దిగి వచ్చిన కేంద్రం జీ .. హజారే
అన్నా డిమాండ్లకు అంగీకారం
'లోక్‌పాల్'పై సంయుక్త కమిటీ
ఫలించిన హజారే దీక్ష..
చైర్మన్‌గా ప్రణబ్,సహాధ్యక్షుడిగా పౌర ప్రతినిధి
సభ్యులుగా మంత్రులు,పౌర ప్రతినిధులు
జూన్ 30లోపు ముసాయిదా బిల్లు
వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటుకు
రోజంతా హైడ్రామా.. సిబల్ దౌత్యం
సోనియా మన్మోహన్ తర్జన భర్జన..
సభ్యులుగా మంత్రులు,పౌర ప్రతినిధులు
జూన్ 30లోపు ముసాయిదా బిల్లు
వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటుకు
రోజంతా హైడ్రామా.. సిబల్ దౌత్యం
సోనియా మన్మోహన్ తర్జన భర్జన..
ఒక్కడు... అదీ కురు వృద్ధుడు... అసలు సిసలైన భారతీయుడు! ఢిల్లీ సర్కార్ మెడలు వంచాడు! కేంద్రానికి ముచ్చెమటలు పట్టించాడు. 'జీ హుజూర్' అనక తప్పని పరిస్థితి కల్పించాడు. అవినీతిపై ఒంటరి పోరు మొదలుపెట్టి, యావద్భారతాన్ని కదిలించిన సామాజిక పోరాట యోధుడు అన్నా హజారే గెలిచారు. నాలుగు రోజులు అన్నం మానేసిన అన్నా... అనుకున్నది సాధించారు.
డిమాండ్లకు కేంద్రం ఓకే
1. జన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాపై పది మందితో సంయుక్త కమిటీ ఏర్పాటవుతుంది. ఇందులో ప్రభుత్వం తరఫున ఐదుగురు, పౌర సంఘాల నుంచి ఐదుగురు ఉంటారు.
2. కమిటీకి కేంద్ర మంత్రి అధ్యక్షత వహిస్తారు. పౌర ప్రతినిధుల్లో ఒకరు సహాధ్యక్షుడిగా ఉంటారు.
3. జూన్ 30 లోపు ఈ బిల్లు ముసాయిదాను సిద్ధం చేస్తారు. జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు.
4. కమిటీకి రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం కుదరదు. ప్రణబ్ లేదా ఒక సీనియర్ మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
5. కమిటీ ఏర్పాటుపై వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇందులో అధ్యక్షుడు, సహాధ్యక్షుడు, సభ్యుల పేర్లతోపాటు కాలపరిమితినీ నిర్దేశిస్తారు.
న్యూఢిల్లీ , ఏప్రిల్ 8: కోరలు లేని, చేవ చచ్చిన లోక్‌పాల్ బిల్లు స్థానంలో... అవినీతిని దునుమాడే, అక్రమార్కులను చండాడే జన్ లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబట్టిన హజారే దీక్షకు కేంద్రం దిగి వచ్చింది. హజారే, ఇతర సామాజిక కార్యకర్తలు పెట్టిన ప్రతిపాదనలను దాదాపు... యథాతథంగా అంగీకరించింది. బహుశా... దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక కీలకమైన చట్టం తయారీలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు 'సరే' అంది.
లోక్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీకి ప్రజా సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. అన్నా హజారే బేరసారాలకు లొంగకపోవడం, ప్రజా మద్దతు క్షణక్షణానికీ పెరుగుతుండటంతో కేంద్రం ఆయన చెప్పినట్లు వినింది. జన్ లోక్‌పాల్ బిల్లుపై హజారే చేపట్టిన దీక్ష శుక్రవారానికి నాలుగో రోజుకు చేరింది. 'తల తెగినా సరే... తల వంచను' అని హజారే విస్పష్టంగా ప్రకటించి తన వైఖరి ఏమిటో తేటతెల్లం చేశారు.
దీంతో శుక్రవారం ఉదయం నుంచే కేంద్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. 'దీక్ష విరమించండి. ప్రభుత్వంతో నేను మాట్లాడతాను' అని గురువారం హజారేను కోరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని మన్మోహన్‌ను కలిసి... ఎట్టి పరిస్థితుల్లో ఈ అనిశ్చితికి తెరవేయాలని సూచించారు. అటు... రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.
'సమస్యను పొడిగించవద్దు' అని మన్మోహన్‌ను ఆమె ఆదేశించారు. దీంతో ప్రభుత్వం వైపు నుంచి రాయబారాలు ఊపందుకున్నాయి. కేంద్ర తరఫున మంత్రులు కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, సల్మాన్ ఖుర్షీద్‌లు.. హజారే తరఫున ప్రతినిధులుగా వచ్చిన కేజ్రీవాల్, అగ్నివేశ్‌లతో పలు దఫాలుగా చర్చించారు. సంయుక్త కమిటీకి సరే అంటూనే... దీనిపై న్యాయశాఖ చేత ప్రకటన చేయిస్తామని మంత్రులు తెలిపారు. ఇందుకు హజారే ససేమిరా అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కమిటీ వేయాలని తేల్చి చెప్పారు. చివరికి... సర్కారు ఈ డిమాండ్‌ను కూడా అంగీకరించింది.
తమ డిమాండ్లను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించిందని హజారే ప్రకటించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తాను దీక్ష విరమిస్తానన్నారు. దీనిని ప్రజా విజయంగా అభివర్ణించారు. తాను కమిటీలో సభ్యుడిగా మాత్రమే ఉంటానని హజారే స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సంతోష్ హెగ్డే (కర్ణాటక లోకాయుక్త), జస్టిస్ జేఎస్ వర్మల పేర్లను ప్రతిపాదించారు. అయితే... అధ్యక్ష పదవి స్వీకరించేందుకు హెగ్డే నిరాకరించారు.
జూన్ 30లోపు ముసాయిదా: సిబల్
హజారే నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి సిబల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది మన దేశ ప్రజాస్వామ్య శక్తికి సంకేతామన్నారు. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని రుజువైందన్నారు. "ముసాయిదా కమిటీ జూన్ 30లోపు తమ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గం దీనిని ఆమోదించాలి.
జులై మొదటి వారంలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతాం'' అని సిబల్ ప్రకటించారు. కేంద్ర న్యాయ మంత్రి మొయిలీ కూడా విలేకరులతో మాట్లాడారు. "ముసాయిదా కమిటీని నియమిస్తూ వెంటనే ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేస్తాం. అందులో అధ్యక్ష, సహాధ్యక్షులతో పాటు మొత్తం పది మంది పేర్లను కూడా వెల్లడిస్తాం. కమిటీ నివేదిక ఎప్పట్లోపు ఇవ్వాలనే కాల పరిమితిని కూడా నిర్దేశిస్తాం'' అని చెప్పారు.
చర్చల మీద చర్చలు...
హజారే డిమాండ్లను అంగీకరించేందుకు ముందు కేంద్రం తర్జన భర్జనలు పడింది. శుక్రవారమంతా హైడ్రామా నడిచింది. 'లోక్‌పాల్ బిల్లువిషయంలో చొరవ తీసుకోండి' అంటూ ప్రధాని మన్మోహన్, సోనియాలకు హజారే శుక్రవారం మళ్లీ లేఖలు రాశారు. దీనిపై ప్రధాని... సోనియా, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, ప్రణబ్, ఖుర్షీద్, మొయిలీలతో చర్చించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో 35 నిమిషాల పాటు చర్చించారు.
సమస్యను పరిష్కరించే బాధ్యతను సిబల్, మొయిలీ, ఖుర్షీద్‌లకు అప్పగించారు. దీంతో హజారే ప్రతినిధులతో వీరు మరో విడత చర్చలు జరిపారు. హజారే పట్టు విడవకపోవడంతో... కేంద్ర ప్రభుత్వం ఒక్కో మెట్టు దిగుతూ వచ్చింది. ప్రణబ్‌ను కమిటీ అధ్యక్షుడిగా అంగీకరించబోమన్న డిమాండ్‌పైనా హజారేను సంతృప్తి పరుస్తూ... ప్రజా సంఘాల నుంచి ఒకరిని సహాధ్యక్షుడిగా నియమించేందుకు సరే అంది.

--
No comments:
Post a Comment