆస్తుల కోసం కుమ్ములాటలు ఎంతోకాలంగా సాగుతుండటం నిజం. ఒక్కప్పుడు ట్రస్టు సభ్యుల మధ్య చెలరేగిన విభేదాలు - సత్యసాయి ప్రాణాలనే ప్రమాదంలో పడేసే స్థాయికి చేరుకున్నాయి. 1993 జూన్ 8వ తేదీన ప్రశాంతి నిలయంలో ఆరుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురికావడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కలగజేసుకొని కేసులు లేకుండా చేశారు.
ఈ హత్యలపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 18 ఏళ్లు గడిచినా చార్జిషీట్లు మాత్రం దాఖలు చేయలేదు. ప్రభుత్వం ఆదేశించిన సీబీసీఐడీ విచారణ కూడా సగంలోనే ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలు సజావుగా జరగటం కోసం సాయిబాబా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 1993లో ఈ ట్రస్టుకు నారాయణన్ కార్యదర్శిగా వ్యవహరించేవారు.
కల్నల్ జోగారావు, ఆర్వీ జానకి రామయ్య (బాబా సోదరుడు), కె.ఆర్.ప్రసాద్, ఇందులాల్ షా, శ్రీనివాసన్, రాజమాత, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ బాలకృష్ణ ఎరాడేలు సభ్యులుగా ఉండేవారు. ఆ సమయంలో వివిధ పత్రికల్లో వెలువడిన కథనాలను పరిశీలిస్తే... ఈ ట్రస్టులో రెండు వర్గాలు ఉండేవని స్పష్టమవుతుంది. సత్యసాయి సోదరుడు జానకి రామయ్య, ఆయన కుమారులు సాయిబాబాపైన, ట్రస్ట్‌పైన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు.
సాయి తమకు బంధువు కాబట్టి ట్రస్ట్ వ్యవహారాలలో తమదే పైచేయి కావాలని వారు వాదిస్తూ ఉండేవారు. కల్నల్ జోగారావు, నారాయణన్‌లు ఒక వర్గంగా వ్యవహరించేవారు. కల్నల్ జోగారావుకు సాయి దగ్గర మంచి సాన్నిహిత్యం ఉండేది. నారాయణన్ కార్యదర్శి కాబట్టి ట్రస్టు వ్యవహారాలపై ఆయనకు పట్టు ఉండేది. ఇది జానకి రామయ్యకు రుచించేది కాదని, అన్ని వ్యవహారాలు తన కనుసన్నలలోనే జరగాలని భావించే వారని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కల్నల్ జోగారావుకు, ఇతర సభ్యులతో విభేదాలు వచ్చాయి. జానకి రామయ్య, కల్నల్ జోగారావు సన్నిహితులయ్యారు.
పోలీసుల కథనం: ఈ నేపథ్యంలో.. 1993 జూన్ 8వ తేదీన ప్రశాంతి నిలయంలో ఒక దాడి జరిగింది. ఆరుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై పోలీసులు వినిపించిన కథ ఇలా సాగింది.... "రాత్రి 10.30కి ఆరుగురు వ్యక్తులు సాయిబాబా వ్యక్తిగత మందిరంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవటానికి అప్పుడు మందిరంలో ఉన్న రాధాకృష్ణ, సాయికుమార్ మహాజన్, అనీల్ పాట్లే, విష్ణు అనే సాయి సేవకులు ప్రయత్నించారు. దుండగుల దాడిలో రాధాకృష్ణ, సాయికుమార్ మహాజన్‌లు మరణించారు.
దాడి చేసిన వారిలో ఇద్దరు పారిపోగా, మరో నలుగురు దుండగులు మందిరంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోకి ప్రవేశించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సాయి సోదరుడు జానకి రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ గంగాధర్ రెడ్డి మందిరానికి చేరుకొని దుండగులను లొంగిపొమ్మన్నారు. కానీ, వారు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జగన్, సురేష్ కుమార్, సాయిరాం, ప్రభు అనే నలుగురు దుండగులు మరణించారు.''
వాళ్లని చంపెయ్యండి
అయితే, ఈ దాడులు కేవలం ట్రస్ట్ సభ్యుల మధ్య ఉన్న విభేదాల వల్లే జరిగాయని ఆ తర్వాత వారు చేసిన వ్యాఖ్యలు, పరిణామాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా, ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షుల కథనాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వీటి ప్రకారం- దాడి జరిగిన వెంటనే మందిరానికి ఎదురుగా ఉన్న హాస్టల్ నుంచి 60 మంది ఎంబీఏ విద్యార్థులు పెద్దగా అరుచుకుంటూ వచ్చారు.
నిందితులుగా పేర్కొంటున్న నలుగురిపై దాడి చేశారు. వారిని నిరాయుధులను చేసి కట్టేశారు. "మేం బాబాను రక్షించడానికి వచ్చాం'' అని ఆ నలుగురూ గట్టిగా అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. బాబా గది నుంచి బయటకు వచ్చిన బాబా సోదరుడు జానకి రామయ్య- "వాళ్లని చంపెయ్యండిరా'' అని అరవడం మొదలుపెట్టారు. ఈ లోపు పోలీసులు వచ్చారు. వారితో జానకి రామయ్య ఏదో మాడ్లాడారు. పోలీసులు వెళ్లి నిరాయుధులైన నలుగురిని కాల్చి చంపేశారు.
జానకి రామయ్య రోదన..
ఈ సంఘటన జరిగిన మర్నాడు సాయంత్రం అప్పటి కేంద్ర హోంమంత్రి ఎస్.బి.చవాన్ ప్రశాంతి నిలయానికి వచ్చి సాయిబాబాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పోలీసుల కథనంలో ఎటువంటి మార్పు లేకపోయినా- ట్రస్టు సభ్యులు మాత్రం తమ ప్రత్యర్థి వర్గాలపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. "బాబా తన కుటుంబానికి ఎప్పుడూ ఏదీ చేయలేదు. మిగిలిన వారికే అన్నీ చేశారు. వారు ఇప్పుడు ఆయనపై దాడికి ఎలా దిగారో చూడండి?'' అని తనను కలిసిన 'హిందుస్థాన్ టైమ్స్' రిపోర్టర్ వద్ద బాబా సోదరుడు జానకి రామయ్య కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.
బాబా బయటి వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారని, వారి అసలు రూపం ఇప్పటికైనా తెలిసింది కాబట్టి- ఇకపైనైనా బంధువులకు ప్రాముఖ్యం ఇవ్వాలని బాబా మరో బంధువైన ఆర్.విశ్వనాథ్ కూడా అభిప్రాయపడ్డారు. ఇక ట్రస్టు సీనియర్ సభ్యుడైన ఇందూలాల్ షా తన వ్యాఖ్యల ద్వారా అసలు విషయాన్ని బయటపెట్టారు. "ఇది బాబాపై జరిగిన దాడి కాదు. మా ప్రాంగణంలో రెండు వర్గాల విభేదాలకు సంబంధించినది'' అని స్పష్టంగా చెప్పారు. పైగా ఆయన ఒక దారుణమైన వ్యాఖ్య కూడా చేశారు. "ఇది ట్రస్టు అంతర్గత వ్యవహారం. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం లేదు'' అని నిర్లజ్జగా చెప్పారు.
డబ్బు.. డబ్బు. డబ్బు
ప్రశాంతి నిలయంలోకి పైసా ధనం కూడా తీసుకోరని, విరాళాలు చెక్కుల రూపంలోనే ఉంటాయని, ప్రతి పైసాకు రికార్డు ఉంటుందని ట్రస్టు సభ్యులు చేసే ప్రకటనలలో డొల్లతనం కూడా నాటి ఘటనతో బయటపడింది. దాడి జరగక ముందు ట్రస్టు సభ్యుడొకరు సాయితో సమావేశమవటానికి మందిరంలోకి వెళ్లారు. అక్కడ వందల సంఖ్యలో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు, రూ. లక్షల విలువ చేసే డాలర్ కట్టలు ఉన్నాయి. సంఘటన తర్వాత ఆ సొమ్ము మాయమైంది. ఈ విషయాన్ని అప్పటి సీఐ గంగాధర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
సంపదే కారణం
1992 ముందు సత్యసాయికి ఇ.కె.సురేష్ అనే వ్యక్తి వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవాడు. అతనికి సాయితో పదిహేనేళ్ల అనుబంధం. బాబా చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు అతనికి తెలియకుండా జరిగేది కాదు. ఒక విధంగా అతడు సర్వ శక్తిమంతుడు అయ్యాడు. ఆ సమయానికే ట్రస్టులో విభేదాలు బాగా ముదిరిపోయాయి. కొందరు ట్రస్టు సభ్యులు చేసే అవినీతి గురించి సురేష్ బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
'మీరు చేస్తున్న పనుల గురించి బయట పెడతా' అని కొందరు సభ్యులను బెదిరించటం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితుల్లో సురేష్ స్థానంలో రాధాకృష్ణ సాయి వ్యక్తిగత సహాయకుడిగా నియమితులయ్యారు. అప్పటి కథనాల ఆధారంగా చూస్తే- సాయి సహాయకుడిగా ఉన్న రాధాకృష్ణకు కూడా ట్రస్టుకు సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అతడి అడ్డును తొలగించటానికి కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే 'కాల్పుల' ఘటన జరిగిందని సమాచారం.
బాబా మౌనం
ఈ మొత్తం సంఘటనపై బాబా మౌనంగానే ఉన్నారు. దీని వెనక కూడా ట్రస్టు సభ్యుల హస్తం ఉందని కథనాలు వచ్చాయి. "మీరు పత్రికల వాళ్లతో మాట్లాడితే యక్ష ప్రశ్నలు వేస్తారు. లేనిపోనివి రాసి పరువు, ప్రతిష్ఠ గంగలో కలుపుతారు'' అని ఒక ట్రస్టు సభ్యుడు బాబాతో చెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై బాబా మౌనంగా ఉన్నారనే కథనాలు వెలువడ్డాయి.

No comments:
Post a Comment